భారత ప్రధాని నరేంద్ర మోదీ (Modi) భువనేశ్వర్ పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం (BJP) ఏర్పడి ఏడాది పూర్తైన సందర్భంగా జరిగిన సభలో మాట్లాడిన మోదీ, “రెండు రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నాకు కాల్ చేశారు. అమెరికాకు రావాలని ఆహ్వానించారు. కానీ నేను ఆ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించాను. ఎందుకంటే నాకు జగన్నాథుడి పుణ్యభూమికి రావాల్సిన బాధ్యత ఉంది” అని చెప్పారు.
రాష్ట్ర అభివృద్ధికి రూ.18,600 కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం
ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఒడిశా అభివృద్ధి కోసం రూ.18,600 కోట్ల విలువైన 105 ప్రాజెక్టులను ప్రారంభించారు. రవాణా, విద్యుత్, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల రంగాలలో ఈ ప్రాజెక్టులు రాష్ట్రానికి ఊపిరిలేకుండా అభివృద్ధి చేకూరుస్తాయని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు ఒడిశాకు తీసుకొచ్చేందుకు కేంద్రం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.
జగన్నాథుని భక్తిగా ప్రధాని మాటలు
పూరీ జగన్నాథుని పట్ల తన భక్తిని మరోసారి స్పష్టంగా చాటిన ప్రధాని మోదీ, “ఇక్కడి పుణ్యభూమిలో నన్ను చూసే ప్రతి వ్యక్తి ఆశీర్వాదం నాకు కావాలి. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను,” అన్నారు. దేశం ప్రయాణిస్తున్న అభివృద్ధి మార్గంలో ఒడిశా కూడా భాగస్వామిగా మారాలని, ఇందుకోసం బీజేపీ ప్రభుత్వం నిబద్ధతతో పని చేస్తుందని తెలిపారు. ప్రధాని సందేశం రాష్ట్ర ప్రజల్లో విశేష స్పందన తెచ్చుకుంది.
Read Also : cosmetic surgery : టర్కీలో కాస్మెటిక్ సర్జరీ వికటించి మొజాంబిక్ గాయని, మృతి