📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Iran-USA War: 400 మిలియన్ బ్యారెళ్ల చమురు విడుదలకు IEA గ్రీన్ సిగ్నల్..

Author Icon By Vanipushpa
Updated: March 12, 2026 • 3:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా, ఇజ్రాయెల్- ఇరాన్ (Iran-USA,Israel War) 400 మిలియన్ బ్యారెళ్ల చమురు విడుదలకు IEA గ్రీన్ సిగ్నల్..మధ్య యుద్ధమంటలు ఇప్పట్లో చల్లారే పరిస్థితులు కనపడటం లేదు. ఈ యుధ్దం మూడు దేశాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా పెను ప్రకంపనలను రేపుతోంది. ముఖ్యంగా చమురు సంక్షోభం పతాక స్థాయికి చేరింది. ఇరాన్ హార్ముజ్ జలసంధి మూసివేయడంతో చమురు షిప్పులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు చమురు, LPG సంక్షోభాలు ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ ప్రపంచానికి ఓ కఠిన హెచ్చరిక జారీ చేసింది. హార్ముజ్ జలసంధి గుండా ఒక్క లీటరు చమురు కూడా వెళ్ళనివ్వబోమని బెదిరింపులకు దిగింది.

Read Also: Iran Suicide Boat Attack: అమెరికా ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన సూసైడ్ బోటు

IEA gives green signal for oil output of 400 million barrels

హార్ముజ్ జలసంధి మూసివేత వల్ల ప్రపంచ మార్కెట్లో ఏర్పడే సరఫరా కొరత

ఇక ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ప్రపంచ మార్కెట్‌లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 200 డాలర్లకు చేరవచ్చని కూడా హెచ్చరించింది. ఈ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా ఇంధన భద్రత(Fuel security)పై మరింత ఆందోళనను పెంచింది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) కీలక నిర్ణయం తీసుకుంది. IEAలో సభ్యత్వం ఉన్న 32 దేశాలు కలిసి అత్యవసర చర్యగా 400 మిలియన్ బ్యారెళ్ల చమురును విడుదల చేయడానికి ఏకగ్రీవంగా అంగీకరించాయి. హార్ముజ్ జలసంధి మూసివేత వల్ల ప్రపంచ మార్కెట్లో ఏర్పడే సరఫరా కొరతను తగ్గించడమే ఈ నిర్ణయానికి ప్రధాన ఉద్దేశ్యం. IEA ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫాతిహ్ బిరోల్ మాట్లాడుతూ.. ప్రస్తుతం చమురు మార్కెట్ ఎదుర్కొంటున్న పరిస్థితులు చాలా సవాలుతో కూడుకున్నవని చెప్పారు. ప్రపంచ మార్కెట్లు పరస్పరంగా అనుసంధానమై ఉన్నందున పెద్ద సంక్షోభాలకు కూడా ప్రపంచ స్థాయిలోనే సమిష్టి చర్య అవసరమని ఆయన పేర్కొన్నారు. సభ్య దేశాలు కలిసి అత్యవసర చర్యకు ముందుకు రావడం ఇంధన భద్రత పట్ల వారి ఐక్యతను సూచిస్తుందని ఆయన అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

400 Million Barrels Crude Oil Crude Oil Prices Drop March 2026 Energy Security Middle East Conflict Global Oil Crisis Relief IEA Strategic Oil Release 2026 International Energy Agency News SPR Release US and Allies Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.