ప్రమాదమో లేక కావాలని చేసిందో తెలియదు కానీ ప్రతివారి గుండె బరువైపోయింది. ఎవరిని పలకరించినా కన్నీరే తప్ప మాటలు లేవు. కళ్లముందే ఇంటివస్తువులు కాలిపోయాయి. అందమైన ఇల్లు క్షణాల్లో మంటలకు ఆహుతి అయ్యింది. అయిన వారిని కోల్పోయి కొందరు, తమ వారు ఆచూకీ తెలియక మరికొందరు.. ఇలా అందరిలో ఆవేదనే నిండుకుని ఉంది. నిలువ నీడను కోల్పోయి, తాత్కాలిక నివాసాల్లో ఉంటూ, తమ గూటికి ఎప్పుడు చేరుకుంటా మో తెలియని అయోమయస్థితిలో గుండెల్లో తొంగిచూస్తున్న భయాలు..
Read Also: Trump: ఆ దేశాలకు వలసలను శాశ్వతంగా నిలిపివేత: ట్రంప్
హాంకాంగ్ లో దగ్ధం అవుతున్న అపార్ట్మెంట్ వాసులు
ఎక్కడ చూసినా హాంకాంగ్ లో (Hong Kong) దగ్ధం అవుతున్న అపార్ట్మెంట్ వాసులు గగ్గోలు..ఏడుపులు, పెడబొబ్బలతో ఆ ప్రాంతమంతా కన్నీటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. కారణం హాంకాంగ్ లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. గత రెండురోజుల క్రితం ఏడు బహుళ అంతస్తుల బిల్డింగ్స్ లో (Buildings) అగ్నిప్రమాదం చోటు చేసుకున్న సంగతి విధితమే. ఈ విషాద ఘటనలో ఇప్పటిదాకా 128 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. 200మందికి పైగా ఇంకా ఆచూకీ దొరకలేదని పేర్కొన్నారు. ఈ ఘోర అగ్నిప్రమాదం జరిగిన అనంతరం ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది కొన్ని గంటలపాటు తీవ్రంగా శ్రమించి మంటలు ఆర్పేశారు.
తనిఖీ చేసేకొద్దీ పెరుగుతున్న మృతుల సంఖ్యఈ క్రమంలో ఒక్కో బిల్డింగ్ ను తనిఖీ చేస్తుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. బుధవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటు చేసుకున్న ఈ ప్రమాదం కొన్ని క్షణాల్లోనే ఇతర అపార్ట్మెంట్ లకు వ్యాపించాయి. ఈ మంటలు ఆర్పేందుకు దాదాపు వెయ్యిమందికి పైగా అగ్నిమాపక సిబ్బంది శ్రమించారు. వీటికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల ఆవుతున్నాయి. ఈ భవనాల మరమత్తులు చేపట్టిన నేపథ్యంలో కిటికీల వద్ద పాలిస్టరైన్ బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే మంటల తీవ్రత పెరిగినట్లు అధికారులు అంటున్నారు. ఆ బిల్డింగుల మరమ్మతుల కోసం ఏర్పాటు చేసిన వెదురు బొంగులు, నిర్మాణ మెష్ కూడా మంటల తీవ్రత పెరిగేందుకు కారణమై ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.
రోజురోజుకు పెరుగుతున్న మృతుల సంఖ్య
ఈ అగ్నిప్రమాదం జరిగిన హౌసింగ్ కాంప్లెక్స్ ను 1983లో తైపో అనే జిల్లాలో నిర్మించారు. ఇందులో 8 టవర్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా దగ్గరగా 31 అంతస్తుల్లో ఉన్నాయి. మొత్తం 1984 ప్లాట్లు ఉన్నాయి. దాదాపు 4600 మంది ఈ అపార్ట్మెంట్లలో నివసిస్తున్నారని అధికారులు చెప్పారు. మరో విషయం ఏంటంటే ఇక్కడ 40 శాతానికి పైగా 65 ఏళ్లు పైబడిన వారే ఉన్నట్లు సమాచారం. అయితే ఈ అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య రోజురోజుకు పెరగడం ఆందోళన రేపుతోంది. మరోవైపు క్షతగాత్రలకు ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: