📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్

Trade War: అమెరికా 3.6 బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందానికి భారత్ బ్రేక్

Author Icon By Vanipushpa
Updated: August 8, 2025 • 11:33 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్, అమెరికా(India-US) మధ్య వాణిజ్య యుద్ధం(Trade War) తీవ్ర స్థాయికి చేరుకుంది. భారత దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) 50 శాతం టారిఫ్లు విధించడంతో దానికి ప్రతిగా భారత్ తీవ్రమైన నిర్ణయం తీసుకుంది. అమెరికాకు చెందిన విమాన తయారీ దిగ్గజం బోయింగ్‌తో దాదాపు తుది దశలో ఉన్న 3.6 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 30,000 కోట్లు) కీలక రక్షణ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాల్లో ఇది ఒక పెద్ద ఎదురుదెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు.

Trade War: అమెరికా 3.6 బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందానికి భారత్ బ్రేక్

అసలు ఒప్పందం ఏమిటి?
భారత నౌకాదళం కోసం ఆరు అధునాతన పీ-8ఐ పొసైడాన్ విమానాలను బోయింగ్ నుంచి కొనుగోలు చేసేందుకు ఈ ఒప్పందం కుదిరింది. సముద్రంపై సుదూర నిఘా, జలాంతర్గాములను గుర్తించి ధ్వంసం చేయగల సామర్థ్యం ఈ విమానాల ప్రత్యేకత. వాస్తవానికి 2014లో ఈ ఒప్పందం విలువ 2.42 బిలియన్ డాలర్లుగా ఉండేది. కానీ ద్రవ్యోల్బణం, సరఫరా గొలుసులో అంతరాయాలు, తాజాగా విడిభాగాలపై అమెరికా విధించిన 25 శాతం సుంకాల‌ కారణంగా దీని ధర 3.6 బిలియన్ డాలర్లకు పెరిగిపోయింది. ప్రాజెక్టు వ్యయం దాదాపు 50 శాతం పెరగడంతో భారత్ ఈ కొనుగోలుపై పునరాలోచనలో పడింది.
భారత్ ఎందుకీ నిర్ణయం తీసుకుంది?
రష్యా నుంచి భారత్ ముడిచమురు కొనుగోలు చేస్తుండటం, తద్వారా ఉక్రెయిన్ యుద్ధానికి పరోక్షంగా ఆజ్యం పోస్తోందని ఆరోపిస్తూ ట్రంప్ ప్రభుత్వం భారత్‌పై భారీ టారిఫ్లను విధించింది. ఈ టారిఫ్ల కారణంగానే పీ-8ఐ విమానాల ధర విపరీతంగా పెరిగిపోయింది. పెరిగిన ఖర్చుతో పాటు, అమెరికా వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఈ ఒప్పందాన్ని ప్రస్తుతానికి నిలిపివేయాలని నిర్ణయించింది.
బోయింగ్ సంస్థకు భారీ నష్టం
ఈ నిర్ణయం బోయింగ్ సంస్థకు భారీ నష్టాన్ని కలిగించనుంది. భారత్‌లో బోయింగ్ సంస్థకు సుమారు 5000 మంది ఉద్యోగులు ఉండటంతో పాటు, ఏటా 1.7 బిలియన్ డాలర్ల మేర భారత ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు అందిస్తోంది. మరోవైపు, హిందూ మహాసముద్రంలో చైనా కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ విమానాల అవసరం భారత నౌకాదళానికి ఎంతో ఉంది. ఇప్పటికే భారత్ వద్ద 12 పీ-8ఐ విమానాలు ఉన్నాయి. వాటికి అదనంగా మరో ఆరింటిని సమకూర్చు కోవాలని భావించినా, తాజా పరిణామాలతో దేశీయంగా డీఆర్‌డీఓ, హెచ్ఏఎల్ వంటి సంస్థల ద్వారా ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ ఒప్పందం రద్దు కానప్పటికీ, టారిఫ్ వివాదం పరిష్కారమయ్యే వరకు నిరవధికంగా నిలిచిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.

భారతదేశం మరియు USA మధ్య ఒప్పందం ఏమిటి?
పరస్పర చర్య మరియు సహకారానికి చట్రాన్ని అందించే ముఖ్యమైన రక్షణ ఒప్పందాలు: లాజిస్టిక్స్ ఎక్స్ఛేంజ్ మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్ (2016); కమ్యూనికేషన్స్ కంపాటబిలిటీ మరియు సెక్యూరిటీ అగ్రిమెంట్ (2018);
భారతదేశానికి USA నుండి డబ్బు వస్తుందా?
2023 ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత దేశాలకు అందించిన US విదేశీ సహాయంలో 71.8% సహాయం పొందిన 46 దిగువ-మధ్యతరగతి ఆదాయ దేశాలు ఉన్నాయి. అందుకున్న సహాయం పరంగా దిగువ-మధ్యతరగతి ఆదాయ దేశాలలో భారతదేశం #22 కామెరూన్ ($166 మిలియన్లు) మరియు #24 కంబోడియా ($114.6 మిలియన్లు) మధ్య #23 స్థానంలో ఉంది.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/trump-putin-trump-putin-meeting-in-uae-talks-on-ukraine-war/international/527681/

Defense Deal Geopolitics India-US Relations Latest News Breaking News Military Contracts Strategic Affairs Telugu News US India Breakup

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.