📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Missile S-400 : మరిన్ని మిస్సైల్స్‌ కోసం రష్యాను కోరిన భారత్‌!

Author Icon By Sudha
Updated: May 13, 2025 • 5:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్‌ ఎస్‌-400 ఎయిర్‌ డిఫెన్స్‌ మిస్సైల్‌ (Missile)సిస్టమ్‌ అదనపు యూనిట్స్‌ని రష్యా (Russia) నుంచి దిగుమతి చేసుకోనుంది. ఇటీవల పాకిస్తాన్‌ డ్రోన్లు, మిసైల్స్‌తో దాడికి ప్రయత్నించగా ఎస్‌-400 సహాయంతో వాటిని భారత్‌ విజయవంతంగా కూల్చివేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే అదనపు యూనిట్ల కోసం రష్యాను కోరింది. ఈ విషయాన్ని రక్షణ వర్గాలు వెల్లడించినట్లుగా ఇండియా టుడే తెలిపింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్‌, పీవోకేలోని తొమ్మిది ఉగ్రస్థావరాలను భారత్‌ ధ్వంసం చేసింది. అనంతరం పాకిస్తాన్‌ భారత్‌పై డ్రోన్లు, మిస్సైల్స్‌ దాడికి ప్రయత్నించింది.

Missile S-400 : మరిన్ని మిస్సైల్స్‌ కోసం రష్యాను కోరిన భారత్‌!

మల్టిపుల్‌ టార్గెట్స్‌ని ధ్వంసం చేస్తుంది.
ఆ సమయంలో సరిహద్దుల్లో మోహరించిన ఎస్‌-400 మిస్సైల్‌ సిస్టమ్‌ అడ్డుకున్న విషయం తెలిసిందే. ఖచ్చితత్వంతో సరిహద్దు నుంచి వైమానిక ముప్పును ఎదుర్కోవడంలో ఈ వ్యవస్థ సమర్థవంతంగా పని చేసిన నేపథ్యంలో.. భారత్‌ తన వైమానిక రక్షణ సామర్థ్యాన్ని మరింత విస్తరించేందుకు నిర్ణయం తీసుకుంది. భారత్‌ విజ్ఞప్తికి రష్యా అంగీకారం తెలిపే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. రష్యాలో తయారు చేసిన S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను భారత్‌లో ‘సుదర్శన్ చక్ర’గా పిలుస్తూ వస్తున్నారు. ఎస్‌-400 ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన మొబైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. దీన్ని సులభంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించేందుకు అవకాశం ఉంటుంది. దాన్ని ఓ వాహనంపై అమర్చవచ్చు. ఒకేసారి మల్టిపుల్‌ టార్గెట్స్‌ని ధ్వంసం చేస్తుంది.
ఒకేసారి 36 టార్గెట్‌లను ట్రాక్‌ చేసే సామర్థ్యం దీనికి ఉంది. అలాగే, 12 టార్గెట్స్‌పై ఒకే సారి దాడి చేస్తుంది. 600 కిలోమీటర్ల దూరం నుంచే ట్రాక్‌ చేస్తూ.. 400 కిలోమీటర్ల పరిధిలోనే శత్రువుల మిస్సైల్స్‌ను కూల్చే సత్తా వీటి సొంతం. విమానాలు, డ్రోన్లు, క్రూయిజ్ మిసైల్స్‌, బాలిస్టిక్ మిసైల్స్‌ ఇలా వేర్వేరు లక్ష్యాలను ఒకేసారి టార్గెట్‌ చేసి ఛేదిస్తుంది. వీటిని రియాక్షన్‌ టైమ్‌ చేలా వేగంగా ఉంటుంది. ఎస్‌-400 యాంటీ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్‌ను ఫైర్‌ చేసేందుకు ఐదు నిమిషాల్లోనే రెడీ చేయొచ్చు. ఇందులో 3డీ ఫేజ్‌డ్ అరే రాడార్‌ ట్రాకింగ్ సిస్టమ్‌ ఉంటుంది. ఈ మిస్సైల్‌ సిస్టమ్‌ కోసం భారత్‌ సుమారు రూ.35వేలకోట్లతో రష్యాతో ఒప్పందం చేసుకుంది. ఇప్పటి వరకు ఐదు యూనిట్లు డెలివరీ తీసుకుంది.

Read Also : Tripoli Clashes: ట్రిపోలి ఘర్షణల్లో లిబియా సాయుధ గ్రూపు నాయకుడు సహా ఆరుగురు మృతి

Breaking News in Telugu Google news Google News in Telugu India asks Latest News in Telugu more missiles! Paper Telugu News Russia for Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.