📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి

Air India: విమాన బాధితులకు సమగ్ర మద్దతునివ్వండి..టాటా సన్స్‌కు ఐఎంఏ విజ్ఞప్తి

Author Icon By Shobha Rani
Updated: June 14, 2025 • 1:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అహ్మదాబాద్‌(Ahmedabad) లో గురువారం జరిగిన ఘోర ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన, గాయపడిన వైద్య (Medical) విద్యార్థులకు, ఇతర బాధితులకు సమగ్రమైన సహాయ సహకారాలు అందించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) (IMA) శనివారం విజ్ఞప్తి చేసింది. ఎయిర్ ఇండియా మాతృ సంస్థ అయిన టాటా సన్స్ (Tata sons) ఈ విషయంలో తక్షణమే స్పందించాలని కోరింది. ఈ ప్రమాదం దేశవ్యాప్తంగా వైద్య వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
ప్రమాదానికి గురైన విమానం: ఎయిర్ ఇండియా AI-171
ఈనెల 19న అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ఏఐ171 (బోయింగ్ 787-8) టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉండగా, ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఈ దుర్ఘటనలో విమాన శకలాలు సమీపంలోని బీజే మెడికల్ కాలేజీ డైనింగ్ ఏరియాపై పడటంతో పెను విషాదం చోటుచేసుకుంది.

Air India: విమాన బాధితులకు సమగ్ర మద్దతునివ్వండి..టాటా సన్స్‌కు ఐఎంఏ విజ్ఞప్తి

వైద్య విద్యార్థుల దుర్మరణం – ఐఎంఏ ఆవేదన
ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వైద్యులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఐఎంఏ.. మరణించిన వైద్య విద్యార్థుల కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందించడంతో పాటు గాయపడిన వారికి దీర్ఘకాలిక మద్దతు ఇవ్వాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పింది. టాటా సన్స్(Tata sons) ఈ బాధ్యతను స్వీకరించాలని ఐఎంఏ కోరింది.
బాధితుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి
ఈ ఘోర ప్రమాదం మానవీయ, విద్యా, ఆరోగ్య అంశాలపై దీర్ఘకాలిక ప్రభావం చూపించే ప్రమాదం ఉంది.
టాటా గ్రూప్, ప్రభుత్వం, వైద్య సంస్థలు కలిసి బాధితుల పట్ల సహానుభూతి చూపిస్తూ, సహాయ చర్యలు పారదర్శకంగా తీసుకోవాలని, ఐఎంఏ, విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు ఏకస్వరం గా డిమాండ్ చేస్తున్నాయి.

Read Also: Shubhanshu Shukla: 19న అంతరిక్షంలోకి శుభాంశు శుక్లా

Breaking News in Telugu comprehensive support to the flight victims Google news Google News in Telugu IMA appeals to Tata Sons to provide Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.