📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చైనాలో కొవిడ్‌ మాదిరి కొత్త వైరస్‌ గుర్తింపు !

Author Icon By sumalatha chinthakayala
Updated: February 21, 2025 • 8:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జంతువుల నుంచి మానవులకు సంక్రమించే ముప్పు

బీజీంగ్‌: చైనా లో కొవిడ్‌ మాదిరిగా ఉన్న కొత్త వైరస్‌ను పరిశోధకులు గుర్తించారు. జంతువుల నుంచి మానవులకు సంక్రమించే ముప్పు ఉన్నట్లు భావిస్తున్నారు. గబ్బిలాల్లో గుర్తించిన ఈ కొత్త వైరస్‌ను హెచ్‌కెయూ5- కోవ్‌-2 గా పేర్కొన్నారు. ఇది కొవిడ్‌ 19కి కారణమైన SARS-CoV-2ను పోలి ఉన్నట్లు పరిశోధనల్లో గుర్తించినట్లు హాంకాంగ్‌కు చెందిన ‘సౌత్‌చైనా మార్నింగ్‌ పోస్ట్‌’ పత్రిక తన కథనంలో పేర్కొంది. గబ్బిలాల్లో కరోనా వైరస్‌లపై విస్తృత పరిశోధనలు చేసి బ్యాట్ ఉమెన్‌ గా పేరొందిన ప్రఖ్యాత వైరాలజిస్టు షీ ఝెంగ్‌లీ ఈ పరిశోధనా బృందానికి సారథ్యం వహించారు.

సెల్‌ జర్నల్‌లో సమీక్షకు ఉంచినట్లు కథనం

ఇందులో గాంఘ్జౌ లేబోరేటరీ, గాంఘ్జౌ అకాడమీ ఆఫ్ సైన్సెస్, వుహాన్ విశ్వవిద్యాలయంతో పాటు వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి చెందిన శాస్త్రవేత్తలు భాగస్వాములుగా ఉన్నారు. ఈ పరిశోధనకు సంబంధించిన పరిశోధనా పత్రం సెల్‌ జర్నల్‌లో సమీక్షకు ఉంచినట్లు కథనంలో పేర్కొన్నారు. ఈ వైరస్‌ మెర్బెకోవైరస్‌తోపాటు ప్రాణాంతక మెర్స్‌-కోవ్‌ (మిడిల్‌ ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌) ఉప రకానికి చెందినదిగా పరిశోధకులు గుర్తించారు.

మాధ్యమజీవుల ద్వారా మనుషులకు

ఇది హెచ్‌కేయూ5 కరోనా వైరస్‌ సంతతికి చెందినదిగా పేర్కొన్నారు. ఈ వైరస్‌ను తొలుత హాంకాంగ్‌లోని జపనీస్‌ పిపిస్ట్రెల్‌ రకం గబ్బిలాల్లో గుర్తించారు. తాజా పరిశోధన ప్రకారం.. HKU5-CoV-2 నేరుగా లేదా మాధ్యమజీవుల ద్వారా మనుషులకు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్‌ సామర్థ్యం కొవిడ్‌-19తో పోలిస్తే తక్కువేనని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

Breaking News in Telugu china Covid-19 Google news Google News in Telugu Latest News in Telugu New Virus Telugu News online

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.