📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

IND vs ENG: చివరి టెస్ట్ మ్యాచ్ కోసం టీమిండియా జట్టు ఇదే?

Author Icon By Anusha
Updated: July 30, 2025 • 4:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇంగ్లండ్‌ గడ్డపై కొనసాగుతున్న ఐదు టెస్ట్‌ల సిరీస్‌ చివరి సమరం ప్రారంభంకానుంది. లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా బుధవారం నుంచి ప్రారంభమయ్యే ఈ తుదిపోరులో ఆతిథ్య ఇంగ్లండ్‌తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. ప్రస్తుతానికి సిరీస్‌లో 2-1 తేడాతో వెనుకంజలో ఉన్న భారత్‌, ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను 2-2తో సమం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మాంచెస్టర్ వేదిక (Manchester venue) గా జరిగిన నాలుగో టెస్ట్‌లో అద్భుత పోరాటం చేసి మ్యాచ్‌ను డ్రాగా నిలిపిన టీమిండియా, ఆ విజయవంతమైన ప్రదర్శనతో రెట్టించిన ఆత్మవిశ్వాసాన్ని సొంతం చేసుకుంది.ఆఖరి మ్యాచ్‌లో గెలిచి సిరీస్ సమం చేయాలనే పట్టుదలతో ఉంది.

వేలు ఫ్రాక్చర్‌తో

మరోవైపు ఇంగ్లండ్ మాత్రం సిరీస్ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే పిచ్ క్యూరేటర్ లీ ఫోర్టిస్‌ గంభీర్‌తో వాగ్వాదానికి దిగి అగ్గిని రాజేసాడు. దాంతో ఆఖరి సమరంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆటగాళ్ల మధ్య మాటల యుద్దం, కవ్వింపులు తొలి రోజు ఆట నుంచే మొదలయ్యే అవకాశం ఉంది.ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. దాంతో తుది జట్టులో మార్పులు అనివార్యమయ్యాయి. ఇప్పటికే కుడి కాలి చిటికెన వేలు ఫ్రాక్చర్‌తో రిషభ్ పంత్ (Rishabh Pant) జట్టుకు దూరమయ్యాడు. జస్‌ప్రీత్ బుమ్రా చీల మండ గాయంతో పాటు వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు.ఆకాష్ దీప్ తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. వరుసగా నాలుగు టెస్ట్‌లు ఆడిన మహమ్మద్ సిరాజ్‌కు విశ్రాంతి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే తుది జట్టు ఎంపిక ఆసక్తికరంగా మారింది. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా మూడు టెస్ట్‌లు మాత్రమే ఆడుతానన్న బుమ్రా.. ఆఖరి మ్యాచ్‌కు దూరంగా ఉండే అవకాశం ఉంది.

IND vs ENG: చివరి టెస్ట్ మ్యాచ్ కోసం టీమిండియా జట్టు ఇదే?

సాధారణంగా బ్యాటింగ్‌కు

సిరాజ్‌కు రెస్ట్ ఇస్తారా? కొనసాగిస్తారా? అనేది చూడాలి.ఈ మ్యాచ్‌కు టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాలుగో టెస్ట్‌లో స్పిన్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ అద్భుత శతకాలతో రాణించారు. ఈ ఇద్దరితో పాటు స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌ (Kuldeep Yadav) ను ఆడించే అవకాశం ఉంది. నాలుగో టెస్ట్‌లో విఫలమైన శార్దూల్ ఠాకూర్ స్థానంలో కుల్దీప్ యాదవ్‌ను ఆడించే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఓవల్ పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు. ఫ్రెండ్లీగా ఉంటుంది. ఆట సాగే కొద్దీ బౌలింగ్‌కు అనుకూలంగా మారుతోంది.ముఖ్యంగా నాలుగో, ఐదో రోజు ఆటల్లో అనూహ్యమైన బౌన్స్ ఉండటంతో పాటు స్పిన్‌కు అనుకూలిస్తోంది. ఈ క్రమంలోనే కుల్దీప్ యాదవ్‌ను బరిలోకి దించాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. క్రికెట్ విశ్లేషకులు సైతం శార్దూల్ ఠాకూర్ స్థానంలో కుల్దీప్ యాదవ్‌ను ఆడించాలని సూచిస్తున్నారు.

బుమ్రా స్థానంలో

అయితే ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగితే పేసర్లపై ఎక్కువ భారం పడే అవకాశం ఉంది. దురదృష్టవశాత్తు ఒక్క పేసర్ గాయపడినా.. పరిస్థితులు సంక్లిష్టంగా మారుతాయి.టెస్ట్ క్రికెట్‌ అరంగేట్రం కోసం వేచి చూస్తున్న అర్ష్‌దీప్ సింగ్ కల ఆఖరి మ్యాచ్‌తో నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుమ్రా స్థానంలో అర్ష్‌దీప్ సింగ్‌ బరిలోకి దిగే అవకాశం ఉంది. నాలుగో టెస్ట్‌కు దూరమైన ఆకాష్ దీప్ కూడా రీఎంట్రీ ఇవ్వనున్నాడు. అన్షుల్ కాంబోజ్‌పై వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిరాజ్‌కు రెస్ట్ ఇస్తే మాత్రం అన్షుల్ కొనసాగుతాడు. బ్యాటింగ్ విభాగంలో పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్ ఆడనున్నాడు. ఈ ఒక్కటి మినహా పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు.

IND vs ENG 2025 సిరీస్ ఎక్కడ జరగనుంది?

ఈ సిరీస్‌ ఇంగ్లండ్ గడ్డపై జరుగుతుంది. లండన్, మాంచెస్టర్, ఓవల్, లీడ్స్ వంటి ప్రముఖ మైదానాలు ఈ సిరీస్‌కు వేదికలు కానున్నాయి.

ఈ సిరీస్‌ను ఏ పేరుతో పిలుస్తారు?

ఈ సిరీస్‌ను “అండర్సన్-సచిన్ ట్రోఫీ” పేరుతో నిర్వహిస్తున్నారు.

ఇంగ్లండ్‌తో తుది జట్టు (అంచనా)

యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్, ధ్రువ్ జురెల్(కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Sania Mirza: అక్షయ్ కుమార్‌కి నేను పెద్ద ఫ్యాన్

IND vs ENG Anderson Sachin Trophy Decider IND vs ENG Final Test Match Preview India vs England 5th Test London Team India vs England Oval Test Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.