📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ

Latest News: ICC – వన్డే వరల్డ్ కప్‌లో..అందరూ మహిళలే : ఐసీసీ

Author Icon By Anusha
Updated: September 11, 2025 • 7:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మహిళా క్రికెట్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే క్రమంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవలే మహిళా, పురుషుల వరల్డ్‌కప్ విజేతలకు సమాన ప్రైజ్‌మనీ ఇవ్వాలని ప్రకటించిన ఐసీసీ, ఇప్పుడు మరో చారిత్రాత్మక అడుగును ముందుకు వేసింది. రాబోయే వన్డే వరల్డ్‌కప్‌ (OD World Cup)ను భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీలో రిఫరీలు, అంపైర్లు సహా అన్ని అధికారులుగా మహిళలనే నియమించనున్నట్లు ఐసీసీ ప్రకటించింది.

ఇప్పటి వరకు జరిగిన వన్డే ప్రపంచ కప్‌లలో పురుషాధికారులే ఎక్కువగా బాధ్యతలు చేపట్టారు. కానీ ఈ సారి పూర్తి స్థాయిలో మహిళలకు మాత్రమే అవకాశం ఇవ్వడం ప్రత్యేకం. మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలన్న సంకల్పంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకోవడం క్రికెట్ చరిత్రలో ఒక మలుపు అని చెప్పొచ్చు. ఐసీసీ చైర్మన్ జై షా (ICC Chairman Jay Shah)నేతృత్వంలో ఈ ప్రణాళిక ఆమోదం పొందింది.

మహిళల క్రికెట్ ప్రయాణంలో ఇది ఓ సంచన నిర్ణయం

ఇది చారిత్రాత్మక నిర్ణయమని ఐసీసీ ఛైర్మన్ జై షా ప్రశంసించాడు. ఈ నిర్ణయం మహిళల క్రికెట్‌ను మరింత ప్రోత్సహిస్తుందని, మరింత మంది మహిళలు ఈ ఆట‌ను కెరీర్‌గా ఎంచుకుంటారని చెప్పారు. ‘మహిళల క్రికెట్ ప్రయాణంలో ఇది ఓ సంచన నిర్ణయం. ఇది మహిళల క్రికెట్‌ మరింత అభివృద్ధి చెందేలా చేస్తుంది. పూర్తిగా మహిళా మ్యాచ్ (Women’s Match) అధికారుల ప్యానెల్‌ను ప్రకటించడం ఓ రికార్డ్ మాత్రమే కాదు. క్రికెట్‌లో లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడానికి ఐసీసీ చేస్తున్న కృషికి ప్రతిబింబం ఇది.’అని జై షా తెలిపారు.

ICC

టోర్నీలో పాల్గొనే 8 జట్లు బరిలోకి దిగుతుండగా

ఈ టోర్నీలో పాల్గొనే 8 జట్లు బరిలోకి దిగుతుండగా.. ఆతిథ్య దేశాలైన భారత్, శ్రీలంక మధ్య సెప్టెంబర్ 30న గౌహతి వేదిక (Guwahati venue) గా జరిగే తొలి మ్యాచ్‌తో ఈ టోర్నీకి తెరలేవనుంది.అంపైర్లు: లారెన్ ఏజెన్‌బాగ్, కాండస్ లా బోర్డే, కిమ్ కాటన్, సారా దంబనేవానా, షాతిరా జాకిర్ జెసీ, కెర్రిన్ క్లాస్టే, జననీ ఎన్, నిమలి పెరీరా, క్లైర్ పోలోసాక్, వ్రిందా రాఠీ, స్యూ రెడ్‌ఫెర్న్, ఎలోయిస్ షెరిడాన్, గాయత్రి వేణుగోపాలన్, జాక్వెలిన్ విలియమ్స్, మ్యాచ్ రిఫరీలు: ట్రూడీ ఆండర్సన్, షాండ్రే ఫ్రిట్జ్, జి.ఎస్. లక్ష్మి, మిచెల్ పెరీరా

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/abhishek-sharma-abhishek-sharma-creates-history-in-t20-cricket/international/545534/

Breaking News icc equality in cricket icc women officials decision icc world cup india sri lanka latest news Telugu News womens cricket historic move womens empowerment in cricket

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.