📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

IND vs ENG: ఉత్కంఠ పోరులో భారత్ విజయం

Author Icon By Anusha
Updated: August 4, 2025 • 5:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

లండన్‌లోని ది ఓవల్ మైదానంలో టీమిండియా ఇంగ్లండ్ పర్యటనను చిరస్మరణీయ విజయంతో ముగించింది. ఐదు టెస్ట్‌ల సిరీస్‌ (Test series) లో చివరి మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగి అభిమానుల గుండెల్లో కొట్టుకునేలా చేసింది. నాలుగో రోజు ముగిసే సమయానికి 339/6 స్కోర్‌తో కొనసాగుతున్న ఇంగ్లండ్ జట్టు, చివరి రోజున లక్ష్యం చేరుకునేందుకు నమ్మకంగా మైదానంలోకి దిగింది. 374 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు ప్రయత్నించిన ఇంగ్లండ్ జట్టు 85.1 ఓవర్లలో 367 పరుగులకే ఆలౌటై, భారత జట్టుకు 6 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందించింది.మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj),(5/104) ఐదు వికెట్లతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ గెలుపుతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ 2-2తో సమంగా నిలిచింది. ఈ ఐదు టెస్ట్‌ల సిరీస్‌ చరిత్రలోనే ది బెస్ట్‌గా నిలిచింది.ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ను జెమీ ఓవర్టన్ రెండు బౌండరీలతో దూకుడుగా ప్రారంభించాడు.

బ్యాటింగ్ చేసేందుకు సాహసం చేశాడు

కానీ సిరాజ్, జెమీ స్మిత్(2)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చి భారత శిభిరంలో ఆశలు రేకెత్తించాడు. తన మరుసటి ఓవర్‌లో దూకుడుగా ఆడిన జెమీ ఓవర్టన్(9)ను సిరాజ్ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. జోష్ టంగ్(0)ను స్టన్నింగ్ యార్కర్‌తో ప్రసిధ్ కృష్ణ క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో మ్యాచ్ ఉత్కంఠగా మారగా, జట్టు కోసం తీవ్ర గాయంతో క్రిస్ వోక్స్ (Chris Vokes) బ్యాటింగ్‌కు దిగాడు.ఒంటి చేత్తోనే బ్యాటింగ్ చేసేందుకు సాహసం చేశాడు. వోక్స్ సాయంతో అట్కిన్సన్ జట్టు విజయం కోసం పోరాడాడు. సిరాజ్ బౌలింగ్‌లో అతను భారీ షాట్ కొట్టగా, బౌండరీ లైన్‌పై ఆకష్ దీప్ క్యాచ్ వదిలేసాడు. దాంతో అది సిక్సర్‌గా మారింది. ఆ తర్వాతి మూడు బంతులను డాట్ అవ్వగా.. ఆఖరి బంతికి బై రూపంలో సింగిల్ వచ్చింది. దాంతో మళ్లీ అట్కిన్సన్ స్ట్రైకింగ్‌లోకి వచ్చాడు.

IND vs ENG:

సిరాజ్ ఒంటి చేత్తో టీమిండియాను ఓటమి నుండి తప్పించాడు

ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లో అట్కిన్సన్ మూడు పరుగులు చేసి మళ్లీ స్ట్రైక్ తీసుకున్నాడు. కానీ సిరాజ్.. అట్కిన్సన్‌ను క్లీన్ బౌల్డ్ చేసి భారత విజయాన్ని లాంఛనం చేశాడు. బంతి బంతికి సమీకరణం మారిన ఈ మ్యాచ్‌లో విజయం టీమిండియానే వరించింది. మహమ్మద్ సిరాజ్ ఒంటి చేత్తో టీమిండియాను ఓటమి నుండి తప్పించాడు. సెంచరీలతో చెలరేగిన జో రూట్, హ్యారీ బ్రూక్‌లు ఔటవ్వడం ఈ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా మారింది.ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 224 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ 247 పరుగులకు ఆలౌటైంది. అనంతరం భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 396 పరుగుల భారీ స్కోర్ చేసి 374 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

మొహమ్మద్ సిరాజ్ అంతర్జాతీయ అరంగేట్రం ఎప్పుడు చేశారు?

మొహమ్మద్ సిరాజ్ 2017లో టీ20 ఫార్మాట్‌లో భారత తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రవేశించారు.

మొహమ్మద్ సిరాజ్ ముఖ్య విజయాలు ఏమిటి?

2021లో ఆస్ట్రేలియా పర్యటనలో కీలక వికెట్లు తీసి భారత విజయానికి ప్రధాన కారణమయ్యారు.2023 ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకపై 6 వికెట్లు తీసి రికార్డు సృష్టించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/ind-vs-eng-will-india-win-in-a-tough-fight/international/525803/

5 Match Test Series Draw 6 Run Win Breaking News England All Out 367 India Tour of England latest news Mohammed Siraj Five Wickets Team India Victory Telugu News Thrilling Test Match

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.