📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: India-Russia: మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: పుతిన్

Author Icon By Vanipushpa
Updated: December 5, 2025 • 12:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత పర్యటన వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Putin) జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ వైరల్ అవుతోంది. ప్రపంచ రాజకీయాలు, కూటములపై ఆయన కీలక కామెంట్స్ చేశారు. ముఖ్యంగా యురోపియన్ యూనియన్‌పై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రపంచంలోని ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల రాజకీయ, ఆర్థిక వేదిక అయిన గ్రూప్ ఆఫ్ సెవెన్- జీ7పై కూడా పుతిన్ తనదైన శైలిలో స్పందించారు. రష్యా జీ7లో చేరడాన్ని పరిశీలిస్తోందా? అని విలేకరి అడిగిన ప్రశ్నకు పుతిన్ ఆసక్తికర సమాధానం చెప్పారు. రష్యాకు జీ-7 కూటమిలో చేరే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. అలాగే, యురోపియన్ దేశాలతో తమకు మంచి సంబంధాలు లేవని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. గతంలో రష్యా జీ-8లో భాగమై ఉన్నప్పటికీ, తాను ఆ సమావేశాలకు హాజరు కావడం మానేసిన తర్వాత అది మళ్లీ జీ-7గా మారిపోయిందని పుతిన్ గుర్తు చేశారు.

Read Also: Oil Deal: ఇంధన భద్రత కోసం భారత్-రష్యా డీల్

putin and modi

భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో మూడో అతిపెద్దది

G7 దేశాలు తమను తాము ‘పెద్ద ఏడు దేశాలు’ అని పిలుచుకోవడాన్ని పుతిన్ తీవ్రంగా తప్పుబట్టారు. కొనుగోలు శక్తి పరంగా ఆధారంగా చూస్తే ఈ దేశాల ఆర్థిక బలం నానాటికీ తగ్గిపోతోందన్నారు. ఆ దేశాలు తమను తాము ఎందుకు పెద్ద దేశాలుగా పిలుచుకుంటున్నాయో అర్థం కావడం లేదన్నారు. కొనుగోలు శక్తి పరంగా చూస్తే భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో మూడో అతిపెద్దదని, మరి యునైటెడ్ కింగ్‌డమ్ వంటి దేశాలు ఎక్కడ ఉన్నాయని ఆయన ప్రశ్నించారు. వాటి ర్యాంక్ పది లేదా అంతకంటే తక్కువగా ఉందని గుర్తు చేశారు. జీ-7 దేశాలన్నీ సాంకేతికంగా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలే అయినప్పటికీ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వాటి వాటా మాత్రం ప్రతి సంవత్సరం తగ్గిపోతోందన్నారు. అలాగే, జర్మనీ, ఫ్రాన్స్‌ల ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను కూడా పుతిన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.

నిర్దిష్ట సమయంలో జీ-8 సమావేశాలకు వెళ్లడం మానేశాను

జీ-8 కూటమిలో రష్యా ఉన్నప్పుడు తాను సమావేశాలకు వెళ్లడం ఎందుకు మానేశానో కూడా ఈ సందర్భంగా పుతిన్ వివరించారు. “నేను ఒక నిర్దిష్ట సమయంలో జీ-8 సమావేశాలకు వెళ్లడం మానేశాను. దానికి కారణం ఉక్రెయిన్‌తో వచ్చిన విబేధాలు మాత్రం కాదు. నేను ఇప్పుడు వివరాలలోకి వెళ్లను. ఈ విషయాన్ని మేము అమెరికాకు కూడా తెలియజేశాం” అని ఆయన చెప్పారు. యూఎస్ ప్రత్యేక దూత స్టీవ్ విట్‌కాఫ్‌తో ఇటీవల జరిగిన ఐదు గంటల సమావేశంలో జీ-8 సమావేశాల నుంచి వైదొలగడానికి గల కారణాలను తాను వివరించినట్లు ఆయన తెలిపారు.

రష్యాలో పుతిన్ ప్రజాదరణ పొందారా?
మీడియాలో పుతిన్ తరచుగా ఒక మాకో ఇమేజ్‌ను ప్రదర్శిస్తారు. రష్యన్ ప్రభుత్వేతర సంస్థ లెవాడా సెంటర్ ప్రకారం, 2023 ప్రారంభంలో రష్యన్ జనాభాలో దాదాపు 85% మంది పుతిన్‌ను ఆమోదించారు, ఇది దాదాపు 8 సంవత్సరాలలో అత్యధికం.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Breaking News in Telugu Economic Growth Global Economy Google News in Telugu India economy International Relations Latest In telugu news Third Largest Economy Vladimir Putin

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.