📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

IND vs ENG: రవీంద్ర జడేజా చెప్పిన మాటలు నన్ను ఎంతో మోటివేట్ చేశాయి: సిరాజ్

Author Icon By Anusha
Updated: August 4, 2025 • 5:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఆఖరి టెస్ట్ మ్యాచ్ అనంతరం భారత స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) తన హృదయాన్ని తాకే వ్యాఖ్యలు చేశాడు. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరి రోజున భారత్ కేవలం 6 పరుగుల తేడాతో గెలిచింది. ఈ విజయం అంతా దేవుడి దయ వల్లనే సాధ్యమైందని సిరాజ్ తెలిపాడు.మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ సిరాజ్ అన్నారు, “ఆఖరి రోజు ఆటలో గెలుపు కోసం మేమంతా శక్తివంచన లేకుండా శ్రమించాం. కానీ ఒక సమయంలో బ్రూక్ క్యాచ్ వదిలేశాక మా జట్టులో కొంత నిరాశ ఏర్పడింది. ఆ సమయంలో ఇంగ్లండ్ బ్యాటర్లు హ్యారీ బ్రూక్, జో రూట్ అద్భుతంగా ఆడుతూ భాగస్వామ్యాన్ని పెంచడంతో మ్యాచ్ పూర్తిగా వారి వైపు ఒరిగినట్లు అనిపించింది. అయినప్పటికీ నేను గెలుపుపై ఆశలు వదులుకోలేదు. చివరి వరకు బౌలింగ్‌లో నా శక్తినంతా పెట్టాలని నిర్ణయించుకున్నాను” అని చెప్పాడు.

ఆ మాటలు నాకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి

సిరాజ్ తన విజయం వెనుక జట్టు సహచరుడు రవీంద్ర జడేజా (Ravindra Jadeja) సూచించిన మాటలు ప్రధాన ప్రేరణ అని వెల్లడించాడు. “ఆఖరి రోజు ఆట ప్రారంభానికి ముందు జడేజా నాతో, ‘మనం క్రికెటర్‌లుగా ఇక్కడి వరకూ రావడానికి ఎంత కష్టపడ్డామో గుర్తు పెట్టుకో. ఆ కష్టాన్ని గుర్తు పెట్టుకొని బౌలింగ్ చేయి’ అని అన్నాడు. ఆ మాటలు నాకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. అలసటను మర్చిపోయి బౌలింగ్‌లో దూకుడును పెంచాను” అని సిరాజ్ అన్నాడు.339/6 ఓవర్‌ నైట్‌ స్కోర్‌తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్‌.. 367 పరుగులకు ఆలౌటైంది. మహమ్మద్ సిరాజ్(5/104) ఐదు వికెట్లతో భారత్‌కు చిరస్మరణీయ వియాజయాన్నందించాడు. సిరాజ్‌తో పాటు ప్రసిధ్ కృష్ణ(4/126) నాలుగు వికెట్లు తీయగా ఆకాష్ దీప్ (Akash Deep) ఓ వికెట్ పడగొట్టాడు. ఈ గెలుపుతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ 2-2తో సమంగా నిలిచింది.

బ్రూక్ క్యాచ్ తీసుకున్నప్పుడు బౌండరీ లైన్‌

ఆఖరి టెస్ట్‌లో సిరాజ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 9 వికెట్లు పడగొట్టాడు. గాయంతో బ్యాటింగ్‌కు దిగిన క్రిస్ వోక్స్(0 నాటౌట్) సాయంతో గస్ అట్కిన్సన్(17) పోరాడినా ఫలితం లేకపోయింది.ఈ విజయానంతరం అధికారిక బ్రాడ్‌ కాస్టర్‌తో మాట్లాడిన సిరాజ్’ఏది ఏమైనా సరైన ప్రదేశంలో బౌలింగ్ చేయాలనే ప్లాన్‌తో బరిలోకి దిగాను. వికెట్లు పడినా.. పరుగులు వచ్చినా నేను పట్టించుకోలేదు. బ్రూక్ క్యాచ్ తీసుకున్నప్పుడు బౌండరీ లైన్‌ను తాకుతానని నేను ఊహించలేదు. అది మ్యాచ్‌ను మలుపు తిప్పే క్షణం. ఆ అవకాశంతో బ్రూక్ టీ20 మూడ్‌లోకి వెళ్లిపోయాడు. దాంతో మేం ఆటలో వెనుకంజలో నిలిచాం. కానీ ఆ దేవుడి దయ వల్ల నేను ఏ పాయింట్‌లోనూ విజయంపై విశ్వాసం కోల్పోలేదు. ఈ ఉదయం కూడా అదే నమ్మకంతో బౌలింగ్ చేశాను.’అని సిరాజ్ చెప్పుకొచ్చాడు.

మహమ్మద్ సిరాజ్ ఎవరు?

మహమ్మద్ సిరాజ్ భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్. ఆయన హైదరాబాద్‌కు చెందినవారు దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శనలతో గుర్తింపు పొందారు.

మహమ్మద్ సిరాజ్ ఏ ఫార్మాట్లలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు?

సిరాజ్ టెస్ట్, వన్డే (ODI), టీ20 ఇంటర్నేషనల్ (T20I) మూడు ఫార్మాట్లలో భారత్ తరఫున ఆడుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/upasana-telangana-government-has-key-responsibilities-for-upasana/telangana/525946/

Breaking News brook catch drop cricket motivation India vs England Test last test match latest news memorable victory Mohammed Siraj OVAL TEST Ravindra Jadeja six runs win team india win

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.