📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర

Telugu News: Hong kong: ఓ కార్మికుడి తప్పిదమే హాంకాంగ్ విషాదానికి కారణమా?

Author Icon By Sushmitha
Updated: November 29, 2025 • 12:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

128 మంది మృతి.. హాంకాంగ్ లో జరిగిన ఘోర అగ్నిప్రమాద విషాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. అంతులేని ఆవేదనను మిగిల్చిన ఈ ఉదంతంపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. వందలాది మంది ఆచూకీ గల్లంతు కావడంతో తమ ప్రియుల కోసం కుటుంబ సభ్యుల ఆందోళన అంతా ఇంతా కాదు. ఒకవైపు గృహాలను కోల్పోయి, నిలువనీడ లేకుండా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాత్కాలిక రిలీఫ్ శిబిరాల్లో ఉంటూ, మరోవైపు తమవారు క్షేమంగా ఉన్నారో లేదో తెలియక అయోమయస్థితిలో పలు కుటుంబాలు ఉన్నాయి.

Read Also: Floods: థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి

Hong Kong Was the fault of a worker the cause of the Hong Kong tragedy?

హాంకాంగ్ చరిత్రలోనే ఊహించని రీతిలో ఘోరం జరిగిపోయింది.

గత బుధవారం సాయంత్రం హాంకాంగ్ (Hong kong) బహుళ అపార్ట్ మెంట్లలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇప్పటివరకు 128 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా వందలాది ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. తమ వారి జాడ కోసం రక్తసంబంధికులు పడుతున్న పాట్లు అన్నిఇన్ని కావు. మృతదేహాలు కాలిపోవడంతో గుర్తుపట్టలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇంకొందరు తమవారు క్షేమంగా రావాలంటూ ఎదురుచూస్తూ కన్నీళ్లు పెడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ ప్రమాదానికి అసలు కారణం ఏమిటి.అగ్నిప్రమాదం తర్వాత అధికారులు రంగంలోకి దిగారు.

ప్రమాదానికి గల కారణాలపై అన్వేషస్తుండగా కీలక వీడియో వెలుగులోకి వచ్చింది. 

అపార్ట్మెంట్ మరమ్మతుల కోసం రక్షణ వలయంగా పెద్దఎత్తున ఏర్పాటు చేశారు. ఆ సెంట్రింగ్ పై ఒక కార్మికుడు ప్రమాదకర స్థితిలో సిగరెట్ తాగుతూ కనిపించాడు. సిగరెట్ తాగి అక్కడే పడేయడంతో నెమ్మదినెమ్మదిగా మంటలు అంటుకున్నాయి. వెదురు స్మాఫోల్డింగ్, మండే ఫోమ్ బోర్డుల కారణంగా వెంటనే వేగంగా మంటలు వ్యాపించినట్లుగా అధికారులు ప్రాథమికంగా కనిపెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే సిగరెట్ కారణంగానే మంటలు అంటుకున్న విషయాన్ని అధికారులు అధికారికంగా ధృవీకరించలేదు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

building tragedy Google News in Telugu Hong Kong fire Industrial Accident Latest News in Telugu negligence investigation Telugu News Today worker error

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.