📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Randhir Jaiswal: భారత్‌-కెనడా సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నాలు: రణ్‌ధీర్‌ జైస్వాల్

Author Icon By Vanipushpa
Updated: July 18, 2025 • 4:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రెండేళ్లుగా స్తబ్దుగా ఉన్న భారత్‌-కెనడా(India-canada) సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నాలు మళ్లీ ప్రారంభమయ్యామని విదేశాంగ మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది. ఇరు దేశాలు హైకమినర్లను నియమించే పనిలో ఉన్నాయని వెల్లడించింది. భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైస్వాల్(Randhir Jaiswal) ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ‘జీ7 సదస్సు సందర్భంగా కెనానాస్కిస్​లో ప్రధాని స్థాయిలో సమావేశం జరిగింది. అక్కడు ఇరు దేశాల నేతలు భారత- కెనడా సంబంధాల ప్రాముఖ్యతను, మళ్లీ పునరుద్ధరించే విషయంపై చర్చించారు. అందుకోసం ఇరు దేశాలు కలిసి పని చేస్తున్నాయి. రాజధానుల్లో హైకమిషనర్ల నియామకంపై కూడా కృషి కొనసాగుతోంది. భారత్-కెనడా సంబంధాల్లో వచ్చిన ఈ మార్పుపై సానుకూలంగా ఉన్నాం’ అని అన్నారు.

భారత్‌-కెనడా సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నాలు: రణ్‌ధీర్‌ జైస్వాల్

విదేశాంగ శాఖ అధికారికంగా ఓ ప్రకటనను విడుదల

గతనెల జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కెనడా ప్రధాని మార్క్​ కార్నీ భేటీ అనంతరం విదేశాంగ శాఖ అధికారికంగా ఓ ప్రకటనను విడుదల చేశామని జైస్వాల్ గుర్తు చేశారు.’ జీ7 సందర్భంగా కెనడా, భారత్ ప్రధానుల మధ్య సానుకూల, నిర్మాణాత్మక సమావేశం జరిగింది. ఈ భేటీలో ఇరుదేశాల భాగస్వామ్య విలువలు, ప్రజాస్వామ్యం, న్యాయపాలన వంటి అంశాలపై చర్చించారు. ఇరుదేశాల మధ్య బలోపేతమైన చర్యలకు అడుగులు పడ్డాయి.

ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి

2023లో ఖలిస్థానీ అనుకూలవాది నిజ్జర్‌ హత్య వెనక భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం ఉందంటూ కెనడా మాజీ ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఆరోపణలు చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. కాగా, భారత్‌ మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేసింది. ఆ సమయంలోనే కెనడా-భారత్ రాయబారులను వెనక్కి పిలిపించారు. కెనడాలో ఉగ్రవాదం, భారత్ వ్యతిరేక కార్యకలాపాలపై భారత్​ పదేపదే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. అలాంటి శక్తులపై చర్యలు తీసుకోవాలని కెనడా అధికారులను కోరుతోంది. ఆ తర్వాత కెనడా ఎన్నికల్లో న్యూదిల్లీ జోక్యం చేసుకోనుందని ఆ దేశ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్‌ సర్వీస్‌ డిప్యూటీ డైరెక్టర్‌ వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఇరుదేశాల ప్రధానుల భేటీ అనంతరం హైకమిషనర్లను నియమిచేందుకు ఇరుదేశాలు అంగీకరించాయి .

భారతదేశం మరియు కెనడా మధ్య దౌత్య వివాదం ఏమిటి?
కెనడా-భారత్ దౌత్య వివాదం అనేది కెనడా మరియు భారతదేశం మధ్య సెప్టెంబర్ 2023లో ప్రారంభమైన కొనసాగుతున్న దౌత్య వివాదం, తరువాతి సంవత్సరం అంతా ఆవర్తనంగా తీవ్రమవుతుంది.
కెనడాలో అతిపెద్ద పరిశ్రమలు ఏవి?
కెనడా ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా అత్యంత అభివృద్ధి చెందిన దేశం, ఇది ప్రపంచ వాణిజ్యాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. దీని అతిపెద్ద పరిశ్రమలు రియల్ ఎస్టేట్, మైనింగ్ మరియు తయారీ ఇది ప్రపంచంలోని అతిపెద్ద మైనింగ్ కంపెనీలలో కొన్నింటికి నిలయం.

Read hindi news: hindi.vaartha.com

Read also: Ashok Gajapathi Raju: టీడీపీకి రాజీనామా చేసిన అశోక్ గజపతిరాజు

Bilateral Ties Canada Politics Diplomatic talks foreign affairs India diplomacy India-Canada relations Latest News Breaking News Randhir Jaiswal

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.