📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Yahya Sinwar : సిన్వర్ స్థానంలో హమాస్ కు కొత్త చీఫ్ నెక్ట్స్ నువ్వే

Author Icon By Divya Vani M
Updated: June 3, 2025 • 11:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గాజాలో హమాస్‌కు చెందిన కీలక సైనిక నాయకుడు మహమ్మద్ సిన్వార్ (Mohammed Sinwar) ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హతమయ్యాడు. ఈ సంఘటనతో హమాస్ కొత్త నాయకుడిగా ఇజ్ అల్-దిన్ అల్-హద్దాద్ (Izz al-Din al-Haddad)పేరును ప్రముఖంగా వినిపిస్తోంది.మే 13, 2025న ఖాన్ యూనస్‌లోని యూరోపియన్ ఆసుపత్రి దగ్గర ఈ దాడి జరిగింది. ఐడీఎఫ్ (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్) 30 సెకన్లలో 50కి పైగా ప్రెసిషన్ ఆయుధాలతో దాడి చేసింది. ఆసుపత్రి భవనం దెబ్బతినకుండా, కిందున్న హమాస్ కమాండ్ సెంటర్‌ను లక్ష్యంగా చేసుకుంది.ఈ దాడిలో సిన్వార్‌తో పాటు మహమ్మద్ షబానా, మెహదీ క్వారాలు కూడా చనిపోయారు. వీరిద్దరూ హమాస్ సీనియర్ మిలిటరీ నేతలే.

అల్-హద్దాద్ – హమాస్‌కు తదుపరి నాయకుడు?

ఇజ్ అల్-దిన్ అల్-హద్దాద్ ప్రస్తుతం హమాస్‌లో అత్యంత సీనియర్ కమాండర్. 2021 నుంచి ఖస్సామ్ బ్రిగేడ్స్‌కు నాయకత్వం వహిస్తున్నారు. 2023లో ఉత్తర గాజా బ్రిగేడ్ చీఫ్‌గా నియమితులయ్యారు.అతను గజాలో ప్రస్తుతం జీవించి ఉన్న ఏకైక హమాస్ బ్రిగేడ్ నేత. ఇజ్రాయెల్ ఇప్పటికే అతని తలపై 7.5 లక్షల డాలర్ల రివార్డు ప్రకటించింది. ఆరు సార్లు హత్యాప్రయత్నాల నుంచి తప్పించుకున్నాడన్న ప్రచారం ఉంది.

తదుపరి లక్ష్యం – అల్-హద్దాద్

అల్-హద్దాద్ అక్టోబర్ 7 దాడికి కీలక ప్లానర్. ప్రస్తుతం బందీల వ్యవహారాలపై ఆధిపత్యం చూపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో, అతను ఇప్పుడు హమాస్‌కి పూర్తి సైనిక నియంత్రణ చేపట్టే అవకాశం ఉంది.ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ స్పందిస్తూ, తదుపరి నువ్వే అని హెచ్చరించారు. ఇది గాజాలో ఉద్రిక్తతను మరింత పెంచే అవకాశముందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Read Also : Pakistan : చైనా ఆయుధాల డొల్లతనం బయటపడిందన్న నిపుణులు

Gaza airstrike May 2025 Israel Hamas conflict update Mohammad Sinwar death

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.