కెనడాలో ఖలిస్థానీ వేర్పాటువాదానికి గట్టి ఎదురుదెబ్బ కెనడాలో Canada ఖలిస్థానీ వేర్పాటువాద కార్యకలాపాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. సిఖ్స్ ఫర్ జస్టిస్ (SFJ) అనే నిషేధిత సంస్థలో కీలక పాత్ర పోషిస్తున్న, ఖలిస్థాన్ రెఫరెండం ప్రధాన నిర్వాహకుడిగా పేరుపొందిన ఇందర్‌జిత్ (Inderjit Singh) సింగ్ గోసల్ను కెనడా పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు ఉగ్రవాది గుర్‌పత్వంత్ సింగ్ పన్నూన్ కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందాడు.
గోసల్‌ను అరెస్టు చేసి
గోసల్‌పై గతంలోనూ తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. (Inderjit Singh) 2024 నవంబరులో బ్రాంప్టన్‌లోని హిందూ సభా మందిరం వద్ద జరిగిన హింసాత్మక దాడిలో అతని ప్రమేయం బయటపడింది. హిందూ భక్తులపై ఖలిస్థానీ (Khalistani) జెండాలు, బ్యానర్లతో నిరసనలు చేపట్టిన వేర్పాటువాదులు అకస్మాత్తుగా భౌతిక దాడులకు పాల్పడగా, పోలీసులు ఆ సమయంలో గోసల్‌ను అరెస్టు చేసి తర్వాత విడుదల చేశారు.
Inderjit Singh
తాజాగా మళ్లీ అతడు అదుపులోకి రావడం కెనడాలోని ఖలిస్థానీ వర్గాలకు పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్థకు కెనడాలో గోసల్ ప్రధాన నిర్వాహకుడిగా ఉన్నాడు. ఈ అరెస్టుతో ఖలిస్థానీ వేర్పాటువాదంపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారని స్పష్టమవుతోంది.
కెనడాలో ఎవరు అరెస్ట్ అయ్యారు?
సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్థలో కీలక సభ్యుడు, పన్నూన్ సన్నిహితుడు ఇందర్‌జిత్ సింగ్ గోసల్ను కెనడా పోలీసులు అరెస్ట్ చేశారు.
గోసల్‌పై ఏ ఆరోపణలు ఉన్నాయి?
2024 నవంబరులో బ్రాంప్టన్‌లోని హిందూ సభా మందిరంపై జరిగిన హింసాత్మక దాడిలో ప్రమేయం ఉందని ఆరోపణలు ఉన్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: