📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

IND vs ENG: చరిత్ర సృష్టించిన గిల్-రాహుల్

Author Icon By Anusha
Updated: July 27, 2025 • 11:00 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియం మరోసారి భారత క్రికెట్ చరిత్రకు వేదికైంది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి అంచుల వరకూ వెళ్లినా, యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill), అనుభవజ్ఞుడైన కేఎల్ రాహుల్ అసాధారణ ఆటతీరు ప్రదర్శించి భారత జట్టును రక్షించారనే చెప్పాలి. ప్రస్తుతం భారత్‌కు గెలుపు కంటే డ్రా ముఖ్యమయ్యింది. ఇంగ్లాండ్ మాత్రం చివరి రోజు భారత జట్టును ఆలౌట్ చేసి విజయం సాధించాలని ప్రయత్నిస్తోంది. కానీ గిల్-రాహుల్ ద్వయం వారి ఆశలకు గట్టి చెక్ పెట్టారు.సున్నా పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయిన తర్వాత, భారత ఇన్నింగ్స్ పూర్తిగా కుదేలవుతుందనే భావన అందరిలో కలిగింది.

ఒక్కో బంతిని జాగ్రత్తగా ఆడుతూ

కానీ అప్పుడే క్రీజులోకి వచ్చిన శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ జోడీ ఇంగ్లాండ్ బౌలర్లను నెమ్మదిగా ఎదుర్కొంటూ మ్యాచ్‌లో మళ్లీ భారత్‌కు ఊపునిచ్చింది. ఈ జోడీ ఎంతో సహనంగా, తెలివిగా ఆడుతూ, ఒక్కో బంతిని జాగ్రత్తగా ఆడుతూ భారత్‌కు అత్యవసరమైన నిలకడను అందించారు.ఈ టెస్ట్ సిరీస్‌లో గిల్, రాహుల్ (Rahul) ఇద్దరూ అద్భుతమైన ప్రదర్శన కనబర్చారు. గిల్ ఇప్పటికే 650కి పైగా పరుగులు నమోదు చేయగా, రాహుల్ కూడా 500 పరుగుల మార్కును అధిగమించాడు. ఒక్క సిరీస్‌లో 500కి పైగా పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జోడీగా ఈ ఇద్దరూ మూడో స్థానంలో నిలిచారు. ఇది భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక అరుదైన రికార్డుగా నిలిచింది.

బ్యాటింగ్‌ నైపుణ్యం

గతంలో సునీల్ గావస్కర్ – దిలీప్ వెంగస్కర్ జోడీ, అలాగే రాహుల్ ద్రవిడ్ – సచిన్ టెండూల్కర్ జోడీ ఈ ఘనత సాధించగా, ఇప్పుడు గిల్-రాహుల్ వారికే మూడవ స్థానంలో చేరారు. ఇది వీరి బ్యాటింగ్‌ నైపుణ్యం, ఆత్మవిశ్వాసానికి నిదర్శనం.చివరిసారిగా ఈ ఘనత 1971లో సునీల్ గవాస్కర్, దిలీప్ సర్దేశాయ్ (Dilip Sardesai) జోడీ వెస్టిండీస్‌పై సాధించారు. ఆ టెస్ట్ సిరీస్‌లో సునీల్ గవాస్కర్ 774 పరుగులు చేయగా.. దిలీప్ 648 పరుగులు సాధించారు. అంతకు ముందు భారత్ తరఫున ఈ ఘనతను మొదట 1948లో విజయ్ హజారే, రూసీ మోడీ సాధించారు.

వికెట్ల నష్టానికి

ఈ ఇద్దరు ఆటగాళ్లు వెస్టిండీస్‌పై టెస్ట్ సిరీస్‌లో 500కి పైగా పరుగులు చేశారు. ఆ సిరీస్‌లో విజయ్ హజారే 543 పరుగులు చేయగా, రూసీ మోడీ 560 పరుగులు చేశారు.నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా (Team India) 2 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ ఇద్దరూ అర్ధ సెంచరీలు సాధించారు. రాహుల్ 87 పరుగులతో, గిల్ 78 పరుగులతో నాటౌట్‌గా క్రీజులో ఉన్నారు. టీమిండియా ప్రస్తుతం ఇంగ్లాండ్ కంటే 137 పరుగులు వెనుకబడి ఉంది.

ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు ఎన్ని మ్యాచులు ముగిశాయి?

ఇప్పటి వరకు 4 టెస్ట్ మ్యాచ్‌లు ముగిశాయి. ఐదో టెస్ట్ జరగాల్సి ఉంది.

నాలుగో టెస్ట్‌లో టీమిండియా ఎలా ఆడింది?

టీమిండియా మొదట రెండు వికెట్లు త్వరగా కోల్పోయినప్పటికీ, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడి మ్యాచ్‌ను డ్రా వైపుకు తీసుకెళ్లారు. వారు చరిత్రాత్మక భాగస్వామ్యం నెలకొల్పారు.

Read hindi news: hindi.vaartha.com

Read also: KL Rahul : టీమిండియాను ఆదుకున్న గిల్, కేఎల్ రాహుల్

Breaking News Fourth Test Match Gill Rahul Record India England Draw India vs England Test Indian Batting Partnership KL Rahul latest news Old Trafford Test Match Shubman Gill Telugu News Test Cricket Records

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.