అమెరికా, ఇజ్రాయెల్- ఇరాన్ (Iran-USA,Israel War) 400 మిలియన్ బ్యారెళ్ల చమురు విడుదలకు IEA గ్రీన్ సిగ్నల్..మధ్య యుద్ధమంటలు ఇప్పట్లో చల్లారే పరిస్థితులు కనపడటం లేదు. ఈ యుధ్దం మూడు దేశాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా పెను ప్రకంపనలను రేపుతోంది. ముఖ్యంగా చమురు సంక్షోభం పతాక స్థాయికి చేరింది. ఇరాన్ హార్ముజ్ జలసంధి మూసివేయడంతో చమురు షిప్పులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు చమురు, LPG సంక్షోభాలు ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ ప్రపంచానికి ఓ కఠిన హెచ్చరిక జారీ చేసింది. హార్ముజ్ జలసంధి గుండా ఒక్క లీటరు చమురు కూడా వెళ్ళనివ్వబోమని బెదిరింపులకు దిగింది.
Read Also: Iran Suicide Boat Attack: అమెరికా ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన సూసైడ్ బోటు

హార్ముజ్ జలసంధి మూసివేత వల్ల ప్రపంచ మార్కెట్లో ఏర్పడే సరఫరా కొరత
ఇక ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ప్రపంచ మార్కెట్‌లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 200 డాలర్లకు చేరవచ్చని కూడా హెచ్చరించింది. ఈ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా ఇంధన భద్రత(Fuel security)పై మరింత ఆందోళనను పెంచింది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) కీలక నిర్ణయం తీసుకుంది. IEAలో సభ్యత్వం ఉన్న 32 దేశాలు కలిసి అత్యవసర చర్యగా 400 మిలియన్ బ్యారెళ్ల చమురును విడుదల చేయడానికి ఏకగ్రీవంగా అంగీకరించాయి. హార్ముజ్ జలసంధి మూసివేత వల్ల ప్రపంచ మార్కెట్లో ఏర్పడే సరఫరా కొరతను తగ్గించడమే ఈ నిర్ణయానికి ప్రధాన ఉద్దేశ్యం. IEA ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫాతిహ్ బిరోల్ మాట్లాడుతూ.. ప్రస్తుతం చమురు మార్కెట్ ఎదుర్కొంటున్న పరిస్థితులు చాలా సవాలుతో కూడుకున్నవని చెప్పారు. ప్రపంచ మార్కెట్లు పరస్పరంగా అనుసంధానమై ఉన్నందున పెద్ద సంక్షోభాలకు కూడా ప్రపంచ స్థాయిలోనే సమిష్టి చర్య అవసరమని ఆయన పేర్కొన్నారు. సభ్య దేశాలు కలిసి అత్యవసర చర్యకు ముందుకు రావడం ఇంధన భద్రత పట్ల వారి ఐక్యతను సూచిస్తుందని ఆయన అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: