ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం ఐబిఎమ్ (IBM) మళ్లీ భారీ సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టింది. కంపెనీ తాజా ప్రకటన ప్రకారం, ఈ త్రైమాసికంలో వేలాది ఉద్యోగులు ప్రభావితమయ్యేలా ఉద్యోగాల్లో కోతలు అమలు చేయనుంది. ఈ నిర్ణయం సంస్థ వ్యూహాత్మక దిశలో భాగమని, అధిక లాభదాయక సాఫ్ట్‌వేర్ విభాగాలపై దృష్టి కేంద్రీకరించడమే లక్ష్యమని ఐబిఎమ్ స్పష్టం చేసింది.
ఐబిఎమ్ తన ప్రకటనలో, “మా వ్యాపార అవసరాలను దృష్టిలో ఉంచుకుని శ్రామిక శక్తిని క్రమం తప్పకుండా సమీక్షిస్తాము. ఈ త్రైమాసికంలో మా గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో తక్కువ సింగిల్-డిజిట్ శాతం ఉద్యోగులను ప్రభావితం చేసే చర్యలు తీసుకుంటున్నాము” అని పేర్కొంది.
ప్రస్తుతం ఐబిఎమ్‌లో సుమారు 2.7 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.
Read Also: Weather Update: తెలంగాణ, ఏపీలో వర్షాల హెచ్చరిక
ఈ ప్రకటన ప్రకారం సుమారు 2 నుండి 3 శాతం వరకు, అంటే వేల మంది ఉద్యోగులు ఈ కోతల ప్రభావానికి లోనవుతారని అంచనా. సీఈఓ అరవింద్ కృష్ణ నేతృత్వంలో కంపెనీ గత కొన్నేళ్లుగా (AI) (కృత్రిమ మేధస్సు) మరియు క్లౌడ్ ఆధారిత సాఫ్ట్‌వేర్ సేవలపై ఎక్కువగా దృష్టి పెట్టింది. 2019లో కొనుగోలు చేసిన Red Hat విభాగం ద్వారా ఐబిఎమ్ క్లౌడ్ మార్కెట్లో తన స్థావరాన్ని మరింత బలపరిచింది.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా AI టెక్నాలజీకి పెరుగుతున్న డిమాండ్‌ను ఐబిఎమ్ ఒక వృద్ధి అవకాశంగా ఉపయోగించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇటీవల విడుదలైన త్రైమాసిక ఫలితాలు పెట్టుబడిదారులను కొంత నిరాశకు గురి చేశాయి. ముఖ్యంగా క్లౌడ్ సాఫ్ట్‌వేర్ విభాగంలో వృద్ధి మందగించడం మరియు AI డిమాండ్ నుంచి ఆశించిన లాభాలు రాకపోవడం మార్కెట్లో సందేహాలు రేకెత్తించాయి.
దీని ప్రభావంగా, ఈ ఏడాది 35% పెరిగిన ఐబిఎమ్ షేర్లు మంగళవారం సుమారు 2% వరకు పడిపోయాయి.
ఐబిఎమ్(IBM) నిర్ణయం ప్రస్తుతం టెక్ రంగంలో జరుగుతున్న విస్తృత మార్పులను ప్రతిబింబిస్తోంది. పెద్ద టెక్ కంపెనీలు ఇప్పుడు ఆటోమేషన్, AI, సాఫ్ట్‌వేర్ ఆధారిత ఆదాయ నమూనాల వైపు వేగంగా దృష్టి మళ్లిస్తున్నాయి.
AI, క్లౌడ్ సర్వీసులపై పెరుగుతున్న డిమాండ్ ఉన్నప్పటికీ, ఈ మార్పులు తాత్కాలికంగా ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. అయినప్పటికీ, ఐబిఎమ్ దీన్ని భవిష్యత్ సాంకేతిక దిశలో ముందడుగుగా చూస్తోంది
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: