📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం

IND vs ENG: భారత జట్టుపై పాక్ క్రికెటర్ అసత్య ఆరోపణలు

Author Icon By Anusha
Updated: August 6, 2025 • 4:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్ గడ్డపై చారిత్రాత్మక విజయం సాధించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కానీ ఈ విజయంపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షబ్బీర్ అహ్మద్ (Shabbir Ahmed) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన ట్వీట్ భారత అభిమానుల్లో ఆగ్రహాన్ని రగిలించింది.భారత జట్టు ఇంగ్లండ్‌తో జరిగిన ఐదవ టెస్ట్ మ్యాచ్‌లో చివరి రోజు అద్భుత ప్రదర్శన కనబరిచింది. బౌలర్లు ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్‌ను చిత్తు చేసి జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. ఈ విజయంతో టీమిండియా సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు స్వింగ్, సీమ్ బౌలింగ్‌లో చూపించిన నైపుణ్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ షబ్బీర్ అహ్మద్ మాత్రం దీనికి వేరే కారణం ఉందని ఆరోపిస్తూ వివాదానికి తావిచ్చారు.

ఈ వ్యాఖ్యలు

ఆయన తన ట్వీట్‌లో “80 ఓవర్ల తర్వాత కూడా బంతి కొత్తదానిలా మెరుస్తూ ఎలా ఉంటుంది? ఇది సహజం కాదు. భారత బౌలర్లు వాజిలిన్ లేదా మరే ఇతర పదార్థం ఉపయోగించి బంతిని ట్యాంపరింగ్ చేసి ఉంటారు. అంపైర్లు ఆ బంతిని టెస్టింగ్ కోసం ల్యాబ్‌కు పంపాలి” అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.ఇంగ్లండ్‌తో సోమవారం ముగిసిన ఆఖరి టెస్ట్‌లో టీమిండియా (Team India) 6 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఓవల్ వేదికగా ఐదు రోజుల పాటు ఉత్కంఠగా సాగిన ఆఖరి పోరులో పడిలేచిన టీమిండియా .. మహమ్మద్ సిరాజ్(5/104) అద్వితీయమైన బౌలింగ్‌తో గెలుపొందింది. 374 పరుగుల లక్ష్యచేధనలో 339/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో సోమవారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లండ్.. సిరాజ్ ధాటికి 367 పరుగులకు ఆలౌటైంది.

కొత్త బంతిలా మెరుస్తూ కనిపించింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ 247 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌‌లో భారత్ 396 పరుగులు సాధించింది.ఈ విజయంపై సోషల్ మీడియా (Social media) వేదికగా స్పందించిన షబ్బీర్ అహ్మద్.. భారత్‌పై తనకున్న అక్కసును వెళ్లగక్కాడు. ‘నాకు తెలిసి భారత్.. వాజిలైన్ ఉపయోగించి ఉంటుంది. అందుకే 80 + ఓవర్ల తర్వాత కూడా కొత్త బంతిలా మెరుస్తూ కనిపించింది. ఆ బంతులను అంపైర్లు టెస్ట్‌ల కోసం ల్యాబ్‌కు పంపించాలి.’అని తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.అయితే భారత్ గెలిచిందనే అక్కసుతోనే షబ్బీర్ అహ్మద్ ఈ ఆరోపణలు చేస్తున్నాడని భారత అభిమానులు మండిపడుతున్నారు. చట్ట విరుద్ధమైన బౌలింగ్‌తో ఏడాది నిషేధానికి గురైన షబ్బీర్ అహ్మద్ కూడా ఆరోపణలు చేస్తున్నాడని సెటైర్లు పేల్చుతున్నారు.

నిబంధనలకు విరుద్దంగా

80 ఓవర్ల తర్వాత కొత్త బంతి తీసుకుంటారనే కనీస అవగాహన కూడా షబ్బీర్ అహ్మద్‌కు లేదని మండిపడుతున్నారు.మీడియం పేసర్ అయిన షబ్బీర్ అహ్మద్.. పాక్ తరఫున 10 టెస్ట్‌లు, 32 వన్డేలు, ఒక టీ20 ఆడాడు. అతని బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు విరుద్దంగా ఉందని 2005లో ఐసీసీ ఏడాదిపాటు నిషేధం విధించింది. ఆ తర్వాత అతను అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేయలేకపోయాడు. 2007లో రిటైర్మెంట్ ప్రకటించాడు.

క్రికెట్ ఆటను మొదట ఎక్కడ ఆడారు?

క్రికెట్ ఆట మొదట ఇంగ్లాండ్‌లో 16వ శతాబ్దంలో ఆడబడింది.

క్రికెట్‌లో ప్రధాన ఫార్మాట్లు ఎన్ని?

క్రికెట్‌లో మూడు ప్రధాన ఫార్మాట్లు ఉన్నాయి:టెస్ట్ క్రికెట్,వన్డే ఇంటర్నేషనల్ (ODI),ట్వంటీ20 (T20).

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/cm-revanth-reddy-cm-revanth-reddy-gives-key-responsibilities-to-srh-owner-kavya-maran/telangana/526908/

ball shining controversy Breaking News India historic win in England India vs England test match drama latest news Pakistan ex cricketer claims Shabbir Ahmed ball tampering allegation Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.