📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

IND vs ENG: మూడో టెస్ట్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్

Author Icon By Anusha
Updated: July 10, 2025 • 5:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఐదు టెస్ట్‌ల సచిన్-అండర్సన్ ట్రోఫీలో భాగంగా లార్డ్స్ మైదానంలో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌కు ఉత్కంఠ భరితంగా శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు ఇరు జట్లు తలో విజయాన్ని సాధించి 1-1తో సమంగా నిలవడంతో, ఈ మూడో టెస్ట్ కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో, ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నారు.పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) తెలిపాడు. ‘మేం ముందుగా బ్యాటింగ్ చేస్తాం. సాధారణంగా ఈ పిచ్ తొలి గంట బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు అనుకూలంగా మారుతోంది. ఈ మ్యాచ్ కోసం మేం అన్ని విధాల సిద్దమయ్యాం. ఈ సిరీస్‌ హోరాహోరీగా సాగుతోంది. మేమంతా ఫిట్‌గా ఉన్నాం. గత మ్యాచ్ తర్వాత చాలా తక్కువ సమయం మాత్రమే లభించింది. అయినా మేం చాలా ఫ్రెష్‌గా ఉన్నాం. లార్డ్స్‌ (Lord’s) లో ఆడటం అందరికీ ఇష్టం. ఈ మ్యాచ్‌ను ఆస్వాదించాలి. తుది జట్టులో ఒకే ఒక మార్పు చేశాం. జోష్ టంగ్ స్థానంలో జోఫ్రా ఆర్చర్‌ తుది జట్టులోకి వచ్చాడు.’అని బెన్ స్టోక్స్ తెలిపాడు.

నేను ముందుగా బౌలింగ్ ఎంచుకునేవాడిని

టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ, టాస్ గెలిస్తే తాము ముందుగా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని అన్నాడు. వరుసగా మూడో మ్యాచ్‌‌లోనూ గిల్ టాస్ ఓడిపోయాడు. ‘వాస్తవానికి ఈ ఉదయం నేను కాస్త గందరగోళానికి గురయ్యాను. టాస్ గెలిస్తే ఏం తీసుకోవాలో అర్థం కాలేదు. అయితే నేను ముందుగా బౌలింగ్ ఎంచుకునేవాడిని. తొలి సెషన్‌లో పిచ్ నుంచి బౌలర్లకు సహకారం ఉంటుంది. గత మ్యాచ్‌లో అందరూ రాణించారు. బౌలర్లు రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఎడ్జ్‌బాస్టన్ వికెట్‌పై 20 వికెట్లు తీయడం సులువైన పనికాదు. మేం ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతున్నాం. ప్రసిధ్ కృష్ణ స్థానంలో జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) తుది జట్టులోకి వచ్చాడు.’అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు. బుమ్రా కోసం ప్రసిధ్‌ను తుది జట్టులో నుంచి తప్పించాల్సి వచ్చిందన్నాడు.

IND vs ENG: మూడో టెస్ట్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్

తుది జట్టు

తుది జట్లు: భారత్ : యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా (Ravindra Jadeja), వాషింగ్టన్ సుందర్, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ఇంగ్లండ్ : జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్(కెప్టెన్), జేమీ స్మిత్(వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, షోయబ్ బషీర్.

IND vs ENG 2025 సిరీస్‌ ఏ ఫార్మాట్‌లో జరుగుతోంది?

IND vs ENG 2025 సిరీస్ ఐదు టెస్టుల సిరీస్‌గా జరుగుతోంది. ఇది సచిన్-అండర్సన్ ట్రోఫీగా పేరుపొందింది.

ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు ఎన్ని మ్యాచ్‌లు జరిగాయి?

ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు మూడు టెస్టులు పూర్తయ్యాయి. ఇంగ్లండ్ ఒకటి, భారత్ ఒకటి గెలిచాయి. మూడో టెస్ట్ మళ్లీ ఉత్కంఠగా సాగుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Jagan Mohan Rao: జగన్మోహన్ రావు అరెస్టుపై సీఐడీ కీలక ప్రకటన

Ben Stokes Toss Decision Breaking News England vs India 3rd Test Jofra Archer playing 11 latest news Lord’s Test 2025 Sachin Anderson Trophy Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.