Hyderabad Telugu Associations : అమెరికాలోని ప్రముఖ జాతీయ తెలుగు సంఘాల నాయకులంతా హైదరాబాద్‌లో ఒకచోట కలుసుకుని స్నేహపూర్వకంగా ముచ్చటించిన అరుదైన సందర్భం ఇది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA), అమెరికా తెలుగు సంఘం (ATA), తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (TTA)కి చెందిన ముఖ్య నాయకులు ఈ విందు సమావేశంలో పాల్గొన్నారు. అమెరికాలో జరిగే మహాసభలు, జాతీయ కార్యక్రమాల్లో పరస్పరం కలుసుకునే వీరంతా, హైదరాబాద్‌లో మాత్రం ఇలా ఒకేచోట సమావేశమవడం ఇదే తొలిసారి అని తెలిపారు.
ఫిలడెల్ఫియా నుంచి వచ్చిన జగదీశ్ రెడ్డి అనుమల, రవి పొట్లూరి హైదరాబాద్‌లో ప్రత్యేకంగా డిన్నర్ సమావేశాన్ని ఏర్పాటు చేసి వివిధ తెలుగు సంఘాల నాయకులు, ఇక్కడ నివసిస్తున్న ఎన్నారైలను ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి తానా నుంచి రవి పొట్లూరి, జయ్ తాళ్లూరి, ప్రకాశ్ బత్తినేని, రఘు మేక హాజరయ్యారు. ఆటా తరఫున అధ్యక్షుడు జయంత్ చల్లా, పరమేష్ భీంరెడ్డి, రాజు కక్కెర్ల, తిరుమల రెడ్డి, వేణుగోనతిరెడ్డి పాల్గొన్నారు. టిటిఎ నుంచి అధ్యక్షుడు నవీన్ మలిపెద్ది, విశ్వకంది, ఎల్.ఎన్. దొంతిరెడ్డి, చంద్రారెడ్డి పోలీస్ హాజరయ్యారు.
Read also: Gig Economy: బ్లింకిట్ డెలివరీ ఏజెంట్ సంపాదనపై వైరల్ చర్చ
అలాగే చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్, బిగ్ టీవీ చైర్మన్ విజయ్ వెన్నం, తెలుగు టైమ్స్ ఎడిటర్ చెన్నూరి సుబ్బారావు, ఎన్నారైలు రాహుల్ కుందవరం, (Hyderabad Telugu Associations) బాలాజీ వీర్నాల, రవితేజ ముత్తు, ముప్పా రాజశేఖర్ తదితరులు ఈ సమావేశాన్ని మరింత ప్రత్యేకంగా మార్చారు.
ఈ సందర్భంగా రవి పొట్లూరి మాట్లాడుతూ, అమెరికాలో నివసించే మనమంతా హైదరాబాద్‌లో ఇలా కలుసుకుని మాట్లాడుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. సంఘాలుగా వేరుగా ఉన్నప్పటికీ, మాతృరాష్ట్రం అభివృద్ధి విషయంలో అందరి ఆలోచనలు ఒక్కటేనని పేర్కొన్నారు.
ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా మాట్లాడుతూ, ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఆటా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈ సమయంలో తానా, టిటిఎ నాయకులతో కలిసి చర్చించటం సంతోషంగా ఉందన్నారు. అందరం కలిసి పనిచేయాలన్న భావన ఎప్పటికీ తనలో ఉందని చెప్పారు.
టిటిఎ అధ్యక్షుడు నవీన్ మలిపెద్ది మాట్లాడుతూ, టీటిఎ సేవా కార్యక్రమాల ద్వారా తెలంగాణలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని, ఇతర సంఘాల నాయకులతో ఆలోచనలు పంచుకునే అవకాశం లభించడం సంతోషంగా ఉందన్నారు.
తెలుగు టైమ్స్ ఎడిటర్ చెన్నూరి సుబ్బారావు మాట్లాడుతూ, ఇలాంటి వేదికను ఏర్పాటు చేసి అందరినీ ఒకచోట చేర్చిన రవి పొట్లూరి, జగదీశ్ రెడ్డి అనుమలకు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌లో మూడు పెద్ద తెలుగు సంఘాల ఎన్నారై నాయకులు ఒక విందు సమావేశంలో కలవడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also: