భారత్ – పాకిస్తాన్ మధ్య యుద్ధ (IND-PAK War) పరిస్థితిని తానే నివారించానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అణ్వాయుధాలు కలిగిన దేశాల మధ్య యుద్ధం జరిగితే అది భయంకర పరిణామాలకు దారి తీస్తుందని హెచ్చరించినట్టు చెప్పారు. ఇరు దేశాల నాయకులతో తాను మాట్లాడి వారిని శాంతికి ప్రేరేపించానని, వారి స్పందనకు ధన్యవాదాలు తెలుపుతూ వ్యాఖ్యానించారు.
దాడులు, అణ్వాయుధాలు ఉన్న దేశాలతో వ్యాపారం వద్దన్న ట్రంప్
అణ్వాయుధ శక్తి కలిగిన దేశాలు తమ విభేదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ట్రంప్ పేర్కొన్నారు. “యుద్ధం చేస్తూ, అణ్వాయుధాలతో బెదిరించే దేశాలతో అమెరికా వ్యాపారం చేయదని నేను స్పష్టం చేశాను,” అని ఆయన వ్యాఖ్యానించారు. తన ప్రమేయంతోనే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత తగ్గిందని చెబుతూ మరోసారి తన పాత్రను వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు.
మోదీ, జైశంకర్ ప్రకటనలు – ట్రంప్ వ్యాఖ్యలపై ప్రశ్నార్థకం
ఇదిలా ఉంటే, భారత్ తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ గతంలో పలు సందర్భాల్లో స్పష్టం చేశారు – కాల్పుల విరమణ పాక్ అభ్యర్థన మేరకే జరిగిందని, మూడో దేశం ఇందులో ప్రమేయం లేదని. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వాస్తవానికి విరుద్ధంగా ఉండటం గమనార్హం. రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
Read Also : water bill scam : నల్లా బిల్లు కట్టకపోతే కనెక్షన్ కట్ : జలమండలి పేరుతో ఫేక్ మెసేజ్‌లు