📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం

IND vs ENG: అంపైర్ పై రాహుల్ ఫైర్.. కారణం ఇదే!

Author Icon By Anusha
Updated: August 2, 2025 • 11:26 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఓవల్ మైదానంలో జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ ఆఖరి టెస్ట్ మ్యాచ్ (Test match) మైదానంలో ఆటగాళ్ల మధ్య ఘర్షణతో మరోసారి వార్తల్లో నిలిచింది. సిరీస్ మొదలైనప్పటి నుంచే ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య వాగ్వాదాలు, తగాదాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మూడో టెస్ట్‌ నుండి ఈ వివాదాలు కాస్త ఎక్కువయ్యాయి. ఈసారి ఐదవ టెస్ట్‌లోనూ ఇదే రీతిలో చిన్నపాటి ఘటన పెద్ద చర్చకు దారితీసింది.ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 22వ ఓవర్ బౌలింగ్ బాధ్యతలను భారత యువ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ తీసుకున్నారు. అతను వేసిన ఒక బౌన్సర్‌కి ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్‌మన్ జో రూట్ (Joe Root) కొద్దిగా అసహనం వ్యక్తం చేశాడు. ఆ బంతి తర్వాత ఇద్దరి మధ్య మాటామాటా ప్రారంభమైంది. బంతి వేగం, బౌన్స్ గురించి రూట్ ఏదో కామెంట్ చేయగా, ప్రసిద్ధ్ కూడా తిరిగి స్పందించాడు. ఇద్దరి మధ్య మాటల తూటాలు మారిపోవడంతో పరిస్థితి కొద్దిగా ఉద్రిక్తంగా మారింది.

ఈ పరిస్థితిని గమనించిన అంపైర్ కుమార్ ధర్మసేన వెంటనే జోక్యం చేసుకుని ప్రసిద్ధ్ కృష్ణను పిలిచి హెచ్చరించారు. మైదానంలో శాంతిని పాటించమని సూచించారు. అయితే అదే సమయంలో జో రూట్‌ను హెచ్చరించకపోవడం టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ (KL Rahul) కు నచ్చలేదు. ఆయన అంపైర్ ధర్మసేన వైపు వెళ్లి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇద్దరి మధ్య కొద్దిసేపు గట్టి వాగ్వాదం చోటుచేసుకుంది.రాహుల్, అంపైర్‌ను “మేము ఏం కావాలనుకుంటున్నారు? ఏమి మాట్లాడకుండా సైలెంట్‌గా ఆడాలా?” అని ప్రశ్నించాడు. దీనికి అంపైర్, “మీరు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, బౌలర్ వచ్చి మిమ్మల్ని ఏదైనా అంటే, అది మీకు నచ్చుతుందా? అందుకే ఇలా చేయొద్దు.” అని రాహుల్‌కి చెప్పాడు. దీనికి రాహుల్, “అంటే మేము కేవలం బ్యాటింగ్, బౌలింగ్ చేసి ఇంటికి వెళ్లాలా?” అని తిరిగి ప్రశ్నించాడు. దీంతో అంపైర్ ధర్మసేన తీవ్రమైన స్వరంతో, “మ్యాచ్ అయిపోయిన తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం. నాతో ఈ విధంగా మాట్లాడకూడదు” అని అన్నారు.

కేఎల్ రాహుల్ ఎందుకు అంపైర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు?

ప్రసిద్ధ్ కృష్ణను హెచ్చరించిన అంపైర్, జో రూట్‌ను హెచ్చరించకపోవడంతో కేఎల్ రాహుల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

ఈ మ్యాచ్‌లో ప్రధాన ఆటగాళ్ల ప్రదర్శన ఎలా ఉంది?

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జో రూట్, బెన్ స్టోక్స్‌ల ప్రదర్శన మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/lionel-messi-%e0%b0%a1%e0%b0%bf%e0%b0%b8%e0%b1%86%e0%b0%82%e0%b0%ac%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%b0%e0%b1%86%e0%b0%82%e0%b0%a1%e0%b0%b5-%e0%b0%b5%e0%b0%b8%e0%b0%be%e0%b0%b0%e0%b0%bf/international/524658/

India England cricket controversy India vs England 5th Test 2025 KL Rahul umpire argument Oval Test heated moment Prasidh Krishna vs Joe Root clash

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.