📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Donald Trump : ఫ్రీగా ఇస్తానంటే వద్దంటానా : డొనాల్డ్‌ ట్రంప్‌

Author Icon By Sudha
Updated: May 13, 2025 • 3:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కోట్ల రూపాయల ఖరీదు చేసే విమానాన్ని ఉచితంగా ఇస్తానంటే వద్దని చెప్పడం మూర్ఖత్వం అవుతుందని అమెరికా అధ్యక్షుడు (USA President) డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) వ్యాఖ్యానించారు. ఖతార్‌ పాలకులు డొనాల్డ్‌ ట్రంప్‌కు విలాసవంతమైన విమానాన్ని బహుమతిగా ప్రకటించారు.

Donald Trump : ఫ్రీగా ఇస్తానంటే వద్దంటానా : డొనాల్డ్‌ ట్రంప్‌

కోట్ల రూపాయల ఖరీదు చేసే విమానాన్ని ఉచితంగా ఇస్తానంటే వద్దని చెప్పడం మూర్ఖత్వం అవుతుందని అమెరికా అధ్యక్షుడు (USA President) డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) వ్యాఖ్యానించారు. ఖతార్‌ (Qatar)పాలకులు డొనాల్డ్‌ ట్రంప్‌కు విలాసవంతమైన విమానాన్ని బహుమతిగా ప్రకటించారు. ఆ బహుమతిని స్వీకరించేందుకు ట్రంప్‌ తన సమ్మతి తెలిపారు. దీనిపై ప్రతిపక్ష డెమోక్రాట్‌లు విమర్శలు చేస్తున్నారు. జాతీయ భద్రతకు ప్రమాదకరం కావచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో విమనాన్ని గిఫ్ట్‌ అందుకోనుండటంపై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి బహుమతిని వద్దని చెప్పడం ముర్ఖత్వమే అవుతుందన్నారు. సోమవారం వైట్‌హౌస్‌ వద్ద గిఫ్టుకు సంబంధించి విలేకరులు అడిగిన ప్రశ్నలకు ట్రంప్‌ సమాధానాలు ఇచ్చారు. ఖరీదైన విమానాన్ని గిఫ్టుగా అందుకోవడం అనేది గొప్ప విషయంగా అభివర్ణించారు. ‘వారు ఫ్రీగా జెట్‌ విమానం ఇస్తుంటే లేదు లేదు. నాకు ఫ్రీగా వద్దు. మీకు 1 బిలియన్‌ డాలర్లు లేదా 400 మిలియన్‌ డాలర్లు ఖరీదు కట్టిస్తా అని చెప్పాలా..? అని ప్రశ్నించారు.
గొప్ప విషయం
ఈ ఖరీదైన గిఫ్ట్‌ ద్వారా ఖతార్‌ రాయల్‌ ఫ్యామిలీ ఏమైనా లబ్ధి పొందనుందా..? భద్రతాపరమైన సమస్యలు తలెత్తవా..? అనే ప్రశ్నలకు ట్రంప్‌ అలాంటివేం జరగవని జవాబిచ్చారు. తాను ఇలాంటి ఆఫర్‌ను ఎప్పటికీ తిరస్కరించనని, ఉచితంగా ఖరీదైన విమానాన్ని ఇస్తున్నప్పుడు వద్దనడానికి తానేమైనా తెలివితక్కువ వాడినా..?’ అని ప్రశ్నించారు. ‘అధ్యక్ష కాలం ముగిసిన తర్వాత ఈ విమానాన్ని వ్యక్తిగతంగా వాడుకుంటారా..?’ అన్న ఒక విలేకరి ప్రశ్నతో ట్రంప్‌ ఆగ్రహించారు. విమానాన్ని అధ్యక్ష లైబ్రరీకి ప్రదర్శన కోసం విరాళంగా ఇస్తానని చెప్పారు.
కాగా డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ వారంలో మధ్యప్రాచ్యంలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో ఖతార్‌ పాలక కుటుంబం విలాసవంతమైన 747-8 జంబో జెట్‌ విమానాన్ని బహుమతిగా ప్రకటించింది. ఆ బహుమతిని స్వీకరించేందుకు ట్రంప్‌ అంగీకారం తెలిపారు. అధికారులు ఆ విమానానికి అధ్యక్ష విమానం ‘ఎయిర్‌ఫోర్స్‌ వన్‌’కు తగ్గట్టుగా కొన్ని హంగులు సమకూర్చనున్నారు. ట్రంప్ పదవీ విరమణ చేసేవరకు ఆ విమానాన్ని ‘ఎయిర్‌ఫోర్స్‌ వన్‌’ కు కొత్త వెర్షన్‌గా వాడుకునేలా ప్రణాళికలు చేస్తున్నారు.
అయితే దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్‌ ఈ ఖరీదైన బహుమతిని స్వీకరించడంతోపాటు దాన్ని ఎయిర్‌ఫోర్స్‌ వన్‌గా వినియోగించాలనుకోవడం జాతీయ భద్రతాపరమైన ప్రశ్నలను లేవనెత్తుతుందని పలువురు డెమోక్రాట్‌లు విమర్శిస్తున్నారు.

Read Also : USA: అమెరికా వస్తువులపై భారత్‌ సుంకాల ప్రతీకారం

#telugu News away for free Breaking News in Telugu Donald Trump Google news Google News in Telugu I wouldn't give it Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.