📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: India-China ఇండియా, చైనా బంధం అమెరికా ఆధిపత్యాన్ని తగ్గించేనా?

Author Icon By Vanipushpa
Updated: August 23, 2025 • 5:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

“మౌనం వహించడం, రాజీపడడం అనేవి బెదిరించేవారికి మరింత ధైర్యాన్నిస్తాయి. బహుళపక్ష వాణిజ్య వ్యవస్థను కాపాడుకోవడానికి భారతదేశం(India) తో చైనా(China) దృఢంగా నిలబడుతుంది” అంటూ ఇటీవల భారత్‌లోని చైనా రాయబారి జు ఫీహాంగ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భారత్‌పై అమెరికా(America) విధించిన అదనపు సుంకాలు ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో జు ఫీహాంగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ఒక విదేశీ దౌత్యవేత్త నుంచి మరో దేశంపై ఇలాంటి వ్యాఖ్య చేయడం అసాధారణమని విదేశీ వ్యవహారాల నిపుణులు పేర్కొంటున్నారు. చైనాలో షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సమావేశం మరికొన్నిరోజుల్లో జరగనున్న సమయంలో చైనా రాయబారి నుంచి ఈ ప్రకటన వచ్చింది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు.
అమెరికాకు వ్యతిరేకంగా చైనా
అమెరికా సుంకాలకు వ్యతిరేకంగా గళం విప్పుతున్న దేశాల్లో చైనా ముందంజలో ఉంది. ఆ రెండు దేశాల మధ్య ఉద్రిక్తత బాగా పెరిగింది. చైనా వస్తువులపై అమెరికా 145 శాతం పన్ను విధించింది. అమెరికా ఉత్పత్తులపై చైనా 125 శాతం పన్ను విధించింది. ఆ తర్వాత 2025 మేలో జెనీవాలో జరిగిన సమావేశంలో రెండు దేశాలు వాణిజ్య ఒప్పందంలో భాగంగా సుంకాలను తగ్గించాయి. అయినప్పటికీ రెండు దేశాల మధ్య సుంకాల సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు. చైనా మరోసారి ఆగస్టు 21న అమెరికాకు వ్యతిరేకంగా తన స్వరాన్ని పెంచింది. కానీ ఈసారి అది విదేశీ గడ్డపై… భారత్‌లో. అమెరికాను బెదిరింపులకు పాల్పడే దేశంగా పేర్కొన్న జు ఫీహాంగ్.. ఆ దేశం స్వేచ్ఛా వాణిజ్యం నుంచి అనేక ఏళ్లుగా ప్రయోజనాలు పొందిందని.. ఇప్పుడు ఇతర దేశాల నుంచి అధిక ధరలను డిమాండ్ చేయడానికి సుంకాలను బేరసారాల సాధనంగా ఉపయోగిస్తోందని ఆరోపించారు. ”భారత్‌పై అమెరికా 50 శాతం వరకు సుంకాలను విధించింది. ఇంకా ఎక్కువ సుంకాలను విధిస్తామని బెదిరించింది. చైనా దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. నిశ్శబ్దం బెదిరింపుదారులను ప్రోత్సహిస్తుంది” అని ఆయన అన్నారు. ఆసియాలో ఆర్థిక వృద్ధికి రెండు దేశాలను(భారత్, చైనా) ‘డబుల్ ఇంజిన్’గా అభివర్ణించిన ఆయన.. భారత్, చైనా ఐక్యత మొత్తం ప్రపంచానికి ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు.

India-China ఇండియా, చైనా బంధం అమెరికా ఆధిపత్యాన్ని తగ్గించేనా?

చైనా వ్యతిరేక వాతావరణం తగ్గుతుందా?
యుక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను భారత్ పెంచింది. ఇది అమెరికాతో సంబంధాలపై ప్రభావం చూపింది. వాణిజ్య ఒప్పందంపై చర్చలను ప్రభావితం చేసింది. ప్రపంచ ఇంధన మార్కెట్లను స్థిరీకరించడానికి రష్యా చమురును కొనుగోలు చేయాలని బైడన్ పరిపాలనా యంత్రాంగం కోరిందని భారత్ వాదించింది. మరోవైపు అమెరికా… యుక్రెయిన్ యుద్ధంలో భారత్ రష్యాకు మద్దతిస్తోందని ఆరోపిస్తోంది. ఓ వైపు అమెరికాతో భారత్ వాణిజ్య సంబంధాలలో అస్థిరత కనిపిస్తుండగా, మరోవైపు భారత్, చైనా మధ్య సంబంధాలు వేగంగా మెరుగుపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.

‘భారత్, చైనా మధ్య సాన్నిహిత్యం పెరగడానికి అనేక కారణాలు

”భారత్, చైనా మధ్య సాన్నిహిత్యం పెరగడానికి అనేక కారణాల్లో అమెరికా ఒకటి. కొన్ని నెలలుగా రెండు దేశాల మధ్య నిరంతరం చర్చలు జరుగుతున్నాయి. చైనా ఆర్థికంగా సంపన్నమైనది. భారత్‌కు ముఖ్యమైన వాణిజ్య భాగస్వామి. దెబ్బతిన్న సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ఇది సాధారణ ప్రక్రియ” అని చింతామణి మహాపాత్ర చెప్పారు. ఈ వారం ప్రారంభంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి రెండు రోజుల పర్యటన కోసం దిల్లీ వచ్చారు. భారత్, చైనా ఒకదాన్నొకటి ‘ప్రత్యర్థులు’గా కాకుండా “భాగస్వాములు”గా చూడాలని ఆయన అన్నారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/scam-government-employee-loses-rs-1-9-lakh-in-maharashtra/national/535070/

china Geopolitics Global Power Shift india International Relations Latest News Breaking News Telugu News us

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.