📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Budget 2026: బడ్జెట్‌లో బంగ్లాదేశ్‌కు భారీ కోతతో భారత్ గుణపాఠం

Author Icon By Vanipushpa
Updated: February 2, 2026 • 1:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

2026 బడ్జెట్‌తో భారత్ ప్రపంచానికి స్పష్టమైన సందేశం ఇచ్చింది. తమతో స్నేహంగా ఉండేవారికి అండగా నిలుస్తామని, కానీ విద్వేషం చూపే దేశాలకు సహాయం తగ్గించి గుణపాఠం నేర్పుతామని నిరూపించింది. ఆదివారం పార్లమెంటులో సమర్పించిన 2026 బడ్జెట్‌ (Budget 2026)లో బంగ్లాదేశ్‌కు ఇచ్చే నిధుల్లో భారీగా కోత విధించింది కేంద్రం. బంగ్లాదేశ్ గతకొంత కాలంగా భారత్ వ్యతిరేక విధాలను అవలంభిస్తోంది. అలాగే అక్కడ మైనారిటీలుగా ఉన్న హిందువులపై దాడులను ప్రోత్సహిస్తోంది. దీంతో భారత్ బంగ్లాదేశ్‌కు ఫండ్స్ సగానికి తగ్గించింది. నైబర్‌హుడ్ ఫస్ట్ పాలసీ కింద, భారతదేశం ప్రతి సంవత్సరం పొరుగు దేశాలకు నిధులు కేటాయిస్తుంది. ఈసారి కూడా ఇండియా పెద్దన్న పాత్ర పోషించింది. స్నేహపూర్వక దేశాలపై తన ప్రేమను కురిపించింది.

Read Also: Uttar Pradesh: తల్లిదండ్రులతో కలిసి ప్రేమించిన భర్తను చంపిన భార్య

Budget 2026: బడ్జెట్‌లో బంగ్లాదేశ్‌కు భారీ కోతతో భారత్ గుణపాఠం

బంగ్లాదేశ్ భారీ నష్టం

2026 బడ్జెట్ కేటాయింపుల్లో బంగ్లాదేశ్ భారీ నష్టాన్ని చవిచూసింది. ఈ సంవత్సరం దీనికి నిధులు సగానికి తగ్గించబడ్డాయి. గత సంవత్సరం దీనికి రూ.1.2 బిలియన్లు కేటాయించగా, దానిని రూ.60 కోట్లకు తగ్గించారు. ఎందుకంటే బంగ్లాదేశ్ గత సంవత్సరం కేటాయించిన రూ.1.2 బిలియన్లలో రూ.34 కోట్లు మాత్రమే ఉపయోగించింది. దీంతో బంగ్లాదేశ్ నైబర్‌హుడ్ ఫండింగ్‌ తగ్గించింది. భూటాన్‌కు అత్యధికంగా రూ.2,288.55 కోట్ల ఫండ్స్ కేటాయించారు. ఈ నిధులు అక్కడ జలవిద్యుత్ ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ఉపయోగించబడతాయి. భారతదేశంతో ప్రత్యేకమైన, సన్నిహిత సంబంధాన్ని పంచుకునే నేపాల్ రూ.8 బిలియన్ల పెరిగిన సహాయాన్ని అందుకుంది. గత సంవత్సరం అది రూ.7 బిలియన్లుగానే ఉంది. భూటాన్ తర్వాత భారతదేశం తన రెండవ అత్యంత విశ్వసనీయ దేశమైన మారిషస్‌కు తన సహాయాన్ని పెంచింది. రూ.550 కోట్లు విడుదలయ్యాయి. గత సంవత్సరం రూ.500 కోట్ల నుండి ఇది రూ.50 కోట్లు ఎక్కువ. సీషెల్స్ గత సంవత్సరం మాదిరిగానే రూ.19 కోట్ల గ్రాంట్‌ను అందుకుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Bangladesh aid reduction budget cuts Diplomatic Relations India Bangladesh relations India Foreign Policy South Asia politics Union Budget impact

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.