📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Badar Khan Suri: అమెరికా న్యాయ‌స్థానంలో భార‌త విద్యార్థికి భారీ ఊర‌ట‌

Author Icon By Sudha
Updated: May 15, 2025 • 2:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హమాస్ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నార‌న్న ఆరోపణ‌ల‌పై అమెరికాలో అరెస్ట‌యిన‌ భార‌త విద్యార్థి బ‌ద‌ర్ ఖాన్ సురికి (Badar Khan Suri) అక్క‌డి న్యాయ‌స్థానం (court of law) లో భారీ ఊర‌ట ల‌భించింది. నిర్బంధంలో ఉన్న సురిని వెంట‌నే విడుద‌ల చేయాల‌ని న్యాయ‌స్థానం ఆదేశించింది. అత‌డిని టెక్సాస్ నుంచి వ‌ర్జీనియాకు వెళ్లేందుకు అనుమ‌తించాల‌ని డిస్ట్రిక్ట్ జ‌డ్జి త‌న ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు.

Badar Khan Suri: అమెరికా న్యాయ‌స్థానంలో భార‌త విద్యార్థికి భారీ ఊర‌ట‌

వాషింగ్టన్‌ డీసీలోని జార్జ్‌టౌన్‌ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టోరల్‌ విద్యార్థిగా ఉన్న బదర్‌ ఖాన్‌ సురి హమాస్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నాడని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) ఆరోపించింది. అతడికి హమాస్‌లోని పలువురితో సంబంధాలు ఉన్నట్లు పేర్కొంది. దీంతో అతడి వీసాను రద్దు చేసి, వర్జీనియాలోని నివాసం నుంచి అదుపులోకి తీసుకున్నారు.
రాజకీయకుట్ర
దీంతో తన అరెస్టును సవాల్‌ చేస్తూ సురి కోర్టును ఆశ్రయించాడు. ఇది పూర్తిగా రాజకీయకుట్ర అని తన పిటిషన్‌లో ఆరోపించాడు. విచారణ జరిపిన ఈస్ట్రన్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ వర్జీనియా కోర్టు అతడికి తాత్కాలిక ఉపశమనం కల్పించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు అత‌డిని అమెరికా నుంచి బహిష్కరించకూడదని స్పష్టం చేసింది.ప్రస్తుతం సురిని లూసియానాలోని ఇమిగ్రేషన్‌ డిటెన్షన్‌ సెంటర్‌లో ఉంచినట్లు అమెరికన్‌ సివిల్‌ లిబర్టీస్‌ యూనియన్ వెల్లడించింది. ఇప్పుడు అక్క‌డి నుంచి వెంట‌నే అత‌డిని విడుద‌ల చేయాల‌ని అధికారుల‌ను కోర్టు ఆదేశించింది.

Read Also : TikTok Star: లైవ్‌లోనే టిక్ టాక్ స్టార్ దారుణ హత్య

Breaking News in Telugu Google news Google News in Telugu Huge relief for in US court Indian student Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.