📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Ind-Pak: పాకిస్థాన్ పై భారత్ అనూహ్య నిర్ణయం

Author Icon By Ramya
Updated: July 23, 2025 • 1:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఎంతో ప్రశాంతంగా ఉన్న భారతదేశం పహల్గామ్ ఉగ్రదాడితో మొత్తం ప్రపంచమే ఉలిక్కిపడేలా చేసింది. హానీమూన్ జంటలు, కుటుంబ సభ్యులు ఉల్లాసంగా పహల్గామ్లో విహరిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఉగ్రవాదులు వీరిపై కాల్పులను జరిపారు. హిందువులు, మగవారిని టార్గెట్ చేసిన కాల్పుల్లో 26మంది మగవారిని హతమార్చింది. దీంతో ఈ కుటుంబాలకు పెద్దదిక్కు లేకుండా చేసిన ఉగ్రవాదులపై భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో యుద్ధానికి దిగింది. ఈ దిగ్భ్రాంతికర ఘటనను కేంద్ర ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది.

Ind-Pak: పాకిస్థాన్ పై భారత్ అనూహ్య నిర్ణయం

పాక్ విమానాలకు భారత గగనతలంపై నిషేధం ఆగస్టు 23 వరకు పొడిగింపు

Ind-Pak: పాకిస్థాన్పై కఠిన ఆంక్షలను విధించింది. విమానాల రాకపోకలను నిషేధాలను పొడిగించిన భారత్ అప్పట్లోనే భారత గగనతలంలోకి పాకిస్థాన్ విమానల రాకను నిషేధించింది కేంద్ర ప్రభుత్వం. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ నిషేధాన్ని పొడిగించింది. భారత గగనతలంలోకి పాకిస్థాన్ విమానాల రాకపోకలపై విధించిన నిషేధాన్ని ఆగస్టు 23వరకు పొడిగించింది. ఈ విషయాన్ని పౌర విమానయాన శాఖ సహాయమంత్రి మురళీధర్ మోహోల్ (Muralidhar Mohol) వెల్లడించారు. ఈ మేరకు తన అధికార ఎక్స్ అకౌంట్లో ఈ సమాచారాన్ని పోస్ట్ చేశారు. నోటీసు టు ఎయిర్మెన్ను అధికారికంగా 2025 ఆగస్టు 23వరకు పొడిగించినట్లు తెలిపారు.

ఉగ్రదాడి అనంతరం భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు మూడుమెట్లు పెరిగిన పరిస్థితి

పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత మే నెలలో భారత్-పాకిస్థాన్ (Ind-Pak) మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. భద్రతపరమైన కారణాలతో ఆంక్షలు భద్రతపరమైన కారణాల దృష్ట్యా ఈ నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దీనివల్ల పాకిస్థాన్ విమానయాన సంస్థలు (Pakistani airlines) భారత్ మీదుగా రాకపోకలు సాగించట్లేదు. ఫలితంగా వాటి ప్రయాణ సమయం దాదాపు 10-15శాతం వరకు పెరుగుతోంది. సింధూనదీ జలాలను కూడా భారత్ నిలిపివేసింది. దీంతో పాకిస్థాన్ రైతులకు నీరులేక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం రెండు దేశాలమధ్య తీవ్ర ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతున్నది.

ఇండియా పాకిస్తాన్ ఎందుకు విడిపోయింది?

భారత ఉపఖండంలో బ్రిటిష్ రాజ్యం, బ్రిటిష్ పాలన ముగింపులో అది ఒక భాగం. విభజనకు ప్రధాన కారణం సయ్యద్ అహ్మద్ ఖాన్ ప్రతిపాదించిన రెండు దేశాల సిద్ధాంతం, ముస్లింలు మరియు హిందువులు ఒకే దేశంలో ఉండటానికి చాలా భిన్నంగా ఉన్నారని పేర్కొంది. పాకిస్తాన్ ముస్లిం-మెజారిటీ దేశంగా మారింది.

పాకిస్తాన్ ఎందుకు భారతదేశానికి వ్యతిరేకంగా ఉంది?

కాశ్మీర్ మరియు సీమాంతర ఉగ్రవాదంపై దీర్ఘకాలంగా కొనసాగుతున్న వివాదం రెండు రాష్ట్రాల మధ్య సంఘర్షణకు ప్రధాన కారణం, 1971 ఇండో-పాకిస్తాన్ యుద్ధం తప్ప, ఇది పూర్వపు తూర్పు పాకిస్తాన్ (ఇప్పుడు బంగ్లాదేశ్ ..)లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం నుండి ఉద్భవించిన శత్రుత్వాల ప్రత్యక్ష ఫలితంగా సంభవించింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Dubai Ruler : సామాన్యుడిగా ట్రామ్‌లో ప్రయాణించిన దుబాయ్‌ పాలకుడు

airspace ban Breaking News India-Pakistan tension Indus River water restriction latest news Operation Sindhur Pahalgam Attack Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.