📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Supersonic: కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?

Author Icon By Vanipushpa
Updated: January 29, 2026 • 4:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రైలు ప్రయాణంలో ప్రపంచం ఇప్పటివరకు చూడని ఒక మహా విప్లవానికి చైనా నాంది పలుకుతోంది. ఇప్పటికే గంటకు 501 కి.మీ. వేగంతో వెళ్లే మాగ్లెవ్ రైళ్లతో రికార్డులు సృష్టిస్తున్న చైనా ఇప్పుడు ఏకంగా శబ్ద వేగాన్ని ఛేదించే సూపర్‌సోనిక్ (Supersonic) రైలును సిద్ధం చేస్తోంది. ఈ రైలు పట్టాలెక్కితే కేవలం 30 నిమిషాల్లోనే 700 కిలోమీటర్లకు పైగా దూరాన్ని అధిగమించవచ్చు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం.. చైనాకు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ శాస్త్రవేత్తలు ఈ ప్రాజెక్టుపై పనిచేస్తున్నారు. విద్యుదయస్కాంత స్లెడ్జ్ అని పిలిచే ఈ వ్యవస్థ, విద్యుదయస్కాంత శక్తిని ఉపయోగించి వాహనాన్ని గాలిలో నెడుతుంది. 2023లో జరిగిన ప్రయోగాల్లో ఒక టన్ను బరువున్న వాహనాన్ని మాక్ 1 వేగంతో పంపించి శాస్త్రవేత్తలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు.

Read Also: Budget 2026: సీనియర్ సిటిజన్లకు రైల్వే టిక్కెట్ల రాయితీలపై కసరత్తు

Super Fast: కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్

సాంకేతిక సవాళ్లు – వినూత్న పరిష్కారాలు

అంత వేగంతో ప్రయాణించేటప్పుడు ఎదురయ్యే అతిపెద్ద సమస్య షాక్ వేవ్స్. దీనివల్ల రైలు నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఈ సమస్యను అధిగమించడానికి శాస్త్రవేత్తలు ఒక వినూత్న మార్గాన్ని కనిపెట్టారు. సాధారణ సెన్సార్లు సూపర్‌సోనిక్ వేగం వద్ద విఫలమవుతుండటంతో విద్యుత్ సరఫరాలో వచ్చే మార్పులను వినడం ద్వారా వేగాన్ని అంచనా వేసేలా వ్యవస్థను రూపొందించారు. శబ్దం, వక్రీకరణలను రద్దు చేసి 98.9శాతం ఖచ్చితత్వంతో వేగాన్ని ట్రాక్ చేసే అల్గోరిథంను జు ఫీ బృందం అభివృద్ధి చేశారు. ఈ సూపర్‌సోనిక్ వేగాన్ని మన దేశ పరిస్థితులతో పోల్చి చూస్తే ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తాయి. ప్రస్తుతం కాశీ నుంచి మధుర పుణ్యక్షేత్రాల మధ్య 713 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించాలంటే రైలులో కనీసం 11 గంటల సమయం పడుతుంది. అదేవిధంగా హైదరాబాద్ నుంచి విశాఖ పట్టనానికి కేవలం 28 నిమిషాల్లోనే చేరుకోచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

bullet train concept futuristic travel project high speed transport India Hyderabad to Vizag travel Hyperloop India rapid transportation Smart Mobility Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.