📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: Trump: భారత్ రష్యా నుంచి తక్కువ చమురు కొనుగోలు చేస్తుంది: ట్రంప్

Author Icon By Vanipushpa
Updated: October 18, 2025 • 12:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump) చెప్పిన మాటలే మరోసారి చెప్పారు. రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ ఎంతో కొంత తగ్గించిందని ఆయన వ్యాఖ్యానించారు. మునుపటి కంటే తక్కువగానే రష్యా ఆయిల్‌ను భారత సర్కారు కొంటోందని, త్వరలోనే పూర్తిగా ఆ కొనుగోళ్లను ఆపుతుందన్నారు. రష్యా చమురును కొనడాన్ని ఆపమని హంగరీ దేశానికి కూడా చెప్పానని ట్రంప్ తెలిపారు. వాస్తవానికి హంగరీకి సముద్ర తీరమేదీ లేదని, భౌగోళికపరమైన అనివార్య పరిస్థితుల వల్ల ఆ దేశం రష్యా నుంచే చమురును కొనాల్సి వస్తోందన్నారు. కొన్ని రోజుల క్రితం కూడా ట్రంప్ ఇవే వ్యాఖ్యలు చేశారు.

Read Also: Mary Millben: మోదీ ట్రంప్ కి ఎందుకు బయపడుతాడు అమెరికన్ సింగర్

ట్రంప్ వ్యాఖ్యను ఖండించిన భారత్

“రష్యా నుంచి చమురును కొనేది లేదని భారత ప్రధాని మోదీ నాకు హామీ ఇచ్చారు” అని అప్పట్లో చెప్పుకొచ్చారు. ట్రంప్ వ్యాఖ్యను గురువారం రోజు భారత్ ఖండించింది. దేశ ప్రజల ప్రయోజనాల ప్రకారమే ఇంధన వనరులను సమకూర్చుకుంటామని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అధ్యక్షుడిగా తన పరువును కాపాడుకునే యత్నంలో ట్రంప్ తాజా కామెంట్స్ చేసినట్లు కనిపిస్తోంది. శనివారం రోజు వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ‌తో అమెరికా ప్రెసిడెంట్ ద్వైపాక్షిక సమావేశం జరిగింది. ఈసందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ పైవ్యాఖ్యలు చేశారు.

US: భారత్ రష్యా నుంచి తక్కువ చమురు కొనుగోలు చేస్తుంది: ట్రంప్

రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని కూడా ఆపబోతున్నాను!

తాను 8 ప్రపంచ సైనిక ఘర్షణలను ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. రువాండా – కాంగో, భారత్ – పాక్ యుద్ధాలను ఆపిందీ తానేనన్నారు. అణ్వస్త్రాలు కలిగిన భారత్ – పాక్ లాంటి దేశాల సైనిక ఘర్షణను ఆపడం చాలా పెద్ద విషయమని ఆయన తెలిపారు. తన వల్లే ఆ రెండు దేశాల్లోని లక్షలాది మంది ప్రజల ప్రాణాలకు రక్షణ లభించిందని పాకిస్థాన్ ప్రధానమంత్రి చెప్పారన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలనే తన ప్రయత్నాలు కూడా త్వరలోనే ఫలించబోతున్నాయని ట్రంప్ చెప్పారు. ఆ యుద్ధం సైతం ఆగబోతోందని, దీంతో తాను ఆపిన యుద్ధాల సంఖ్య 9కి చేరుతుందన్నారు.

రెండున్నర గంటల పాటు పుతిన్‌తో ట్రంప్ ఫోన్ కాల్ చర్చలు

ఇటీవలే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో రెండున్నర గంటల పాటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్‌కాల్‌లో మాట్లాడారు. ఈ నేపథ్యంలో శనివారం రోజు జెలెన్‌స్కీ‌తో ట్రంప్ భేటీ కావడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. పుతిన్‌తో ఫోన్ కాల్ అనంతరం ట్రంప్ కీలక ప్రకటన విడుదల చేశారు. త్వరలో హంగరీ రాజధాని బుడాపెస్ట్ నగరం వేదికగా పుతిన్‌తో తాను సమావేశం అవుతానని వెల్లడించారు. ఆ భేటీలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేస్తానని ఆయన తెలిపారు. “గత అమెరికా ప్రభుత్వాలన్నీ యుద్ధాలను పెంచి పోషించాయి. కనీసం ఒక్క యుద్ధాన్ని కూడా అవి ఆపలేకపోయాయి. బుష్ సహా ఎంతోమంది అమెరికా అధ్యక్షులు యుద్ధాలను ఆరంభించిన వాళ్లు మాత్రమే. సైనిక ఘర్షణలను ఆపిన వాళ్లు కానే కాదు. కానీ నేను చాలా యుద్ధాలను ఆపాను. లక్షలాది మంది ప్రజల ప్రాణాలను కాపాడాను. నేను తలచుకుంటే చాలా ఈజీగా యుద్ధాలను ఆపుతాను.

ట్రంప్ కూతురు ఎక్కడ ఉంది?

2021లో వాషింగ్టన్‌ను విడిచిపెట్టినప్పటి నుండి, ఇవాంకా మరియు ఆమె భర్త ఫ్లోరిడాలోని సర్ఫ్‌సైడ్‌లో నివసిస్తున్నారు. ట్రంప్ తన భర్త మరియు పిల్లలతో కలిసి వాలెంటే సోదరుల క్రింద బ్రెజిలియన్ జియు-జిట్సును అభ్యసించడం ప్రారంభించాడు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

India energy relations India Russia oil imports Latest News Breaking News Telugu News Trump foreign policy remarks Trump on India Russia oil trade Trump statement on India

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.