📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: IND vs UAE – ఓటమి పై యూఏఈ కెప్టెన్ ఏమన్నారంటే?

Author Icon By Anusha
Updated: September 11, 2025 • 8:52 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆసియా కప్ 2025 (Asia Cup 2025) టోర్నీలో భాగంగా బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ జట్టుతో తలపడిన యూఏఈ జట్టు ఘోర పరాజయం చవిచూసింది. అత్యంత ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదటి నుంచే భారత్ బౌలర్ల ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. యూఏఈ బ్యాటర్లు ఒక్కసారిగా ఒత్తిడికి లోనై వరుసగా వికెట్లు కోల్పోవడంతో పోరాటానికి కూడా అవకాశమే లేకుండా పోయింది.

మ్యాచ్ అనంతరం యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం (UAE captain Muhammad Wasim) మీడియాతో మాట్లాడాడు. తమ జట్టు పరాజయానికి ప్రధాన కారణం బ్యాటింగ్ విఫలం కావడమేనని ఆయన స్పష్టం చేశాడు. “మా ఆటగాళ్లు కొంత ఆత్మవిశ్వాసంతో నిలబడితే కనీసం పోటీ ఇవ్వగలిగేవాళ్లం. కానీ వరుసగా వికెట్లు కోల్పోవడం వల్ల లక్ష్యాన్ని సెట్ చేయలేకపోయాం. టాప్ ఆర్డర్ బ్యాటర్లు క్రీజులో నిలవాల్సిన సమయంలో త్వరగా ఔటవ్వడం మ్యాచ్ మలుపు తిప్పింది,” అని వసీం వ్యాఖ్యానించాడు.

IND vs UAE

మెరుపులు మెరిపించారు

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన యూఏఈ (UAE batting first) 13 ఓవర్లలో 57 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ అలిషన్ షరఫు(17 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 22), కెప్టెన్ ముహమ్మద్ వసీం(22 బంతుల్లో 3 ఫోర్లతో 19) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత వెరటన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్(4/7), పేస్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే(3/3) అద్భుత బౌలింగ్‌తో యూఏఈ పతనాన్ని శాసించారు. జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తీ చెరో వికెట్ పడగొట్టారు.

అనంతరం భారత్ 4.3 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 60 పరుగులు చేసి 93 బంతులు మిగిలి ఉండగానే విజయాన్నందుకుంది. అభిషేక్ శర్మ(16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 30), శుభ్‌మన్ గిల్(9 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 20 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్(2 బంతుల్లో సిక్స్‌తో 7 నాటౌట్) మెరుపులు మెరిపించారు. యూఏఈ బౌలర్ల (UAE bowler) లో జునైద్ సిద్దిఖి ఒక వికెట్ తీసాడు.ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన ముహమ్మద్ వసీం..

భారత్‌కు కనీస పోటీ ఇవ్వలేకపోయామని

వరల్డ్ నెంబర్ వన్ టీమ్ అయిన భారత్‌కు కనీస పోటీ ఇవ్వలేకపోయామని విచారం వ్యక్తం చేశాడు. వరుసగా వికెట్లు కోల్పోవడం తమ పతనాన్ని శాసించిందన్నాడు. ‘మా బ్యాటింగ్‌ను బాగానే ప్రారంభించాం. కానీ వరుసగా వికెట్లు కోల్పోయాం. అదే మా ఓటమిని శాసించింది. భారత్ అద్భుతమైన జట్టు. అద్భుతంగా బౌలింగ్ చేశారు. ప్రతీ బ్యాటర్‌కు తగ్గట్లు వ్యూహాలతో వచ్చారు. అందుకే భారత్ నెంబర్ వన్ జట్టుగా ఉంది. ఒక జట్టుగా మేం మరింత బలంగా తిరిగి రావడానికి ప్రయత్నిస్తాం. మా తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుంటాం.’అని ముహమ్మద్ వసీం చెప్పుకొచ్చాడు.

Read hindi news:hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/asia-cup-2025-indias-big-win-over-uae/international/545021/

Asia Cup 2025 Asia Cup first match Breaking News India vs UAE match latest news Mohammed Wasim Telugu News UAE batting failure UAE captain statement UAE vs India

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.