📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు

Latest News: IND vs PAK – పాక్‌పై భారత్ గెలుపు

Author Icon By Anusha
Updated: September 22, 2025 • 8:25 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆసియా కప్‌ 2025  (2025 Asia Cup) టోర్నీలో టీమిండియా అదిరిపోయే జోరును కొనసాగిస్తోంది. వరుస విజయాలతో ముందుకు దూసుకెళ్తూ ప్రతీ మ్యాచ్‌లో ప్రత్యర్థులపై తన ఆధిపత్యాన్ని చాటుకుంటోంది. ఇప్పటికే మూడు మ్యాచ్‌ల్లో ఘన విజయం సాధించిన భారత జట్టు, ఆదివారం జరిగిన సూపర్–4 పోరులో మరోసారి అద్భుతంగా రాణించింది. ప్రధాన ప్రత్యర్థి పాకిస్థాన్‌పై 6 వికెట్ల తేడాతో గెలిచి నాలుగో విజయాన్ని అందుకుంది. ఈ ఫలితంతో భారత జట్టు ఫైనల్‌ దిశగా మరింత బలంగా అడుగులు వేస్తోంది.

సూపర్–4లో ఈ హై వోల్టేజ్‌ మ్యాచ్‌ (High voltage match) పై అభిమానులంతా కన్నేసి ఉన్నారు. ఇరుజట్ల మధ్య రసవత్తర పోటీ ఉంటుందని అంచనాలు వ్యక్తమయ్యాయి. అయితే మ్యాచ్ ప్రారంభం నుంచే భారత్ బౌలర్లు, బ్యాటర్లు సమష్టిగా రాణించారు. మొదట పాకిస్థాన్‌ను తక్కువ స్కోరుకు పరిమితం చేయడంలో బౌలింగ్ విభాగం కీలక పాత్ర పోషించగా, తర్వాత బ్యాటింగ్‌లో యువ ఆటగాడు అభిషేక్ శర్మ చెలరేగి జట్టు విజయాన్ని ఖాయం చేశాడు.

టీమిండియా ఫీల్డర్లు నాలుగు క్యాచ్‌లు వదిలేయడం

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు చేసింది. సహిబ్జాద ఫర్హాన్(45 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 58) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఫహీమ్ అష్రఫ్(8 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 20 నాటౌట్) దూకుడుగా ఆడాడు. భారత బౌలర్లలో శివమ్ దూబే(2/33) రెండు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ చెరొక వికెట్ పడగొట్టారు.

టీమిండియా (Team India) ఫీల్డర్లు నాలుగు క్యాచ్‌లు వదిలేయడం పాకిస్థాన్‌కు కలిసొచ్చింది. లేకుంటే ఆ జట్టు తక్కువ స్కోర్‌కే పరిమితమయ్యేది.అనంతరం భారత్ 18.5 ఓవర్లలో 4 వికెట్లకు 174 పరుగులు చేసి 7 బంతులు మిగిలి ఉండగానే గెలుపొందింది. అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీకి తోడుగా..శుభ్‌మన్ గిల్(28 బంతుల్లో 8 ఫోర్లతో 47), తిలక్ వర్మ(19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30 నాటౌట్) మెరుపులు మెరిపించారు.

IND vs PAK

గిల్ సైతం బౌండరీలతో చెలరేగడంతో

పాకిస్థాన్ బౌలర్లలో హారిస్ రౌఫ్(2/26) రెండు వికెట్లు తీయగా.. అబ్రర్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్ చెరో వికెట్ తీసారు.172 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా తమ ఇన్నింగ్స్‌ను ఘనంగా ప్రారంభించింది. మరోసారి అభిషేక్ శర్మ (Abhishek Sharma) ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌‌గా తరలించాడు. షాహిన్ అఫ్రిది, అబ్రర్ అహ్మద్, సైమ్ అయుబ్‌లతో పాటు హరిస్ రౌఫ్‌లను అభిషేక్ శర్మ చితక్కొట్టాడు. అతనికి పోటీగా శుభ్‌మన్ గిల్ కూడా చెలరేగడంతో పవర్ ప్లేలో భారత్ వికెట్ నష్టపోకుండా 69 పరుగులు చేసింది.

అనంతరం మరింత దూకుడుగా ఆడిన అభిషేక్ శర్మ 24 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గిల్ (Shubman Gill) సైతం బౌండరీలతో చెలరేగడంతో 8.4 ఓవర్లలోనే భారత్ 100 పరుగుల మార్క్ అందుకుంది.హాఫ్ సెంచరీకి చేరువైన శుభ్‌మన్ గిల్‌ను ఫహీమ్ అష్రఫ్‌ క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతొ తొలి వికెట్‌కు నమోదైన 105 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

హరీస్ రౌఫ్ క్లీన్ బౌల్డ్ చేయగా

క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్(0) భారీ షాట్ ఆడబోయి వెనుదిరగ్గా.. వరుస బౌండరీలతో చెలరేగిన అభిషేక్ శర్మను అబ్రర్ అహ్మద్ పెవిలియన్ చేర్చాడు. బ్యాటింగ్‌కు వచ్చిన సంజూ తడబడ్డాడు. అతన్ని హరీస్ రౌఫ్ క్లీన్ బౌల్డ్ చేయగా.. హార్దిక్ పాండ్యాతో కలిసి తిలక్ వర్మ భారీ షాట్లతో విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ విజయానంతరం భారత ఆటగాళ్లు నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లిపోయారు. మరోసారి పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/india-in-asia-cup-2025/sports/551646/

Abhishek Sharma 74 runs Abhishek Sharma half century Asia Cup 2025 Breaking News India vs Pakistan latest news Super 4 Match Team India winning streak Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.