📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు

IND vs ENG: రిషభ్ పంత్ ప్రతిభను కొనియాడిన గంభీర్

Author Icon By Anusha
Updated: July 28, 2025 • 2:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా అద్భుతంగా పోరాడి మ్యాచ్‌ను డ్రా చేసుకోవడంపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) గర్వంగా భావించాడు. దేశం తరఫున పోరాడిన ప్రతి ఆటగాడి ప్రతిభను ఆయన ప్రశంసించాడు. ముఖ్యంగా గాయంతోనూ బ్యాటింగ్ చేసి జట్టును నిలబెట్టిన రిషభ్ పంత్‌ను ఎంత పొగిడినా తక్కువేనన్నారు. ఆటకు నిజమైన అర్థం ఇలాంటివే అని గంభీర్ అభిప్రాయపడ్డాడు.ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌లు అజేయ శతకాలతో మెరిసి టీమిండియా (Team India) ను ఓటమి అంచుల నుంచి గట్టెక్కించారు. ఆదివారం మ్యాచ్ ముగిశాక మీడియా సమావేశంలో మాట్లాడిన గంభీర్, “ఈ మ్యాచ్‌ను డ్రా చేయడం మన జట్టుకు గర్వకారణం. చాలా మంది ముందే ఓటమి అంటూ అంచనాలు వేశారు.

శుభ్‌మన్ గిల్ ప్రతిభపై ఎలాంటి సందేహం అవసరం లేదు

కానీ మా ఆటగాళ్లు అసాధ్యాన్ని సాధ్యం చేశారు” అని అన్నారు.దేశం కోసం మా ఆటగాళ్లు పోరాడుతారు. శుభ్‌మన్ గిల్ ప్రతిభపై ఎలాంటి సందేహం అవసరం లేదు. క్రికెట్ గురించి తెలియని వారికే అతనిపై సందేహాలు ఉంటాయి. శుభ్‌మన్ గిల్‌కు కెప్టెన్సీ ఏ మాత్రం భారం కాదు.రిషభ్ పంత్ కాలికి గాయమవ్వడంతో ఆఖరి టెస్ట్‌కు దూరమయ్యాడు. విరిగిన కాలుతో బ్యాటింగ్ చేసిన రిషభ్ పంత్‌ (Rishabh Pant) ను ఎంత ప్రశంసించినా తక్కువే. అతని పోరాటం రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుంది.’అని గంభీర్ తెలిపాడు.ఈ మ్యాచ్‌ను ముందుగానే డ్రా చేయాలని బెన్ స్టోక్స్ కోరడాన్ని గంభీర్ తప్పుబట్టాడు. ఇది సరైన చర్య కాదని, ఇంగ్లండ్ ఆటగాళ్లు కూడా సెంచరీలకు చేరువగా ఉంటే స్టోక్స్ డ్రాకు అంగీకరించేవాడా? అని ప్రశ్నించాడు.

IND vs ENG: రిషభ్ పంత్ ప్రతిభను కొనియాడిన గంభీర్

జట్టు గెలుపు కోసం మాత్రమే

జడేజా, వాషింగ్టన్ సుందర్ అద్భుత బ్యాటింగ్‌తో సెంచరీలకు చేరువైనప్పుడు డ్రాకు ఎలా అంగీకరిస్తాం. బెన్ స్టోక్స్ అలా ఎలా అడుగుతాడు? ఇంగ్లండ్ ఆటగాళ్లే ఇలా సెంచరీకి చేరువగా ఉన్నప్పుడు అతను ఇలానే డ్రాకు ఒప్పుకునేవాడా? జడేజా, సుందర్ సెంచరీలు చేసుకోవడానికి పూర్తి అర్హులు. మేం ఎవర్నీ సంతోషపెట్టడానికి ఆడటం లేదు. జట్టు గెలుపు కోసం మాత్రమే ఆడుతున్నాం.’అని గంభీర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.బుమ్రా ఫిట్‌నెస్ గురించి ప్రత్యేకంగా మాట్లాడకపోయినప్పటికీ, జట్టులోని పేసర్లంతా ఫిట్‌గానే ఉన్నారని గంభీర్ స్పష్టం చేశాడు. ఆఖరి టెస్ట్‌లో విజయం సాధించి సిరీస్‌ను 2-2తో సమం చేయడమే తమ లక్ష్యమని చెప్పాడు.

గంభీర్ క్రికెట్ కెరీర్ ఎప్పుడు ప్రారంభమైంది?

గంభీర్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌ను 2003లో ప్రారంభించాడు. టెస్ట్, వన్డే, టి20 ఫార్మాట్లలో భారత్ తరఫున ఆడాడు.

గంభీర్ రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చాడు?

2019లో భారతీయ జనతా పార్టీ (BJP) లో చేరి, తూర్పు ఢిల్లీ నియోజకవర్గం నుండి ఎంపీగా గెలిచాడు.

Read Hindi News : hindi.vaartha.com

Read also : Test Match Controversy : ఇంగ్లండ్‌ పై భారత ఆటగాళ్ల సమాధానం

Breaking News cricket draw match Gautam Gambhir India vs England Test latest news Team India fightback Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.