📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: IND vs PAK – భారత్ గెలుపు పై సూర్యకుమార్ యాదవ్ ఏమన్నారంటే?

Author Icon By Anusha
Updated: September 15, 2025 • 8:37 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆసియా కప్ 2025 (Asia Cup 2025) లో భారత్‌ పాకిస్థాన్‌పై సాధించిన ఘన విజయాన్ని సాయుధ దళాలకు అంకితం చేస్తున్నట్లు భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ప్రకటించాడు. ఆదివారం జరిగిన ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ సందర్భంగా సూర్యకుమార్ మాట్లాడుతూ, ఇటీవల పహల్గామ్‌లో చోటుచేసుకున్న ఉగ్రదాడి బాధితుల కుటుంబాలకు తాము సానుభూతి వ్యక్తం చేస్తున్నామని, జట్టు తరపున మద్దతు తెలుపుతున్నామని పేర్కొన్నాడు.

ఆయన చెప్పినట్లు, “ఈ విజయం మా కోసం కేవలం క్రికెట్ ఫలితం మాత్రమే కాదు. దేశ రక్షణలో ప్రాణత్యాగం చేసిన సైనికుల ధైర్యానికి, వారి కుటుంబాలకి గౌరవ సూచకంగా మేము ఈ గెలుపుని అంకితం చేస్తున్నాం” అని స్పష్టం చేశాడు. ఆ సోషల్ మీడియాలో కూడా అభిమానులు సూర్యకుమార్ చేసిన ఈ ప్రకటనను హర్షిస్తున్నారు.

పుట్టిన రోజున గెలవడం సంతోషంగా ఉందని చెప్పాడు

ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన సూర్యకుమార్ యాదవ్.. తన పుట్టిన రోజున గెలవడం సంతోషంగా ఉందని చెప్పాడు. ‘నా బర్త్‌డే సందర్భంగా భారత్‌కు నేను ఇచ్చే ఒక మంచి రిటర్న్ గిఫ్ట్ ఇది. ఆఖరి వరకు క్రీజులో ఉండి విజయ లాంఛనాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా. పాకిస్థాన్‌తో మ్యాచ్‌ను మేం మరో సాధారణ గేమ్‌లానే భావిస్తాం.

ప్రతీ జట్టుతో మ్యాచ్‌కు ఎలా సిద్దమవుతామో ఈ మ్యాచ్‌కు అలానే రెడీ అయ్యాం. గతంలో ఇక్కడే జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) లోనూ మేం స్పిన్నర్లతోనే గెలిచాం. అక్కడి నుంచే స్పిన్నర్లను ఉపయోగించడం మొదలైంది. అంతేకాకుండా స్పిన్నర్లకు నేను బిగ్ ఫ్యాన్. వారిని జట్టులోకి తీసుకోవడం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మిడిల్ ఓవర్లలో వారు మ్యాచ్‌పై పట్టు సాధించగలరు.

పాక్‌పై సాధించిన ఈ విజయాన్ని

ఇదే సరైన సమయం.. సందర్భం భావించి మా తరఫున ఒకటి చెప్పాలనుకుంటున్నా. పహల్గామ్ ఉగ్రదాడిలోని బాధితుల కుటుంబాలకు మేం అండగా ఉంటాం. వారికి మా సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం. పాక్‌ (PAK) పై సాధించిన ఈ విజయాన్ని ఎంతో దైర్య సాహాసాలు చూపిన భారత సాయుధ బలగాలకు అంకితం చేయాలనుకుంటున్నాం.

IND vs PAK

వారు ఇలానే స్ఫూర్తినిస్తూ ఉంటారని ఆశిస్తున్నాం. వారిని సంతోషపరిచే అవకాశం దొరికినప్పుడల్లా.. మైదానంలో గెలిచే ప్రయత్నం చేస్తాం.’అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌ను బాయ్‌కట్ చేయాలని హహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam terror attack) బాధితుల కుటుంబాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో సూర్య ఈ వ్యాఖ్యలు చేసినట్లు అర్థమవుతోంది.

ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 127 పరుగులు చేసింది. షాహీన్ షా అఫ్రిది(16 బంతుల్లో 4 సిక్స్‌లతో 33 నాటౌట్) ఒక్కడే దూకుడుగా ఆడగా.. సాహిబ్జాదా ఫర్హాన్(44 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 40) ఆచితూచి ఆడాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్(3/18) మూడు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్(2/18), జస్‌ప్రీత్ బుమ్రా(2/28) రెండేసి వికెట్లు పడగొట్టారు. హర్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తీ చెరో వికెట్ తీసారు.

అనంతరం భారత్ 15.5 ఓవర్లలో 3 వికెట్లకు 131 పరుగులు చేసి గెలుపొందింది. సూర్యకుమార్ యాదవ్(37 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 47 నాటౌట్), అభిషేక్ శర్మ(13 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31), తిలక్ వర్మ(31 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 31) రాణించారు. పాకిస్థాన్ బౌలర్లలో సైమ్ అయుబ్(3/35) ఒక్కడే మూడు వికెట్లు తీసాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/ind-vs-pak-indias-big-win-over-pakistan/international/547402/

Asia Cup 2025 Breaking News India vs Pakistan latest news pahalgam attack victims suryakumar yadav statement team india solidarity Telugu News tribute to armed forces

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.