📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు!

Houthis: గ్రనేడ్లతో పేల్చేసి, మరో నౌకను ముంచేసిన హూతీలు

Author Icon By Vanipushpa
Updated: July 10, 2025 • 3:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఎర్రసముద్రంలో ఓ కార్గో షిప్‌పై యెమెన్‌(Yemen)కు చెందిన హూతీ(Houthis)లు దాడి చేసి ముంచేశారని, ఈ దాడిలో నౌకలోని సిబ్బందిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు యూరోపియన్ నేవల్ మిషన్(European Navel Mission) తెలిపింది. ఈ ఘటనలో మరో ఆరుగురు సురక్షితంగా బయటపడ్డారని పేర్కొంది. లైబీరియన్(Libirian) జెండాతో, గ్రీకు సంస్థ నిర్వహణలో ఉన్న ఎటర్నిటీ సీ అనే రవాణా నౌకలో 25 మంది సిబ్బంది ఉన్నారు. సోమవారం చిన్న చిన్న పడవల్లో వచ్చి, రాకెట్ల ద్వారా గ్రనేడ్లను ప్రయోగించడంతో నౌకకు తీవ్ర నష్టం వాటిల్లిందని, ఈ దాడిలో నౌకలోని ప్రొపెల్లర్ వ్యవస్థ ధ్వంసమైందని బ్రిటన్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ ఏజెన్సీ తెలిపింది. ఈ దాడులు మంగళవారం కూడా కొనసాగాయి. రాత్రి నుంచి నౌకలోని సిబ్బంది కోసం గాలిస్తున్నారు. ఎటర్నిటీ సీ నౌక ఇజ్రాయెల్ వెళుతోందని, అందుకే దానిపై దాడి చేసినట్లు ఇరాన్ మద్దతున్న హూతీలు ప్రకటించారు. సిబ్బందిలో కొందరిని తాము ‘సురక్షిత ప్రాంతాని’కి తరలించినట్లు చెప్పారు. అయితే, వారి సంఖ్య వెల్లడించలేదు.

Houthis: గ్రనేడ్లతో పేల్చేసి, మరో నౌకను ముంచేసిన హూతీలు

‘మేజిక్ సీస్’పై హూతీలు మిసైల్స్, డ్రోన్లతో దాడి

దీనికి ముందు ఆదివారం, లైబీరియన్ జెండాతో గ్రీస్ సంస్థ నిర్వహణలో నడుస్తున్న రవాణా నౌక ‘మేజిక్ సీస్’పై హూతీలు మిసైల్స్, డ్రోన్లతో దాడి చేశారు. “అది ఆక్రమిత పాలస్తీనాలోని పోర్టుల్లోకి ప్రవేశించడంపై నిషేధం ఉన్న కంపెనీకి చెందినది” అందుకే దానిపై దాడి చేసినట్లు హూతీలు ప్రకటించారు. సాయుధులైన కొందరు వ్యక్తులు నౌకలోకి వచ్చి పేలుడు పదార్థాలు అమర్చిన తర్వాత, వరుస పేలుళ్లు జరిగి అది మునిగిపోయినట్లు మంగళవారం హూతీలు విడుదల చేసిన వీడియో ఫుటేజ్‌లో కనిపిస్తోంది. మేజిక్ సీస్ రవాణా నౌకకు చెందిన 22 మంది సిబ్బందిని పక్కనే వెళుతున్న మరో వాణిజ్య నౌక రక్షించింది.
పాలస్తీనియన్లకు మద్దతుగా దాడులు
2023 నవంబర్ నుంచి హూతీలు ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌లో మిసైల్స్, డ్రోన్లు, చిన్నచిన్న బోట్లలో వచ్చి దాదాపు 70 కార్గో షిప్‌‌లపై దాడులు చేశారు. ఇజ్రాయెల్ గాజాలో హమాస్‌పై దాడుల నేపథ్యంలో తాము పాలస్తీనియన్లకు మద్దతుగా వ్యవహరిస్తున్నట్లు హూతీలు చెబుతున్నారు. అలాగే.. ఇజ్రాయెల్, అమెరికా, యూకేకు చెందిన నౌకలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నట్లుగా తరచూ పొరబడుతున్నారని, ఈ దేశాలు తమపై చేసిన వైమానిక దాడులకు ఇది ప్రతిస్పందనగా పేర్కొంటున్నారు. ఎటర్నిటీ సీ నౌకపై జరిగిన దాడికి అంతర్జాతీయ స్పందనలో భాగంగా, సహాయక చర్యల్లో తాము కూడా పాల్గొంటున్నట్లు ఎర్ర సముద్రంలో ఈయూకు చెందిన నేవల్ మిషన్‌ ‘ఆపరేషన్ యాస్పైడ్స్’ తెలిపింది. సముద్రం నుంచి ఇప్పటివరకూ ఆరుగురిని రక్షించినట్లు పేర్కొంది. ఈ ఆరుగురిలో ఐదుగురు ఫిలిప్పైన్స్‌ జాతీయులు కాగా, ఒకరు భారతీయుడని, మరో 19 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదని యాస్పైడ్స్ ప్రతినిధి వార్తా సంస్థ ఏఎఫ్‌పీతో చెప్పారు.

వార్తా సంస్థ రాయిటర్స్ ప్రకారం..

గ్రీస్‌కు చెందిన మారిటైమ్ సెక్యూరిటీ సంస్థ డయాప్లస్ బుధవారం ఒక వీడియోను విడుదల చేసింది. ఇందులో సముద్రపు నీటిలో 24 గంటలు గడిపిన ఐదుగురిని కాపాడినట్లు ఉంది. “మిగిలిన వారి ఆచూకీ తెలిసే వరకూ గాలింపు చర్యలు కొనసాగిస్తాం” అని డయాప్లస్ తెలిపింది. ఈ దాడిలో నలుగురు చనిపోయారనని మారిటైమ్ సెక్యూరిటీ సంస్థలు చెప్పినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ కూడా రిపోర్ట్ చేసింది. మేజిక్ సీస్, ఎటర్నిటీ సీ మీద జరిగిన దాడుల్ని అమెరికా విదేశాంగ శాఖ ఖండించింది. “సముద్ర మార్గాల్లో స్వేచ్ఛాయుత రవాణా, ప్రాంతీయ ఆర్థిక సుస్థిరత, సముద్ర మార్గాల భద్రతకు ఇరాన్ మద్దతున్న హూతీల నుంచి ముప్పు పొంచి ఉంది” అని పేర్కొంది .

హౌతీలు దేని కోసం పోరాడుతున్నారు?

హౌతీలు తమ ఉత్తర కోటకు ఎక్కువ స్వయంప్రతిపత్తితో సహా అనేక పరస్పర అనుసంధాన కారణాల కోసం పోరాడుతున్నారు, వారు అవినీతి మరియు వివక్షత కలిగిన ప్రభుత్వంగా భావించే దానిని సవాలు చేస్తున్నారు.

హౌతీలు సున్నీలా లేక షియాలా?
యెమెన్‌లోని హౌతీ ఉద్యమం షియా ముస్లింలు, ప్రత్యేకంగా జైదీ శాఖకు చెందినవారు. జైదీలు మతపరమైన చట్టంలో సున్నీ ముస్లింలతో కొన్ని సారూప్యతలను పంచుకున్నప్పటికీ, ఇమామేట్ భావనపై వారి నమ్మకంలో వారు భిన్నంగా ఉంటారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:Elon Musk: ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య మళ్లీ భగ్గుమన్న విభేదాలు

#telugu News Houthi grenade attack Houthis attack ship maritime security threat middle east conflict Red Sea shipping attack ship sunk by Houthis Yemen Houthis

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.