📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: IND vs PAK – జట్టు కోసం గెలవాలనుకున్నా: అభిషేక్ శర్మ

Author Icon By Anusha
Updated: September 22, 2025 • 9:21 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆసియా కప్ 2025 (2025 Asia Cup) లో భాగంగా ఆదివారం జరిగిన సూపర్–4 పోరులో టీమిండియా అద్భుత విజయాన్ని సాధించింది. ఈ విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) విధ్వంసకర ఇన్నింగ్స్. మ్యాచ్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ బౌలర్లు, ఫీల్డర్లు “కారణం లేకుండా మా దగ్గరికి వచ్చి మాటలతో కవ్వించటం నాకు అస్సలు నచ్చలేదు. అలాంటి సందర్భాల్లో నా దృష్టి తప్పకుండా జట్టు కోసం గెలవడమే నా లక్ష్యంగా పెట్టుకున్నాను. అదే నా ప్రేరణగా మారింది,” అని అభిషేక్ అన్నాడు.

ఈ టోర్నీలో పాకిస్థాన్‌ను భారత్ ఓడించడం ఇది రెండోసారి. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ(39 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 74) విధ్వంసకర హాఫ్ సెంచరీతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. పాకిస్థాన్ బౌలర్ల (Pakistan bowlers) ను చెడుగుడు ఆడాడు. దాంతో అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.ఈ సందర్భంగా మాట్లాడిన అభిషేక్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఈ రోజు సాధారణంగానే ఉంది.

IND vs PAK

నేను వారిపై బ్యాట్‌తో విరుచుకుపడ్డాను

పాకిస్థాన్ ఆటగాళ్లు కారణం లేకుండా మా దగ్గరకు వచ్చి కవ్వింపులకు దిగడం నాకు అస్సలు నచ్చలేదు. దాంతోనే నేను వారిపై బ్యాట్‌తో విరుచుకుపడ్డాను. జట్టు కోసం గెలవాలనుకున్నాను. శుభ్‌మన్ గిల్‌ (Shubman Gill) తో కలిసి స్కూల్ రోజుల నుంచి ఆడుతున్నా. కలిసి ఆడటం ఇద్దరికీ ఇష్టమే. ఈ రోజు జోడీగా మా సత్తా చూపించాలనుకున్నాం.

అనుకున్నట్లుగానే మా నుంచి అద్భుతమైన భాగస్వామ్యం వచ్చింది. శుభ్‌మన్ గిల్ ఆడిన తీరు నాకు బాగా నచ్చింది. ఎవరైనా ఇలా ఆడుతున్నారంటే అది జట్టు మద్దతు వల్లే సాధ్యమవుతోంది. టీమిండియా మేనేజ్‌మెంట్ నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించడం వల్లే నేను రాణించగలుగుతున్నాను. నేను చాలా కష్టపడి ప్రాక్టీస్ చేశాను. ఒకవేళ అది నా రోజు అయితే.. నా జట్టుకు విజయాన్ని అందిస్తాను.’అని అభిషేక్ శర్మ చెప్పుకొచ్చాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/ind-vs-pak-what-did-pakistan-captain-say-about-the-defeat/international/551656/

Abhishek Sharma aggressive batting Abhishek Sharma on Pakistan players abhishek sharma statement Breaking News India vs Pakistan Asia Cup 2025 latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.