📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Viral news: భార్యకు బట్టతల వచ్చిందని విడాకులు ఇచ్చిన భర్త

Author Icon By Vanipushpa
Updated: January 26, 2026 • 12:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పెళ్లి అంటే నూరేళ్ల పంట అంటారు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఇద్దరూ కలిసే ఉండాలని మన పెద్దలు చెబుతుంటారు. అంతేనా పెళ్లి రోజు ఇందుకు సంబంధించిన ప్రమాణాలు కూడా చేయిస్తుంటారు. కానీ ఆ ప్రమాణాలు మరిచిన ఓ భర్త.. భార్యకు అనారోగ్యం రాగానే ముఖం చాటేశాడు. చైనా(China)లోని హెనాన్ ప్రావిన్స్‌కు చెందిన 36 ఏళ్ల లీ అనే మహిళకు ఎదురైన ఈ చేదు అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్ల ఆగ్రహానికి కారణం అవుతోంది. చర్మ వ్యాధి కారణంగా ఆమె జుట్టు రాలిపోయి, బట్టతల రావడంతో.. ఆమె భర్త ఆమెకు విడాకులు ఇచ్చి ఇంటి నుంచి పంపేశాడు.

Read Also: US snowstorm : అమెరికాలో మంచు విలయం! 16 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ?

Viral news: భార్యకు బట్టతల వచ్చిందని విడాకులు ఇచ్చిన భర్త

విటిలిగో అనే దీర్ఘకాలిక చర్మ వ్యాధి

కుటుంబమే లోకంగా బ్రతికినా తప్పని అవమానం
లీ గత 16 ఏళ్లుగా తన భర్త, పిల్లల కోసం అహర్నిశలు శ్రమించింది. ఇంటి పనులు, వంట, పిల్లల పెంపకం.. ఇలా ప్రతి విషయంలోనూ బాధ్యతగా ఉంటూ కుటుంబాన్ని కాపాడుకుంది. అయితే రెండేళ్ల క్రితం ఆమె జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. ఆమె జుట్టు ఒక్కసారిగా తెల్లబడటం ప్రారంభమై.. క్రమంగా ఊడిపోతూ బట్టతల వచ్చేలా చేసింది. పరీక్షించిన వైద్యులు ఆమెకు విటిలిగో అనే దీర్ఘకాలిక చర్మ వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు.

భర్త నుంచి ఎలాంటి మద్దతు లభించలేదు

లీ పరిస్థితిని చూసి జాలిపడాల్సింది పోయి.. ఆమె భర్త ఆమెను అసహ్యించుకోవడం మొదలు పెట్టాడు. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి గానీ, కనీసం ఆమె ఆరోగ్యం గురించి అడగడానికి గానీ అతను ఇష్టపడలేదు. పైగా ఆమె వల్ల తన ప్రతిష్ట దెబ్బతింటుందని భావించి చుట్టాల శుభకార్యాలకు కూడా ఆమెను తీసుకువెళ్లడం మానేశాడు. చివరకు ఆమె భర్త విడాకుల ప్రతిపాదన పెట్టగా.. చేసేదేమీ లేక లీ అంగీకరించింది. 16 ఏళ్ల సంసారం అర్థాంతరంగా ముగియడమే కాకుండా కోర్టు బిడ్డ కస్టడీని కూడా భర్తకే అప్పగించింది. ఈ ఘటనపై నెటిజన్లు స్పందిస్తూ.. “అందం తాత్కాలికం, కానీ భార్యపై చూపాల్సిన ప్రేమ శాశ్వతం.. ఆమె భర్త చేసిన పని క్షమించరానిది” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Divorce case domestic issues hair loss issue marital dispute relationship breakdown shocking divorce reason social injustice Telugu News online Telugu News Today Women Rights

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.