📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Imran Khan: భారత్ మళ్ళీ దాడి చేయొచ్చు: ఇమ్రాన్ ఖాన్

Author Icon By Sharanya
Updated: May 23, 2025 • 11:41 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌కు ఫీల్డ్ మార్షల్ హోదా కల్పించడాన్ని వ్యంగ్యంగా విమర్శించిన ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.

ఫీల్డ్ మార్షల్‌గా అసిమ్ మునీర్ – దేశంలో రెండో అధికారి

భారత్‌తో ఇటీవల జరిగిన ఘర్షణలో కీలక పాత్ర పోషించినందుకు గాను జనరల్ అసిమ్ మునీర్‌కు మంగళవారం ఫీల్డ్ మార్షల్ హోదాను ప్రకటించారు. పాకిస్థాన్ చరిత్రలో ఈ గౌరవం పొందిన రెండో సైనికాధికారి జనరల్ మునీర్ కావడం గమనార్హం. ఈ పదోన్నతిపై ఇమ్రాన్ ఖాన్ స్పందిస్తూ మాషా అల్లా, జనరల్ అసిమ్ మునీర్‌ను ఫీల్డ్ మార్షల్‌ను చేశారు. నిజం చెప్పాలంటే, ఆయనకు ‘రాజు’ అనే బిరుదు ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే ప్రస్తుతం దేశంలో ఆటవిక చట్టం నడుస్తోంది. అడవిలో ఒక్కడే రాజు ఉంటాడు అని సెటైర్ వేశారు.

ఆర్మీతో ఒప్పందం లేదు – చర్చలకు సిద్ధమన్న ఇమ్రాన్

విధ్వంసకర కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నప్పటికీ, ఇమ్రాన్ ఖాన్ సైన్యంతో తాను ఏదో ఒప్పందం కుదుర్చుకున్నానంటూ వస్తున్న వదంతులను ఖండించారు. ఎలాంటి ఒప్పందం జరగలేదు, ప్రస్తుతం ఎటువంటి చర్చలూ కొనసాగడం లేదు. ఇవన్నీ నిరాధారమైన అబద్ధాలు అని ఆయన స్పష్టం చేశారు. అయితే, పాకిస్థాన్ ప్రయోజనాలు, భవిష్యత్తు దృష్ట్యా దేశ ఐక్యత కోసం సైనిక నాయకత్వంతో చర్చలు జరపడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. దేశం ప్రస్తుతం బాహ్య ముప్పులు, పెరుగుతున్న ఉగ్రవాదం, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మనమంతా ఏకం కావాలి. నా కోసం నేనెప్పుడూ ఏమీ అడగలేదు, ఇకముందు కూడా అడగను అని ఆయన పేర్కొన్నారు.

భారత్ మరోసారి దాడికి పాల్పడే అవకాశం

ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం అధికారంలో ఉన్న షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. భారత్ మరోసారి దాడికి పాల్పడే అవకాశం ఉందని, కాబట్టి ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. దేశంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని అణచివేస్తున్నారని ఆయన ఆరోపించారు. పెద్ద దొంగలకు పెద్ద పదవులు కట్టబెడుతున్నారనే సందేశం ఇస్తుంటే, న్యాయాన్ని పాతిపెట్టినట్లే. అధ్యక్షుడు ఆసిఫ్ జర్దారీ సోదరిపై ఉద్యోగుల పేర్లతో నమోదైన ఐదు అపార్ట్‌మెంట్లకు సంబంధించిన కేసు నాబ్ వద్ద ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఆమె విదేశాల్లో ఉన్నారు, ఆమెను ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేదు. 22 బిలియన్ రూపాయల మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న షెహబాజ్ షరీఫ్‌ను ప్రధానమంత్రిని చేశారు అని ఇమ్రాన్ విమర్శించారు.

నైతిక పతనానికి పాకిస్థాన్ ఎలా దిగజారిందో చెబుతున్న ఇమ్రాన్

పాకిస్థాన్ నైతిక, రాజ్యాంగ చట్రం పూర్తిగా నాశనమైందని ఇమ్రాన్ ఆవేదన వ్యక్తం చేశారు. తోషాఖానా-II కేసులో తూతూమంత్రంగా విచారణను పునఃప్రారంభించారు. జైలులో మాదిరిగానే, కోర్టులో కూడా ఒక కల్నల్ ఇష్టానుసారమే నడుస్తోంది. నా సోదరీమణులను, న్యాయవాదులను కోర్టులోకి అనుమతించడం లేదు. నా సహచరులను నన్ను కలవనివ్వడం లేదు. నెలల తరబడి నా పిల్లలతో మాట్లాడే అవకాశం లేకుండా చేశారు. నా పుస్తకాలు కూడా నాకు చేరడం లేదు. నా వైద్యుడిని సంప్రదించేందుకు కూడా అనుమతించడం లేదు. ఇది కోర్టు ఆదేశాలు, చట్టాలను నిరంతరం ఉల్లంఘించడమే అని ఇమ్రాన్ ఆవేదన వెలిబుచ్చారు. ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు పాకిస్తాన్‌లోని అధికార వ్యవస్థలపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ప్రతిబింబిస్తున్నాయి.

Read also: Nepal: నేపాల్ లో భూకంపం.. భారత్ చుట్టూ ప్రకంపనలు

#FieldMarshal #ImranKhan #ImranWarning #IndiaPakistan #pakistan Breaking News Today In Telugu Google News in Telugu India News Today in Telugu Latest News in Telugu Latest News today in Telugu News in Telugu Today Telugu News Today Today News In Telugu Today Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.