📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి

Train Hijack: రైలు హైజాక్ ఎలా జరిగింది అంటే: ట్రైన్ డ్రైవర్ వివరణ

Author Icon By Vanipushpa
Updated: March 14, 2025 • 4:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) మిలిటెంట్లు జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై దాడి చేసిన ఘటనలో రైలు లోకో పైలెట్ (డ్రైవర్) అంజాద్ హైజాక్ పరిస్థితులను వివరించారు. బీఎల్ఏ మిలిటెంట్లు తొలుత ట్రాక్ ను పేల్చివేశారని వెల్లడించారు. రైలు ఆగగానే బీఎల్ఏ ఉగ్రవాదులు దాడి ప్రారంభించారని ఆయన వివరించారు. మిలిటెంట్లు రైలు కిటికీలను పగలగొట్టి లోపలికి ప్రవేశించారని, తాము చనిపోయామని వారు భావించారని వివరించారు. వారు అలా అనుకోవడమే తమ ప్రాణాలను కాపాడిందని అన్నారు.

కమాండోలు తమ ప్రాణాలను పణంగా పెట్టి తమను రక్షించారు

దాడి తర్వాత విడుదలైన ప్రయాణికుల్లో ఒకరు మాట్లాడుతూ, పేలుడు తర్వాత దుండగులు తమను బందీలుగా చేసుకున్నారని తెలిపారు. కమాండోలు తమ ప్రాణాలను పణంగా పెట్టి తమను రక్షించారని, సైన్యం చూపిన తెగువ తమకు ధైర్యాన్నిచ్చిందని అన్నారు. మరోవైపు, పాకిస్తాన్ సైన్యం జాఫర్ ఎక్స్‌ప్రెస్ బందీ సంక్షోభానికి ముగింపు పలికినట్లు ప్రకటించింది. నైరుతి బలూచిస్తాన్‌లో జరిగిన ఈ ఘటనలో 33 మంది దుండగులను హతమార్చినట్లు, 340 మందికి పైగా ప్రయాణికులను విడిపించినట్లు సైన్యం తెలిపింది.

బీఎల్ఏ మాత్రం సైన్యం వాదనను ఖండించింది

అయితే, బీఎల్ఏ మాత్రం సైన్యం వాదనను ఖండించింది. ఇంకా బందీలు తమ వద్దే ఉన్నారని, భద్రతా దళాలతో పోరాడుతున్నామని తెలిపింది. పాకిస్తాన్ సైన్యం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని, సైన్యం రక్షించినట్లు చెబుతున్న బందీలను తామే విడుదల చేశామని బీఎల్ఏ చెప్పుకొచ్చింది.

మరణించిన వారి సంఖ్యపై భిన్నాభిప్రాయాలు

మరణించిన వారి సంఖ్యపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సైన్యం ప్రకారం 21 మంది బందీలు, నలుగురు సైనికులు మరణించారు. అయితే, బలూచిస్తాన్‌లోని రైల్వే అధికారి తెలిపిన వివరాల ప్రకారం 25 మృతదేహాలను సంఘటనా స్థలం నుండి మచ్ పట్టణానికి తరలించారు. మృతుల్లో 19 మంది సైనికులు, ఒక పోలీసు, ఒక రైల్వే అధికారి ఉన్నారని, మరో నలుగురిని గుర్తించాల్సి ఉందని ఆ అధికారి తెలిపారు.

How the train hijack happened Train driver's explanation

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.