Latest News: Explosion: అమెరికాలో భారీ పేలుడు

Read Time:  1 min
Explosion
Explosion
FONT SIZE
GET APP

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి భయానక ఘటన చోటుచేసుకుంది. టెనస్సీ రాష్ట్రం (State of Tennessee) లోని ఒక పేలుడు పదార్థాల తయారీ కర్మాగారంలో జరిగిన భారీ పేలుడు (Explosion) స్థానికంగా తీవ్ర ఆందోళనకు కారణమైంది. ఈ విస్ఫోటనం అంత శక్తివంతంగా ఉండటంతో ఫ్యాక్టరీ పరిసర ప్రాంతం మొత్తం కుదేలైపోయింది. భవనాలు ధ్వంసమయ్యాయి.ఈ ప్రమాదంలో 19 మంది మరణించి ఉండవచ్చని అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Maria Corina Machado: ట్రంప్ పై ప్రశంసల వర్షం కురిపించిన మరియా కొరీనా

అమెరికా టెనస్సీ రాష్ట్రం (State of Tennessee) లోని నాష్‌విల్లే సమీపంలో ఉన్న ఈ కర్మాగారం రక్షణ, అంతరిక్ష, వాణిజ్య రంగాల కోసం కీలకమైన పేలుడు పదార్థాలను ఉత్పత్తి చేస్తుంది. హంఫ్రీస్ కౌంటీ షెరీఫ్ క్రిస్ డేవిస్ (Humphreys County Sheriff Chris Davis) ఈ ఘటనపై మాట్లాడుతూ, ఇది అత్యంత వినాశకరమైన పేలుడు అని అభివర్ణించారు.

Explosion
Explosion

కార్మికుల ఆచూకీ తెలియడం లేదు

“ప్రమాదం జరిగిన తర్వాత చాలా మంది కార్మికుల ఆచూకీ తెలియడం లేదు. ప్రస్తుతం కొంతమంది మాత్రమే సురక్షితంగా ఉన్నట్లు సమాచారం ఉంది. మిగిలిన వారంతా మరణించి ఉండే అవకాశం ఉంది” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఈ పేలుడు తీవ్రత ఎంతగా ఉందంటే, ఫ్యాక్టరీ (Factory) కి సమీపంలోని ఇళ్లు సైతం తీవ్రంగా కంపించాయి.

దీంతో ఏం జరిగిందో తెలియక స్థానిక ప్రజలు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. పేలుడు (Explosion) ధాటికి భవనం పూర్తిగా శిథిలాల కుప్పగా మారింది. ప్రమాద తీవ్రత కారణంగా సహాయక చర్యలకు కూడా తీవ్ర ఆటంకం ఏర్పడింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి సకాలంలో చేరుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ దుర్ఘటనకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుల సంఖ్యపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.