ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధిస్తుందని అనేక మంది అభిమానులు ముందుగానే అంచనాలు వేసినప్పటికీ, మ్యాచ్ చివరి దశలో టీమిండియా (Team India) కు ఎదురుదెబ్బ తగిలింది. లండన్‌లోని ఓవల్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు భారీ లక్ష్యం వైపు దూసుకెళ్తూ భారత బౌలర్లను ఇబ్బందుల్లో పడేసింది.భారత్ నిర్దేశించిన 374 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఇంగ్లాండ్ జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఈ మైదానంలో గతంలో విజయవంతంగా ఛేదించిన అత్యధిక స్కోరు 265 పరుగులు మాత్రమే కావడంతో, ఈ లక్ష్యం భారత్‌కే అనుకూలంగా ఉంటుందని అనేక నిపుణులు భావించారు. మొదటి రోజు నుంచే భారత బౌలర్లు ఆధిపత్యం చెలాయిస్తారని, 374 పరుగులు ఇంగ్లాండ్ (England) కు అసాధ్యమని అనేక మంది క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
భారత జట్టు స్పిన్ బౌలింగ్
హ్యారీ బ్రూక్, జో రూట్ ఇద్దరూ సెంచరీలు సాధించడం భారత జట్టుకు భారీ నష్టాన్ని కలిగించింది. దీనిపై స్పందించిన భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) మాట్లాడుతూ.. జో రూట్ క్రీజులో ఉన్నప్పుడు భారత జట్టు స్పిన్ బౌలింగ్‌ను సరిగా ఉపయోగించకపోవడమే ఈ ఎదురుదెబ్బకు ప్రధాన కారణమని ఆరోపించారు. భారత ఆటగాళ్లకు మ్యాచ్ గురించి అవగాహన సరిపోవడం లేదని అన్నారు. ఈ సిరీస్ స్పిన్నర్లను ఎక్కువగా ఉపయోగించలేదని.. దీని వల్లే మనం ఈ సిరీస్‌లో వెనుకబడి ఉన్నామన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ ముందంజలో ఉందని స్పష్టం చేశారు.మైదానంలో మనం సరైన నిర్ణయాలు తీసుకోవాలని, యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ భవిష్యత్తులో గొప్ప కెప్టెన్‌గా ఎదుగుతాడన్నారు. తప్పుల నుంచి నేర్చుకుంటాడని ఆశిస్తున్నానని.. ఐదో టెస్ట్‌లో ఇలాంటి పరిస్థితుల్లో స్పిన్నర్లను ఖచ్చితంగా ఉపయోగించి ఉండాలని సూచించారు. ఆ అవకాశాన్ని భారత్ కోల్పోయిందని తాను భావిస్తున్నానని తమ వ్యూహాత్మక లోపాన్ని ఎత్తి చూపారు.అశ్విన్ తన విమర్శలను కొనసాగిస్తూ,

ఈ సలహాలన్నీ
“మీరు స్పిన్నర్‌ను ఉపయోగించకపోతే, వారు కేవలం డిఫెన్స్ కోసం మాత్రమే ఉంటారు, వికెట్లు తీసే అవకాశం వారికి లభించదు. హ్యారీ బ్రూక్ 20 పరుగులు దాటిన తర్వాత ఒక ఎండ్‌లో స్పిన్నర్‌ను, మరొక ఎండ్‌లో పేస్ బౌలర్‌ను ఉపయోగించి పరుగులు కట్టడి చేసి ఉండాలి. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్‌ను చాలా త్వరగా బౌలింగ్ చేయడానికి పిలిచి ఉండాలి. ఈ తప్పులన్నీ చాలా పెద్ద ప్రభావాన్ని చూపుతాయి” అని జట్టు వ్యూహాలపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.ఈ సలహాలన్నీ డ్రెస్సింగ్ రూమ్ నుంచి కెప్టెన్‌కు అందిస్తున్నారా లేదా నాకు తెలియదు. కానీ ఇలాంటి తప్పులన్నీ సరిచేసి ఉండాలి” అని అశ్విన్ పేర్కొన్నారు. భారత బౌలర్లు వేసిన మొత్తం 76.2 ఓవర్లలో, స్పిన్నర్లు కేవలం 8 ఓవర్లు మాత్రమే వేశారని గమనించడం ముఖ్యం. అంతేకాదు, మొదటి ఇన్నింగ్స్‌లో వాషింగ్టన్ సుందర్ ఒక్క ఓవర్ కూడా వేయలేదు, జడేజా కేవలం రెండు ఓవర్లు మాత్రమే వేశాడు. ఈ గణాంకాలు స్పిన్నర్లను తక్కువగా ఉపయోగించారన్న అశ్విన్ వాదనకు బలం చేకూరుస్తాయి.
రవిచంద్రన్ అశ్విన్ ప్రపంచ రికార్డు ఏమిటి?
రవిచంద్రన్ అశ్విన్ టెస్ట్ క్రికెట్‌లో 500కిపైగా వికెట్లు తీశారు. ఆయన టెస్ట్ క్రికెట్‌లో అత్యల్ప ఇన్నింగ్స్‌లలోనే 300 వికెట్లు తీసిన వేగవంతమైన బౌలర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించారు.
అశ్విన్ అసలు పేరు ఏమిటి?
అశ్విన్ అసలు పేరు రవిచంద్రన్ అశ్విన్. ఆయన తమిళనాడుకు చెందిన ఆటగాడు. 2009లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తన స్వస్థల జట్టు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఎంపికై రెండు మ్యాచ్‌లు ఆడారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: