హాంగ్‌కాంగ్‌లో ఓ అపార్ట్మెంట్ సముదాయంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. Tai Po ప్రాంతంలోని Wang Fuk అపార్ట్మెంట్ టవర్స్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి కొన్ని నిమిషాల్లోనే భారీగా వ్యాపించాయి. అగ్నిప్రమాదం సంభవిస్తున్న సమయంలో భవంతుల్లో వేల సంఖ్యలో నివాసితులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో ఇప్పటి వరకు నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
Read also: Petrol Price: 2027కు 30 డాలర్లకు ముడిచమురు..పెట్రోల్ రేట్లు తగ్గుతాయా?
నిప్పు చిమ్మినట్టుగా ఎగిసిపడుతున్న దృశ్యాలు
అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తేవడానికి భారీగా శ్రమిస్తున్నారు. పొగ మరియు మంటల తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల రక్షణ చర్యలు కష్టంగా మారాయి. కొన్ని ఫ్లాట్లలో ఇంకా పలువురు చిక్కుకుని ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. వారికి సురక్షితంగా బయటకు తీసుకురావడానికి ప్రత్యేక బృందాలు పని చేస్తున్నాయి.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో (social media) విపరీతంగా ప్రచారం అవుతున్నాయి. టవర్స్ అంతా నిప్పు చిమ్మినట్టుగా ఎగిసిపడుతున్న దృశ్యాలు చూసిన ప్రజలు షాక్‌కు గురవుతున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణం ఏమిటన్నది ఇంకా వెల్లడికాలేదు. దానికి సంబంధించిన వివరాలను సమగ్రంగా విచారిస్తున్నామని అధికారులు తెలిపారు. స్థానికులకు ఎలాంటి ఆపదలు కలగకుండా మొత్తం ప్రాంతాన్ని ఖాళీ చేయించి భద్రతా చర్యలు చేపట్టారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: