📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం

ICC: ఎనిమిది బోర్డులకు డెవలప్‌మెంట్ అవార్డ్స్‌ ప్రకటించిన ఐసీసీ

Author Icon By Anusha
Updated: July 20, 2025 • 5:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇటీవల కాలంలో అంతర్జాతీయ క్రికెట్‌లో చిన్న జట్లు పెద్ద మార్పును తీసుకువస్తున్నాయి. భారీ జట్లను ఓడిస్తూ తమ ప్రతిభతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. ముఖ్యంగా టెస్ట్ ప్లేయింగ్ జట్లతో పోటీపడుతూ, సమాన స్థాయిలో పోటీ చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, క్రికెట్‌ను గ్లోబల్ లెవెల్‌కి తీసుకెళ్లే లక్ష్యంతో చిన్న బోర్డుల విజయాన్ని గుర్తించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్రత్యేకంగా డెవలప్‌మెంట్ అవార్డ్స్-2024ను ప్రకటించింది.ఈ అవార్డ్స్‌కి మొత్తం ఎనిమిది దేశాల క్రికెట్ బోర్డులను ఎంపిక చేసింది. వాటిలో నేపాల్ (Nepal), భుటాన్ (Bhutan), యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (USA) వంటి బోర్డులు ఉన్నాయ్. వీటితో పాటు ఇండోనేషియా (Indonesia), నమీబియా (Namibia), స్కాట్లాండ్ (Scotland), టాంజానియా (Tanzania), వనౌటు (Vanuatu) క్రికెట్ బోర్డులు కూడా అవార్డులందుకున్నాయి.సింగపూర్‌లో ఆదివారం ఐసీసీ ఛీఫ్ జై షా (Jai Shah) ఇతర సభ్యులతో కలిసి ఈ బోర్డులకు అవార్డ్స్ అందజేశారు.

సంచలనాలు సృష్టిస్తున్నాయి

ప్రపంచ క్రికెట్‌లోఒకప్పుడు ఎనిమిది జట్ల పేర్లే ప్రముఖంగా వినిపించేవి. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, న్యూజిలాండ్, శ్రీలంకలు మాత్రమే అభిమానులను అలరించేవి. కానీ, ఇప్పుడు దాదాపు ప్రతిదేశం క్రికెట్ జట్టును ఏర్పాటు చేసుకుంది. ఐసీసీ ప్రోద్బలం కూడా తోడవ్వడంతో అమెరికా, నేపాల్, స్కాట్లాండ్, నమీబియా వంటి చిన్న జట్ల సంచలనాలు సృష్టిస్తున్నాయి. తమ ప్రాంతంలో క్రికెట్ పురోగతికి కృషి చేస్తున్న ఈ దేశాల బోర్డులను ఐసీసీ డెవలప్‌మెంట్ అవార్డ్స్‌ (ICC Development Awards) తో సత్కరించింది. మొత్తం 15 జట్లు షార్ట్ లిస్ట్ కాగా, ఎనిమిది బోర్డులను ఎంపిక చేశారు.నిరుడు స్వదేశంలో జరిగిన టీ 20 వరల్డ్ కప్‌లో సంచలన ప్రదర్శనతో సూపర్ – 8కు దూసుకెళ్లింది అమెరికాజట్టు.

సత్కారం

దాంతో, ‘ఐసీసీ అసోసియేట్ మెంబర్ మెన్స్‌ టీమ్ పెర్ఫార్మెన్స్’ అవార్డును అమెరికా బోర్డుకు అందించింది ఐసీసీ. క్రికెట్ నమీబియాను ‘ఐసీసీ డెవలప్‌మెంట్ ఇనిషియేటివ్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు వరించింది.క్రికెట్ చరిత్రలో తొలిసారిగా ‘ఉమెన్ క్రికెట్ ఇనిషియేటివ్’ అవార్డుకు భూటాన్ క్రికెట్ మండలి, వనౌటు క్రికెట్ సంఘం (Cricket Association) ఎంపికయ్యాయి. నేపాల్ క్రికెట్‌కు సంఘానికి ‘ఐసీసీ డిజిటల్ ఫ్యాన్ ఎంగేజ్‌మెంట్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకుంది.ఐసీసీ చేసిన ఈ సత్కారం ద్వారా చిన్న దేశాల క్రికెట్ బోర్డులకు మరింత ఉత్సాహం లభిస్తుందని, క్రికెట్ అభివృద్ధికి ఇది మైలురాయిగా నిలుస్తుందన్నది నిపుణుల అభిప్రాయం.

ICC కంటే BCCI ధనవంతమైనదేనా?

అవును, బీసీసీఐ (BCCI) అనేది ఐసీసీ (ICC) కంటే చాలా ఎక్కువ ధనవంతమైన క్రికెట్ బోర్డు. ఐసీసీ అనేది అంతర్జాతీయ క్రికెట్ పరిపాలన సంస్థ కాగా, బీసీసీఐ భారతదేశ క్రికెట్‌ను పర్యవేక్షించే సంస్థ.

ICC అనేది ప్రైవేట్ సంస్థా లేక ప్రభుత్వ సంస్థా?

ఇది ఒక ప్రైవేట్, ప్రభుత్వేతర సంస్థ (Non-Governmental Organization – NGO). ప్రపంచ వ్యాప్తంగా వ్యాపార సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Sports: డ్రింక్స్ బ్రేక్‌లో క్రికెటర్లు ఏం తాగుతారో మీకు తెలుసా!

bhutan cricket recognition Breaking News icc development awards 2024 telugu icc honours small teams jai shah icc awards 2024 latest news nepal cricket team news Telugu News usa cricket award

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.