📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Hong Kong: హాంకాంగ్ భారీ అగ్నిప్రమాదం .. పెరుగుతున్న మృతుల సంఖ్య

Author Icon By Sushmitha
Updated: November 27, 2025 • 12:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇప్పటివరకు 44 మంది మరణించినట్లు అధికారుల వెల్లడిఒక నిర్లక్ష్యం దాని పర్యవసానం చాలా ఉంటుంది. ఆ నష్టం కూడా భారీగానే ఉంటుంది. అందుకే పెద్దలు అంటారు అజ్ఞానం కంటే నిర్లక్ష్యం ఎక్కువ కీడు చేస్తుంది. ప్రమాదమో లేక ఉద్దేశపూర్వకంగా చేశారో తెలియదు కానీ హాంకాంగ్ లో (Hong Kong) జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతూ ఉండడం తీవ్రంగా కలచివేస్తున్న ఘటన ఇది. వందలాదిమంది తమ నివాసాలను కోల్పోయి, తాత్కాలిక నివాసంలో తలదాచుకునే దుస్థితి ఏర్పడింది. బుధవారం హాంకాంగ్ లో జరిగిన అగ్ని ప్రమాదం ఎవరూ ఊహించని విషాదం చోటుచేసుకుంది. 

Read Also: solar eclipse: వచ్చే ఆగస్టు రెండున అత్యంత సుదీర్ఘ సూర్య గ్రహణం

Hong Kong Massive fire in Hong Kong.. Death toll rising

మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. మరిన్ని పెరగవచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. థాయ్ పొ జిల్లాలో ఓ పెద్ద బిల్డింగ్ లో చెలరేగిన మంటలు పక్కన అపార్ట్మెంట్లకూ వ్యాపించడంతో ప్రమాదం పెద్దగా అయింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 44మంది మరణించారు. మరో 300 మంది గల్లంతయ్యారు. ఆ నివాస సముదాయంలో మొత్తం 2వేల ఇళ్లు ఉన్నాయి. వాటిల్లో కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. మొత్తం 7 అపార్ట్మెంట్లలో 4,800 మంది ప్రజలు నివసిస్తున్నారు. అగ్నిప్రమాదంతో 700మందిని తాత్కాలిక నివాసాలకు తరలించారు. ఈ ఘటనకు కారణమైన ముగ్గరిని హాంకాంగ్ పోలీసులు అరెస్టు చేశారు.

దట్టమైన పొగలతో సహాయానికి ఆటంకాలు

భవనంలో మంటలు చెలరేగడంతో పాటూ దట్టమైన పొగ అలుముకుంది. భవనాలు అన్నీ దగ్గర దగ్గరగానే ఉండడంతో మిగతా వాటికి వేగంగా మంటలు వ్యాపించాయి. మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవిస్తే రాత్రి వరకు మంటలు అదుపులోకి రాలేదు. 128 ఫైరింజన్లతో సహాయ చర్యలు చేపట్టగా, 57 అంబులెన్స్ లు ఘటనాస్థలంలో మోహరించారు. ఈ ప్రమాదంలో ఫైర్ సిబ్బంది ఒకరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యసేవల్ని అందిస్తున్నారు. 300 మంది గల్లంతు కావడంతో కుటుంబ సభ్యుల ఆవేదన వర్ణనాతీతంగా ఉంది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

building blaze casualties rising emergency services Google News in Telugu Hong Kong fire Latest News in Telugu Telugu News Today urban disaster

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.