📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News:Taliban: భారత్‌లో తాలిబన్ తొలి దౌత్యవేత్త నియామకానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్‌

Author Icon By Vanipushpa
Updated: November 3, 2025 • 5:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్ (India) అఫ్గానిస్థాన్ (Afghanistan) మధ్య దౌత్య సంబంధాలు మరింత పుంజుకోనున్నాయి. ముఖ్యంగా అఫ్గానిస్థాన్‌లో తాలిబాన్ పాలన తిరిగి ప్రారంభమైన తర్వాత.. తొలిసారిగా అక్కడి సర్కారు భారత్‌లో తొలి దౌత్యవేత్తను నియమించబోతుంది. అది కూడా ఈనెలలోనే కాగా.. ఇది ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలలో కీలక అడుగుగా అంతా బావిస్తున్నారు. తాలిబాన్ ఈ నెలలో మొదటి దౌత్యవేత్తను నియమించిన తర్వాత.. డిసెంబర్ చివరిలో లేదా జనవరి ప్రారంభంలో మరో దౌత్యవేత్తను నియమించడానికి కాబూల్ భారత అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.

Read Also: Nuclear Tests : రష్యా, చైనా, పాకిస్థాన్‌, ఉత్తర కొరియా దేశాలు అణు పరీక్షలను నిర్వహిస్తున్నాయి : ట్రంప్‌

Taliban

రాయబార కార్యాలయం స్థాయికి పెంచాలని భారత్ నిర్ణయం
గత ఏడాది నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగయ్యాయి. ఈక్రమంలోనే గత నెలలో అఫ్గానిస్థాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తకి భారతదేశంలో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా కాబూల్‌లోని తన సాంకేతిక మిషన్‌ను రాయబార కార్యాలయం స్థాయికి పెంచాలని భారతదేశం నిర్ణయించింది. అంతేకాకుండా తాలిబాన్ దౌత్యవేత్తలను అంగీకరించడానికి భారత్ సుముఖత వ్యక్తం చేసింది. త్వరలో ఇరుపక్షాలు తమ తమ మిషన్లకు ఛార్జ్ డి అఫైర్స్ స్థాయి అధికారిని నాయకత్వం వహించేలా చర్యలు తీసుకోనున్నాయి.

భారత్ 16 టన్నులకు పైగా వ్యాధి నిరోధక మందులను అఫ్గానిస్థాన్‌కు విరాళం

ప్రభుత్వాన్ని భారత్ ఇంకా అధికారికంగా గుర్తించనప్పటికీ.. అఫ్గానిస్థాన్‌‍కు సహాయం అందించడంలో భారత్ నమ్మకమైన భాగస్వామిగా తన పాత్రను బలోపేతం చేసుకుంది. నిరంతరాయంగా అందిస్తున్న మానవతా సహాయం, వైద్య సామాగ్రి సరఫరా దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. అయితే తాజాగా భారత్ 16 టన్నులకు పైగా వ్యాధి నిరోధక మందులను అఫ్గానిస్థాన్‌కు విరాళంగా అందించగా.. తాలిబన్ ప్రతినిధి దీన్ని ప్రశంసించారు. “ఈ విరాళం అఫ్గానిస్థాన్‌కు భారతదేశం అందిస్తున్న దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని, అభివృద్ధి మద్దతును నొక్కి చెబుతోంది.

పాక్-అఫ్గాన్ దేశాలు కాల్పుల విరమణ ఒప్పందం

ముఖ్యమైన వైద్య సామాగ్రిని అందిస్తూ మానవతా సహకారాన్ని ప్రోత్సహించడంలో భారత్ విశ్వసనీయ భాగస్వామిగా తన పాత్రను పోషిస్తోంది” అని ఆ ప్రతినిధి పేర్కొన్నారు. అలాగే ముత్తకీ తన భారత పర్యటన సమయంలో.. జమ్మూ కాశ్మీర్‌పై భారత సార్వభౌమత్వాన్ని సమర్థించారు. భారత గడ్డపై నిలబడే పాక్ ప్రభుత్వానికి హెచ్చరికలు కూడా జారీ చేశారు. ముఖ్యంగా పాక్-అఫ్గాన్ దేశాలు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నప్పటికీ.. ఉద్రిక్తతలు పెరిగే ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు.

భారతదేశ జనాభా ఎంత?
భారతదేశ జనాభా 1.4 బిలియన్లకు పైగా ఉంది, ఇది 2023లో చైనాను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా నిలిచింది. 2024 నాటికి, దాని జనాభా దాదాపు 1.484 బిలియన్లుగా అంచనా వేయబడింది,

Read hindi news : hindi.vaartha.com

Epaper :epapervaartha.com

Read Also:

afghanistan Diplomacy foreign affairs india International Relations Latest News in Telugu Taliban Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.