భారత పర్యటన వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Putin) జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ వైరల్ అవుతోంది. ప్రపంచ రాజకీయాలు, కూటములపై ఆయన కీలక కామెంట్స్ చేశారు. ముఖ్యంగా యురోపియన్ యూనియన్‌పై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రపంచంలోని ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల రాజకీయ, ఆర్థిక వేదిక అయిన గ్రూప్ ఆఫ్ సెవెన్- జీ7పై కూడా పుతిన్ తనదైన శైలిలో స్పందించారు. రష్యా జీ7లో చేరడాన్ని పరిశీలిస్తోందా? అని విలేకరి అడిగిన ప్రశ్నకు పుతిన్ ఆసక్తికర సమాధానం చెప్పారు. రష్యాకు జీ-7 కూటమిలో చేరే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. అలాగే, యురోపియన్ దేశాలతో తమకు మంచి సంబంధాలు లేవని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. గతంలో రష్యా జీ-8లో భాగమై ఉన్నప్పటికీ, తాను ఆ సమావేశాలకు హాజరు కావడం మానేసిన తర్వాత అది మళ్లీ జీ-7గా మారిపోయిందని పుతిన్ గుర్తు చేశారు.
Read Also: Oil Deal: ఇంధన భద్రత కోసం భారత్-రష్యా డీల్

భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో మూడో అతిపెద్దది
G7 దేశాలు తమను తాము ‘పెద్ద ఏడు దేశాలు’ అని పిలుచుకోవడాన్ని పుతిన్ తీవ్రంగా తప్పుబట్టారు. కొనుగోలు శక్తి పరంగా ఆధారంగా చూస్తే ఈ దేశాల ఆర్థిక బలం నానాటికీ తగ్గిపోతోందన్నారు. ఆ దేశాలు తమను తాము ఎందుకు పెద్ద దేశాలుగా పిలుచుకుంటున్నాయో అర్థం కావడం లేదన్నారు. కొనుగోలు శక్తి పరంగా చూస్తే భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో మూడో అతిపెద్దదని, మరి యునైటెడ్ కింగ్‌డమ్ వంటి దేశాలు ఎక్కడ ఉన్నాయని ఆయన ప్రశ్నించారు. వాటి ర్యాంక్ పది లేదా అంతకంటే తక్కువగా ఉందని గుర్తు చేశారు. జీ-7 దేశాలన్నీ సాంకేతికంగా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలే అయినప్పటికీ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వాటి వాటా మాత్రం ప్రతి సంవత్సరం తగ్గిపోతోందన్నారు. అలాగే, జర్మనీ, ఫ్రాన్స్‌ల ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను కూడా పుతిన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.
నిర్దిష్ట సమయంలో జీ-8 సమావేశాలకు వెళ్లడం మానేశాను
జీ-8 కూటమిలో రష్యా ఉన్నప్పుడు తాను సమావేశాలకు వెళ్లడం ఎందుకు మానేశానో కూడా ఈ సందర్భంగా పుతిన్ వివరించారు. “నేను ఒక నిర్దిష్ట సమయంలో జీ-8 సమావేశాలకు వెళ్లడం మానేశాను. దానికి కారణం ఉక్రెయిన్‌తో వచ్చిన విబేధాలు మాత్రం కాదు. నేను ఇప్పుడు వివరాలలోకి వెళ్లను. ఈ విషయాన్ని మేము అమెరికాకు కూడా తెలియజేశాం” అని ఆయన చెప్పారు. యూఎస్ ప్రత్యేక దూత స్టీవ్ విట్‌కాఫ్‌తో ఇటీవల జరిగిన ఐదు గంటల సమావేశంలో జీ-8 సమావేశాల నుంచి వైదొలగడానికి గల కారణాలను తాను వివరించినట్లు ఆయన తెలిపారు.
రష్యాలో పుతిన్ ప్రజాదరణ పొందారా?
మీడియాలో పుతిన్ తరచుగా ఒక మాకో ఇమేజ్‌ను ప్రదర్శిస్తారు. రష్యన్ ప్రభుత్వేతర సంస్థ లెవాడా సెంటర్ ప్రకారం, 2023 ప్రారంభంలో రష్యన్ జనాభాలో దాదాపు 85% మంది పుతిన్‌ను ఆమోదించారు, ఇది దాదాపు 8 సంవత్సరాలలో అత్యధికం.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: