📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: IND vs PAK – ఆసియా కప్ 2025 టోర్నీలో దుమురేపుతున్న అభిషేక్ శర్మ

Author Icon By Anusha
Updated: September 15, 2025 • 9:37 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆసియా కప్ 2025 (2025 Asia Cup) లో భారత జట్టు యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) తన ఆటతో అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు. మొదటిసారి ఇంత పెద్ద స్థాయిలో ఆడుతున్నా ఎలాంటి ఒత్తిడి లేకుండా ధైర్యంగా షాట్లు ఆడటం అందరిని ఆకట్టుకుంటోంది. మ్యాచ్ మొదటి నుంచే క్రీజ్‌లో కుదురుగా నిలబడి, ప్రత్యర్థి బౌలర్లకు ఒక్క క్షణం కూడా ఊపిరి తీసుకోనివ్వకుండా దూకుడుగా ఆడాడు.

పాకిస్థాన్‌ వంటి ప్రత్యర్థితో తొలి మ్యాచ్ ఆడడం చాలా మందికి సవాలు అవుతుంది. కానీ అభిషేక్ శర్మ మాత్రం అలా భావించకుండా తన సహజ ఆటను ఆడాడు. పవర్‌ఫుల్ షాట్లతో ఒక్కో బౌలర్‌ను రకరకాల దిశల్లో బంతిని పంపించాడు. వరల్డ్ నంబర్ వన్ టీ20 బ్యాటర్‌ (World number one T20 batsman) గా ఎందుకు గుర్తింపు పొందాడో ఈ మ్యాచ్‌లోనే చూపించాడు. తన ఇన్నింగ్స్‌లో జాగ్రత్త, ఆత్మవిశ్వాసం, దూకుడు అన్నీ కలగలసి కనిపించాయి.

విధ్వంసకర బ్యాటింగ్‌కు

పాకిస్థాన్ టాప్ బౌలర్ అయిన షాహీన్ షా అఫ్రిది (Shaheen Shah Afridi) కే చుక్కలు చూపించాడు. ఎవరైతే నాకేంది? డోంట్ కేర్ అన్న రీతిలో చిన్నపాటి పరుగుల తుఫాను సృష్టించి వెనుదిరిగాడు.అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు. ‘ఏం గుండెరా అది.. పాక్ బెస్ట్ బౌలర్‌కే చుక్కలా?’అని కొనియాడుతున్నారు. 128 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగిన అభిషేక్ శర్మ.. షాహీన్ షా అఫ్రిదీ వేసిన తొలి ఓవర్ తొలి బంతినే బౌండరీకి తరలించాడు. ఆ మరుసటి బంతినే లాంగాఫ్ దిశగా భారీ సిక్సర్ కొట్టి అఫ్రిది దిమ్మతిరిగే షాకిచ్చాడు.

IND vs PAK 

షాహీన్ అఫ్రిది వేసిన మరుసటి ఓవర్‌లోనూ తొలి బంతినే బౌండరీకి తరలించిన అభిషేక్ శర్మ.. మూడో బంతిని మిడ్ వికెట్ దిశగా భారీ సిక్సర్ బాదాడు. ఈ షాట్‌కు షాహీన్ షా అఫ్రిది నోరెళ్లబెట్టాడు. సైమ్ అయుబ్ (Saim Ayub) బౌలింగ్‌లోనూ వరుసగా రెండు బౌండరీలు బాదిన అభిషేక్ శర్మ.. మూడో బంతికి కూడా భారీ షాట్ ఆడబోయి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో అభిషేక్ చిన్నపాటి తుఫానుకు బ్రేక్ పడగా.. షాహీన్ షా అఫ్రిది ఊపిరి పీల్చుకున్నాడు.

.యూఏఈతో జరిగిన తొలి మ్యాచ్‌లోనూ

13 బంతులు మాత్రమే ఆడిన అభిషేక్ శర్మ 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31 పరుగులు చేసి వెనుదిరిగాడు. అతని స్ట్రైక్‌రేట్ 238.46 కావడం గమనార్హం. మరో 10 బంతులు అభిషేక్ శర్మ ఆడి ఉంటే.. మ్యాచ్ 10 ఓవర్లలోనే ముగిసేది. యూఏఈతో జరిగిన తొలి మ్యాచ్‌లోనూ ఫస్ట్ బాల్‌నే అభిషేక్ శర్మ సిక్సర్ బాదాడు. దంచికొట్టడమే తన పని అని చాటి చెప్పాడు.ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 127 పరుగులు చేసింది.

షాహీన్ షా అఫ్రిది(16 బంతుల్లో 4 సిక్స్‌లతో 33 నాటౌట్) ఒక్కడే దూకుడుగా ఆడగా.. సాహిబ్జాదా ఫర్హాన్(44 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 40) ఆచితూచి ఆడాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్(3/18) మూడు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్(2/18), జస్‌ప్రీత్ బుమ్రా రెండేసి వికెట్లు పడగొట్టారు. హర్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తీ చెరో వికెట్ తీసారు. ఈ ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, ఏడు సిక్స్‌లు మాత్రమే నమోదవ్వడం గమనార్హం. ఓ దశలో పాక్ 100 పరుగులైనా చేస్తుందా? అనిపించింది. కానీ షాహిన్ షా అఫ్రిది దూకుడుగా ఆడి పాక్‌కు పోరాడే లక్ష్యాన్ని అందించాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/ind-vs-pak-what-did-suryakumar-yadav-say-about-indias-victory/international/547416/

abhishek sharma Asia Cup 2025 Breaking News high voltage match latest news Pakistan vs India Shaheen Shah Afridi Star Opener T20 World Number One Batter Team India Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.