📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News : India and China : భారత్, చైనాల మైత్రి ప్రపంచాభివృద్ధి కోసమే

Author Icon By Sudha
Updated: October 22, 2025 • 3:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్, చైనాల మైత్రి మీద ప్రపంచ శాంతి ఆధారపడి ఉందని ఒక విజ్ఞుడు అన్న మాట ల్లోని నిజం తరచి తరచి చూడాల్సిన అవసరం లేదు. కొన్ని దశాబ్దాల కిందట రష్యా అమెరికాల వైఖరిని అనుసరించే దేశాల్లో శాంతి, సుస్థిరత భాసిల్లుతుందని అనేవారు. ఆ చైనా, భారత్లు ఆ స్థాయిలో ఇప్పుడు నాయకత్వ దశకు చేరుకున్నాయన్న ఆలోచనను కొట్టిపడేయొద్దు. ఇప్ప టికి చైనా భారత్ల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి డెబ్భైఐదేళ్లు నిండాయి. 1950 సంవత్సరం నుంచి ఏర్పడిన ఈ సంబంధం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. భాయీ భాయీగా మెలగాలనుకున్న ఈ దేశాల నాయకులు విడి పోతూ, కలుస్తూనే ఉన్నారు. ఘర్షణలు పడ్డారు. అభివృద్ధి లో పోటీపడ్డారు. దౌత్య సంబంధాలు పూర్తిగా సత్సంబం ధాల దిశగా అడుగులు వేయకపోయినా తొందరపడి తెగ తెంపులు చేసుకోలేదు. అవసరాన్ని బట్టి ఒకరు కోపాన్ని ప్రదర్శిస్తే మరొకరు తగ్గే విధంగా ప్రవర్తించారు. కుటుంబం లోని సోదరుల మాదిరే నడుచుకున్నారు. అంతమాత్రాన చైనా, భారత్ అక్కరకు వస్తుందని గట్టిగా ఎవరూ చెప్పలేరు. చైనా కోసం భారత్ ఇతర దేశాలతో స్నేహం తెంపుకోదు. చైనాను కాదని ఇతర దేశాలను దగ్గరకు తీయదు. దౌత్య సంబంధాలు నిర్వచించటం కష్టం. ఒక త్రాసులో దేశాల విలువలను తూచేందుకు తూనిక రాళ్లను ఎవరూ కనిపెట్ట లేదు. ‘వరల్డ్ ఈజ్ స్మాల్ అన్న నానుడి ఊరికనే ప్రాచు ర్యం పొందలేదు. చిన్న దేశాన్ని పెద్ద దేశం పక్కన పడేసి పెద్ద దేశానికే పెద్దపీట వేసే స్థితిలో అంతర్జాతీయ వ్యవహారాలు లేవు. ఎవరి దారి వారిదే కానీ అంత మాత్రాన వారి దారులు కలవవని ఎవరూ బల్లగుద్ది చెప్పలేదు.

Read Also: Trump: మోదీ నాకు గొప్ప మిత్రుడు: ట్రంప్

India and China

స్నేహసంబంధాలు

ఈ మధ్య కాలంలో చైనా ప్రసిడెంట్ జిన్ పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోడీ (2014-2024) 18 సార్లు కలిశారు. 2014 సంవత్సరాన్ని చైనా, ఇండియా ఫ్రెండ్షిప్ సంవ త్సరంగా ప్రకటించారు. అందుకనే జిన్ పింగ్ అధికారికంగా భారత్లోని అహమ్మదాబాదు అంటే ప్రధాని స్వంత రాష్ట్రాన్ని సందర్శించి మరింత దగ్గరగా స్నేహసంబంధాలను పెంపొందించు కుంటామని ప్రకటించారు. మోడీ కూడా 2015లో చైనాను మొదటి సారిగా జిన్ పింగ్ సొంత రాష్ట్రంలోనే చైనా పర్యటన మొదలు పెట్టారు. ఇన్నిసార్లు కలిసినా, ఇద్దరు నాయకులు 2024లో 16వ బ్రిక్స్ సమ్మిట్ సందర్భంగా కజాన్లో ప్రత్యేకంగా విడిగా కలుసుకొని ఇరు దేశాల స్నేహసంబంధాలను మరింత దృఢతరం చేసు కోవాలని మాట్లాడుకున్నారు.ఇన్నిసార్లు కలుసుకొని మాట్లా డుకున్నంత మాత్రాన, విభేదాలు తొలిగిపోతాయని, విద్వేషాలు రగులుకోవని భావించటం పొరపాటే. కానీ ఇలా కలు సుకోవటం ఒకరినొకరు అర్థం చేసుకొనే ప్రయత్నం చేయ డం సంబంధాలను మెరుగుపర్చుకొనేందుకు విద్వేషాలను తొలగించుకొనేందుకే! ఇది తెలుసుకోవాల్సిన అవసరం పాకి స్థాన్, అమెరికా లాంటి దేశాలకు ఉన్నది. జాగ్రత్తపడే దేశాలు ఈ దేశాల వైఖరిని చూసి వాస్తవికతను దౌత్యపరంగా అర్థం చేసుకొని మార్పులూ, చేర్పులకు చోటిచ్చే ప్రయత్నం చేయొచ్చు.

యు.ఎన్.ఓ పాత్ర గమనార్హం

యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏర్పడి 80 సంవత్సరాలయింది. మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాల తో యావత్తు ప్రపంచానికి సంభవించిన నష్టాలను అధిగ మించి, ఫాసిస్ట్ చర్యలకు చరమగీతం పాడేందుకు ఏర్పడ్డ వ్యవస్థ ముఖ్యోద్దేశం ప్రపంచ శాంతితోపాటు అభివృద్ధిని సాధించడం. ఆ లక్ష్యంతో ఏర్పడ్డ ఈ సంస్థ మీద ఎన్నో ఆశలున్నాయి. కొన్నిసార్లు ఆ ఆశలు అడియాసలైనా దేశాల మధ్య ఏర్పడ ఘర్షణలను యుద్ధాలను నివారించడానికి, నిర్మూలించడానికి మధ్యవర్తిత్వం వహించే దిశగా చాలాసార్లు విజయాన్ని తాత్కాలికంగా అయినా సాధించగలిగింది. ఈ మధ్యకాలంలో అమెరికా ఐ.ఎమ్.ఎఫ్ లాంటి అనుబంధ వ్యవస్థలు బలహీనపడ్తున్న వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు. సెక్యూరిటీ కౌన్సిల్లో శాశ్వత సభ్యత్వం కలిగిన దేశాలు వీటో ఆయుధాన్ని అడ్డుగోలుగా వాడుతూ అసలుకేమోసాన్ని తలపెట్టడం యు.ఎన్.ఓను దెబ్బతీస్తున్నది. అగ్రదేశాలు యు.యన్.ఓను బలహీనపర్చటాన్ని వ్యతిరేకించి గట్టి చర్యలు తలపెట్టకపోతే ప్రపంచ శాంతి అభివృద్ధి కేవలం కాగితాలకే పరిమితమవుతాయి. ఏకపక్షవాదం (యూనిలేట రలిజం) నుంచి (మల్టీ లేటరలిజం) బహుపక్షవాదం దిశగా అందుకే అడుగులు పడుతున్నాయి. కొందరు సభ్యులకు విటో పవర్, మారిన పరిస్థితుల్లో ధారాదత్తం చేయడం ఎంత మాత్రం సమంజసంగా లేదు. సెక్యూరిటీ కౌన్సిల్ సభ్యత్వం విషయంలో సమగ్ర మార్పులు అవసరమనిపి స్తుంది. అన్ని దేశాలు సమానం అన్న సిద్ధాంత ప్రాతిపదిక మీద సెక్యూరిటీ కౌన్సిల్ విధానపర నిర్ణయాలను దృష్టిలో ఉంచుకొని శాంతి అభివృద్ధి కోసం నిర్ణయాలు తీసుకోవాలి. అగ్రదేశాల నాయకత్వం, యు.ఎన్.ఓ వ్యవస్థను బలోపేతం చేయాలి. నిర్వీర్యం చేయకూడదు. ప్రస్తుతం కొన్ని దేశాల మధ్య ఘర్షణలూ, యుద్దాల విషయాలలో నిర్ణయాలు పక్ష పాతరహితంగా ఉండటం లేదన్న విమర్శ వినపడుతున్నది. కంటితుడుపు చర్యలతో యుయన లక్ష్యాలు నెరవేరవు. రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్- పాలస్తీనా, పాకిస్థాన్- అఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్- ఇండియాల మధ్య సరిహద్దు తగాదాలతో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న కాశ్మీర్ సమస్య పరి ష్కార దిశగా అడుగులు వేయలేకపోతున్నది. పహల్గాం సంఘటన తర్వాత తీసుకున్నచర్యలు తీవ్రంగాలేవు. ముఖ్యంగా టెర్రరిజం అణచివేత విధానంలో స్పష్టతను దేశాలకు ఇవ్వ లేకపోతున్నది. చైనా, భారత్ దేశాలు ప్రస్తుత పరిస్థితులలో బహుళపక్ష వాదంతో శాంతి, అభివృద్ధి సాధించడం కోసం ముందడుగు వేయాలి. 25వ యస్.సి.ఓ (సింఘై కోపరే షన్ ఆర్గనైజేషన్) టిన్టిన్ జిన్పింగ్ మోడీ సమావేశం గ్లోబల్ శాంతిస్థాపనకు, బహుముఖోభివృద్ధికి మార్గదర్శకం గా నిలుస్తుంది. ఈ సమ్మిట్లో గ్లోబల్ గవర్నన్స్ ఇనీషి యేటివ్ (జిజిఐ) ప్రత్యేకస్థానం వహిస్తుంది.

India and China

జిన్ పింగ్ అయిదు సూత్రాలు

జిన్ పింగ్ ప్రతి పాదించిన అయిదు సూత్రాలు మార్గదర్శకంగా ఉన్నాయి. సార్వభౌమాధికార సమానత్వం, ఇంటర్నేషనల్ రూల్ ఆఫ్ లా పాటించడం, బహుళపక్ష వాదం, ప్రజలను కేంద్రీ కరించే ఏ విధానమైనా, నిజమైన ఫలితాలు రాబట్టాలి.జిజిఐ ప్రజల బాగుకోసం జిన్పింగ్ ప్రతిపాదించడం హర్షణీయం. మోడీ బలపర్చటం ఈ ప్రతిపాదనలకు మరింత ఊతానిచ్చింది. యస్.సి.ఓ, బ్రిక్స్ కీలక సభ్యులుగా చైనా, భారత్ గ్లోబల్ గవర్నెన్స్ కోసం శ్రమించాలి. అంతేగాదు అన్ని ప్రతిపాద నలు దేశాల స్థాయిలో ఆలోచించేలా చేయగలుగుతే భారత్, చైనా ఇతర దేశాల అభివృద్ధితోపాటు శాంతి స్థాపనకు కృషి చేసినవారవుతారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇతోధిక ప్రోత్సాహం అందించాలి. ప్రపంచ పాలన సరైన దిశలో నడిచే విధంగా ఈ రెండు దేశాలు మరింత కృషి చేస్తే ప్రపంచశాంతికి అభివృద్ధికి తోడ్పడినట్లు అవుతుంది.
-రావులపాటి సీతారాం రావు

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News Diplomacy geopolitical ties global development India China Relations International Relations latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.