📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

India : ఆదాయ సమానత్వంలో ప్రపంచంలో 4వ స్థానంలో నిలిచిన భారత్

Author Icon By Divya Vani M
Updated: July 5, 2025 • 10:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచ బ్యాంకు (World Bank) తాజా గణాంకాలు భారత్‌ను ఆదాయ సమానత్వం (Income equality in India)లో ప్రపంచంలో నాలుగో స్థానానికి చేర్చాయి. గిని సూచీ ప్రకారం, భారత్ స్కోరు 25.5గా నమోదై స్లోవాక్, స్లోవేనియా, బెలారస్‌ల తర్వాత నిలిచింది. ఇది అమెరికా, చైనా లాంటి అగ్రరాజ్యాలను వెనక్కి నెట్టిన ఘనతగా మారింది.2011లో భారత్ గిణి స్కోరు 28.8గా ఉండగా, ఇప్పుడు అది 25.5కి తగ్గింది. ఇది దేశంలోని ఆదాయ అసమానతలు తగ్గుతున్నట్లు స్పష్టంగా చెబుతోంది. అంతేకాదు, ఆర్థిక అభివృద్ధి ఫలాలు సామాన్యులకు చేరుతున్నాయని ప్రపంచ బ్యాంకు గుర్తించింది.2011 నుంచి 2023 మధ్య భారత్‌లో 17.1 కోట్ల మంది తీవ్ర పేదరికం నుంచి బయటపడ్డారని నివేదిక వెల్లడించింది. రోజుకు 2.15 డాలర్ల ఆదాయాన్ని ఆధారంగా తీసుకుంటే, దేశ పేదరిక రేటు 16.2 శాతం నుంచి 2.3 శాతానికి తగ్గింది.ఈ విజయానికి ప్రధానంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు కారణమయ్యాయి. ముఖ్యంగా, జనధన్ యోజన కింద 55 కోట్లకు పైగా ఖాతాలు తెరవడం, ఆధార్ ఆధారిత డీబీటీ ద్వారా 142 కోట్ల మందికి నిధులు పంపిణీ చేయడం ఈ మార్పును తీసుకువచ్చింది.

India : ఆదాయ సమానత్వంలో ప్రపంచంలో 4వ స్థానంలో నిలిచిన భారత్

డీబీటీ ద్వారా భారీగా ఖర్చుల తగ్గింపు

డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) ద్వారా రూ.3.48 లక్షల కోట్లు ప్రభుత్వానికి ఆదా అయ్యాయి. లబ్ధిదారులకు నేరుగా నిధులు చేరడంతో ముడుపులకు చోటు లేకుండా మారింది.

ఆరోగ్య, ఆహార భద్రత కీలకం

ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 41 కోట్ల మందికి ఆరోగ్య రక్షణ లభించింది. అలాగే, పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన ద్వారా 80 కోట్ల మందికి ఉచితంగా ఆహారం అందడం సమానత పెంపుకు తోడ్పడింది.

వాస్తవంగా మారిన అభివృద్ధి ఫలితాలు

వికాసం గణాంకాల్లో కాదు, జీవితాల్లో కనిపించాల్సిందే అన్న లక్ష్యంతో తీసుకున్న చర్యలే ఈ విజయానికి మూలం. భారత్ ఇప్పుడు ఆదాయ సమానత్వంలో కూడా ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది.

Read Also : Ryanair flight : స్పెయిన్‌లో విమానం రెక్కపై నుంచి దూకేసిన ప్రయాణికులు

EconomicGrowthIndia GiniIndex2025 GiniIndexIndia IncomeEquality IndiaDevelopment IndiaIncomeEquality PovertyReduction WorldBankReport

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.